Gully Rowdy Love Song: ఇటీవల A1 ఎక్స్ప్రెస్ సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. తాజాగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం గల్లీ రౌడీ.. కామెడీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవల విజయ్ దేవరకొండ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.. తాజాగా “పుట్టినే ప్రేమ.. పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా”.. అంటూ సాగే ప్రేమ గీతం ను విడుదల చేశారు మేకర్స్..!!

ఈ పాటలో గల్లీ రౌడీ లో మరో యాంగిల్ ను చూపించాడు దర్శకుడు.. ఇటీవల విడులైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది.. ఈ లవ్ సాంగ్ తో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి.. ఈ సినిమా లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ , యాక్టర్ బాబీ సింహ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కోనా వెంకట్ సమర్పణలో కోనా ఫిలిం కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్ పతాకాలపై కోన వెంకట్, ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాయి రామ్, చౌరస్తా రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది..