GSLV F-10: బ్రేకింగ్.. సాంకేతిక సమస్యతో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-10 రాకెట్ ప్రయోగం విఫలం..!!

Share

GSLV F-10: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బుధవారం ప్రయోగించిన జీఎస్ఎల్‌వీ – ఎఫ్ 10 రాకెట్ ప్రయోగం విఫలం అయ్యింది. రెండు స్టేజీల వరకు విజయవంతంగా నింగిలోకి దూసుకువెళ్లిన రాకెట్ క్రయోజనిక్ మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో జీఎస్ఎల్‌వీ పయనించింది. దీంతో ప్రయోగం విఫలమైందని ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు.

GSLV F-10 fails
GSLV F-10 fails

శ్రీహరి కోట నుండి గురువారం ఉదయం జీఎస్ఎల్‌వీ ఎఫ్ 10 ని శాస్త్రవేత్తలు ప్రయోగించారు. బుధవారం ఉదయం 3.43 గంటలకు ఈ వాహన నౌక కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 26 గంటల పాటు నిరంతరాయం కౌంట్ డౌన్ కొనసాగిన తర్వాత వాహన నౌక నింగిలోకి వెళ్లింది. సాంకేతిక లోపంతో ప్రయోగం విఫలం కావడంతో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. కాగా సరిహద్దుల పర్యవేక్షణ, పకృతి వైపరీత్యాల అంచనాల కోసం జీఎస్ఎల్‌వీ ఎఫ్ 10 రాకెట్ ను ఇస్రో ప్రయోగించింది. గత ఏడాది ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కరోనా ఉధృతి, సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది.


Share

Related posts

జూపూడి మేటర్ లో జగన్ వైఖరి దేనికి సంకేతం? పార్టీ మారి తిరిగివస్తే అంతే సంగతులా??

Yandamuri

నూతనవధూవరులు నిహారికా – చైతన్యల ఫస్ట్ ఫోటో..! అదరహో….!

bharani jella

Today Horoscope జనవరి -22- శుక్రవారం ఈరోజు రాశి ఫలాలు.

Sree matha