NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

గోదావరిఖనిలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న గుజరాత్ పోలీసులు

Advertisements
Share

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ ఆంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఆ ప్రాంతంలో కలకలాన్ని రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న వారు గోదావరిఖని లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారంతో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మహమ్మద్ జావిద్ (46) తో పాటు అతని కూతురు ఖతిజా (19) ను అదుపులోకి తీసుకున్నారు. జావిద్ హైదరాబాద్ లోని అమీర్ పేటలో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. తండ్రి కూతుర్లు టోలి చౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పర్వదినం కోసం తండ్రి కూతురులు గోదావరిఖనికి వచ్చినట్టు తెలుస్తొంది.

Advertisements
Arrest

 

అయితే తండ్రి కూతుర్లు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు..? వీరి ప్రమేయం ఎంత మేర ఉన్నది అనే విషయాలు తెలియ రాలేదు. సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్రా సహాయ సహకారాలు  అందిస్తున్నారా అన్న విషయం దర్యాప్తులో తేలనున్నది. అనుమానితులగా మాత్రమే తీసుకెళుతున్నామని ఏటీఎస్ బృందం స్థానిక పోలీసు అధికారులకు వివరించినప్పటికీ వీరి ఆచూకీ పట్టుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతం వరకు వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనం అయ్యింది.

Advertisements

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మరో సారి ఘాటుగా విమర్శలు చేసిన సీఎం వైఎస్ జగన్


Share
Advertisements

Related posts

జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోండి!!

Kumar

Today Horoscope ఫిబ్రవరి – 27 – మాఘమాసం – శనివారం.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు !

Sree matha

ఏపీ కంపు తెలంగాణకు చేరింది..! తెలంగాణ వాకిటకూ కుల రాజకీయం..!?

Srinivas Manem