Gun Misfire; గన్ మిస్ ఫైర్ అయి హోంగార్డు భార్య మృతి చెందిన ఘటన విజయవాడ గొల్లపూడిలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం సీఎం సెక్యూరిటీ వింగ్ ఎఎస్పీ శశికాంత్ వద్ద అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వినోద్..ఎఎస్పీ సర్వీస్ రివార్వర్ ను భార్య సూర్యరత్నకు చూపుతుండగా మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ ఆమె గుండెల్లోకి దూసుకువెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
ఎఎస్పీ శశికాంత్ మూడు రోజుల క్రితం అనంతపురం క్యాంపుకు వెళ్లారు. దీంతో ఎఎస్పీ సర్వీస్ రివాల్పర్ హోంగార్డు వినోద్ వద్దనే ఉంది. సరదాగా భార్యకు రివాల్వర్ చూపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఘటన రాత్రి 2గంటల సమయంలో జరిగిందని పేర్కొంటున్నారు. భవానీ పురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హోంగార్డు వినోద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.