Gujarat Exit Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పర్వం రెండు దశల్లో ముగిసింది. ఈ నెల 8వ తేదీ ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారం పోలింగ్ సమయం ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. 1995 నుండి గుజరాత్ లో వరుసగా ఆరు సార్లు అధికారాన్ని కైవశం చేసుకున్న బీజేపీకి ఈ సారి ఆప్ రాకతో గట్టిపోటీ తప్పదని భావించారు. గత ఎన్నికల వరకూ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ కొనసాగగా మొదటి త్రిముఖ పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 99 స్థానాలతో బీజేపీ సరిపెట్టుకుంది. ఈ సారి జరిగిన త్రిముఖ పోటీతో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్ అంచనాలు అన్ని అటు ఇటుగా బీజేపీదే హవాగా అంచనా వేశాయి. పెద్ద ఎత్తున ఉచిత పథకాల హామీలను ఇచ్చి ఒటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసిన ఆప్ పెద్దగా సీట్లు సాధించే పరిస్థితి లేనట్లుగా ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాయి. 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే.

పీ మార్క్వీ ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం.. బీజేపీకి 128 నుండి 148, కాంగ్రెస్ పార్టీకి 30 నుండి 42, ఆమ్ అద్మీ పార్టీకి 2 నుండి 10.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 117 నుండి 140, కాంగ్రెస్ పార్టీకి 34 నుండి 51, ఆప్ కి 6 నుండి 13. ఇతరులకు 0 నుండి 3,
ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం .. బీజేపీకి 98 నుండి 110, కాంగ్రెస్ కు 66 నుండి 71, ఆప్ కి 9 నుండి 14.
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్ ప్రకారం .. బీజేపీకి 128 నుండి 148, కాంగ్రెస్ కి 30 నుండి 42, ఆప్ కి 2 నుండి 10.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 125 నుండి 143, కాంగ్రెస్ కి 30 నుండి 48, ఆప్ కి 3 నుండి 7
టీవీ 9 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం .. బీజేపీకి 125 నుండి 130, కాంగ్రెస్ కి 30 నుండి 40, ఆప్ కి 3 నుండి 5

మొత్తం మీద అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వంద కుపైగా సీట్లు గెలుచుకుంటుందని స్పష్టం చేశాయి. కాంగ్రెస్ మరో సారి రెండవ స్థానానికి పరిమితం అవుతుందని, ఆప్ కి నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చూస్తే అర్ధం అవుతోంది. అయితే మరో పక్క హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ మద్య నువ్వానేనా అన్నరీతిలో పోటీ జరిగినట్లుగా ఎగ్జిట్ పోల్ పోల్స్ అంచనాలు వచ్చాయి. 68 స్థానాలు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 29 నుండి 39, కాంగ్రెస్ పార్టీకి 27 నుండి 37, ఇతరులు 2 నుండి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం బీజేపీకి 34 నుండి 39, కాంగ్రెస్ పార్టీకి 28 నుండి 33, ఆప్ ఒకటి, ఇతరులు 1 నుండి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది. టైమ్స్ నౌ అంచనాల ప్రకాారం బీజేపీకి 44, కాంగ్రెస్ 21, ఇతరులు ఒకటి స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలిపాయి.
TRS MLC Kavitha: సీబీఐ విచారణకు సహకరిస్తా.. కానీ