Guppedantha Manasu October 13 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 579వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 13న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..గత ఎపిసోడ్ లో వసు రిషికి రాజు రాణి బొమ్మల్ని గిఫ్ట్ గా ఇస్తుంది.ఈరోజు కూడా అదే సీన్ కంటిన్యూ అవుతుంది.వసు ఇచ్చిన బొమ్మలు చూస్తూ ఉన్న రిషి దగ్గరికి గౌతమ్ వచ్చి అరే ఈ బొమ్మలు చాలా బాగున్నాయి అని తన దగ్గర నుంచి తీసుకోబోతాడు. అయితే రిషి మాత్రం ఆ బొమ్మలు ఇవ్వకుండా ఇవి నా బొమ్మలు ఇవ్వను అంటాడు. ఇక గౌతమ్ మాత్రం ఈ మధ్య నీకు చాలా ఎక్కువ అయింది అని రిషిని అటపట్టిస్తూ ఉంటాడు.అరేయ్ గౌతమ్ నాకు ఒక సహాయం చేయాలి అని అంటాడు. ఏంటి అని అడగగా మన ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నాం నువ్వు హెల్ప్ చేయాలి అని అంటాడు .సరే తప్పుతుందా అంటాడు గౌతమ్.
జగతికి భోజనం వడ్డించిన రిషి.. ఆనందంలో కుటుంబ సభ్యులు :
తరువాత సీన్ లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న కుటుంబ సభ్యులందరూ రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. రిషి ఇంకా రాలేదు ఏంటి అని అడుగుతుంది దేవయాని. నేను ఫోన్ చేశాను అండి లిఫ్ట్ చేయలేదు అందుకే మెసేజ్ పెట్టాను అని వసు చెప్పేలోగా రిషి అక్కడికి చేరుకుంటాడు.రిషి రాగానే వడ్డించబోతున్న ధరణిని కూర్చోమని చెప్పి నేను వడ్డిస్తాను అని రిషి అందరికీ వడ్డిస్తూ ఉంటాడు ఇక జగతి మేడం దగ్గరికి కూడా వెళ్లి ప్రత్యేక శ్రద్ధతో భోజనం వడ్డిస్తాడు.డాడ్ డాక్టర్ ఏమైనా ఆహారం. విషయంలో మేడం ఏమి తినాలో లేదో అనే విషయాలు చెప్పారా అని అడుగుతాడు. అన్ని తినమన్నారు అంటే ఇంకేటి మేడం చక్కగా తినండి అంటాడు.ఇదంతా చూస్తున్న దేవయాని కి కడుపు మండిపోతుంది. అప్పుడు రిషి తండ్రికి డాడ్ మేడం ను తీసుకుని మీరు ఎక్కడికైనా పిక్నిక్ కు వెళ్లొచ్చు కదా అని అనడంతో అందరు నిజమే సార్ వెళ్ళండి అంటారు.సరే ప్లాన్ చేద్దాము అంటాడు మహేంద్ర.డాడ్ మీ సంతోషమే నా సంతోషం అని
బంధాలని ఒప్పందాల పేరుతో బంధించనంతవరకే బాగుంటాయి అని అంటాడు.రిషి మాట్లాడింది గురుదక్షిణ ఒప్పందం గురించే అని మహేంద్రకు అర్థమవుతుంది
రిషి ఇచ్చే షాక్స్ కు అయోమయంలో దేవయాని :
ఇక అందరు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా బొమ్మల కొలువు గురించి నీకేం తెలుసు రిషి అని అడుగుతాడు గౌతమ్. ఈ బొమ్మల కొలువులు అవి చిన్నప్పుడు అందరు ఇళ్లల్లో జరుపుకుంటే చూసేవాడిని ఇలాంటి పండుగలు నా బాల్యంలో చాలా తక్కువ అని అంటాడు రిషి.అప్పుడు మహేంద్ర అవును అందుకే మన ఇంట్లో బొమ్మల కొలువు పెడదామని అంటాడు. అక్కడే వున్న దేవయానిని చూస్తూ పెద్దమ్మ పర్మిషన్ లేకుండా ఏది జరగదు అని అంటాడు రిషి. ఆమెని ఇరకాటంలో పడేస్తూ.. అందుకు పొంగిపోతుంది దేవయాని. పెద్దమ్మ పర్మిషన్ ఉంది కాబట్టే మనం బొమ్మల కొలువు పెడుతున్నాము అని అంటాడు రిషి.ఇక దేవాయని మాత్రం ఏడ్చినట్టే ఉంది మీరే ప్రశ్నలు వేసుకుంటున్నారు..మీరే సమాధానాలు చెప్పుకుంటూ మధ్యలో నాకు పెద్దరికం అంటున్నారు.ఇంక నేనెందుకు అని మనసులో అనుకుంటుంది.ఇక దేవయాని ఒక్కొక్కరికి ఒక్కో. పని అప్పచెప్పుతుంది.అక్కయ్య కలశం సంగతి మీరు చూసుకోండి.బొమ్మలు సంగతి మేము చూసుకుంటామని అంటుంది జగతి.ఇక గౌతమ్ ను స్టోర్ రూమ్ లో ఉన్న నిచ్చేనకి డెకరేషన్ నువ్వు చెయ్ అంటుంది.
భూషణ్ ఇంట్లో మొదలయిన బొమ్మలకొలువు హడావుడి:
బొమ్మల్ని సర్దడంలో మహేంద్ర, గౌతమ్, జగతి, ధరణి అందరు బిజీగా ఉంటారు. బొమ్మల కొలువు గురించి దేవయాని ఏదో చెప్పే అంతలో నేను చెప్తాను అంటూ అందమైన లంగా వోణిలో మెట్లు దిగుతూ ఉంటుంది.వసును చూసి అందరు ముచ్చటపడతారు. రిషి అయితే వసును కళ్ళు ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటాడు.ఇక వసు వచ్చి బొమ్మల కొలువు గురించి చెప్పిన తరువాత కొన్ని చీరలు కావాలి అని అనడంతో ధరణి పైన రూంలో ఉన్నాయి అంటే సరే నే వెళ్తా అంటుంది వసు.
అందరి ముందు రిషి చేయిపట్టుకున్న వసు :
చీరల కోసం పైకి వెళ్తున్న వసుని ఆపి ఒక్కత్తివే ఏం వెళ్తావ్ ఎవరినైనా తీసుకెళ్లొచ్చు కదా అంటాడు రిషి. వెనక్కి వచ్చిన వసు మీరే రండి సార్ అని రిషి చేయి పట్టుకుని వెళ్తుంది.అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ముసిముసిగా నవ్వుకుంటారు ఒక్క దేవయాని తప్ప, అప్పుడు మహేంద్ర జగతి ఇద్దరు సంతోషిస్తారు.పైకి వెళ్లిన రిషి వసుని అలా పైకి లాక్కు వచ్చేసావేంటి అని అడుగుతాడు. అందుకు వసు నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావ్ అని అడగగా కొన్ని ప్రశ్నలకు నవ్వే సమాధానం ఉంటుంది. అది విని వెనక్కి తిరుగుతాడు రిషి. మీరు ఎందుకు వెనక్కి తిరిగారు అని అడగగా కొన్ని ప్రశ్నలకు ఇది కూడా సమాధానమే అని అంటాడు రిషి. సరే రండి సార్ మంచి చీరలు కొన్ని మీరు సెలెక్ట్ చేయండి అందులో కొన్ని నేను ఫైనల్ చేస్తాను అని అంటుంది.ఆ మాత్రానికి నేనెందుకు, నువ్వే సెలెక్ట్ చేసి ఫైనల్ చేయవచ్చు కదా అంటాడ. ఇలాంటి కొన్ని జ్ఞాపకాలు మనకు ఉండాలి సార్ అని అంటుంది.మీతో గడిపిన ప్రతి సమయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను అని అంటూ ఇద్దరూ చీరలు పైనుంచి బీరువా దగ్గరికి వెళ్తారు.ఇక కింద గౌతమ్, జగతి బొమ్మల కొలువు ఏర్పాట్లు చేస్తూ దేవాయని మీద కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు. దేవయాని మాత్రం అలానే కోపంగా చూస్తూ ఉంటుంది.