Guppedantha Manasu: గుప్పెడంత మనసు: గౌతమ్ ని వాడుకొని రిషికి వసుధార కౌంటర్! ఫన్నీ ఎపిసోడ్ ఈరోజు..

Share

Guppedantha Manasu:గత ఎపిసోడ్‌లో, వసు సాయం.. ఆ క్రమంలో గౌతమ్ పరిచయం.. మనకు తెలిసిందే. దాంతో ఈరోజుటి ఎపిసోడ్ కాస్త ఫన్నీగాను, కాస్త రొమాంటిక్ గాను సాగింది. ఇకపోతే దేవయానిని వసు తోసిందన్న భ్రమలో వున్న రిషి తెగ రగిలిపోతూ ఉంటాడు. కట్ చేస్తే, నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్‌లో వసు, పుష్పలు రిషికి ఎదురుపడతారు. రిషి వసుని క్యాబిన్‌కి రమ్మని పిలిచి, మరలా జగతి మేడమ్‌తో కలిసి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి బైక్ తో అత్యంత వేగంగా ఓ కుర్రాడు అదే కాలేజ్‌లో ఆగుతాడు. అతడే మన గౌతమ్.

CM Jagan: జంగారెడ్డిగూడెం ప్రమాధ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం జగన్..! మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాకు ఆదేశం..!!

కాలేజ్ లో వసుని గౌతమ్ చూస్తాడా?

చాలా రోజుల తరువాత కలిసిన పాత స్నేహితులు అయినటువంటి రిషి, గౌతమ్ చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకుంటారు. అదే సమయంలో వసు గురించి గౌతమ్ రిషికి చెబుతాడు. పిల్ల పిచ్చి ఫిచ్చిగా నచ్చిందంటూ జరిగిన కథని చెబుతాడు. దాంతో విషయం తెలియని రిషి, ఆ పిల్ల దొరకుతుందిలేరా అంటూ.. ఓ అడుగు ముందుకేసి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాలే. అని ధైర్యం చెబుతాడు. సరిగ్గా అదే సమయంలో.. వసు జగతి దగ్గరకు వెళ్లడం.. రిషి కేబిన్ కి రమ్మని అడగడం.. తరువాత తనే ఒంటరిగా వెళ్లడం జరుగుతుంది.

Setting On Floor: నేలపై కూర్చొని భోజనం చేయకపోతే బరువు పెరుగుతారా..!?
గౌతమ్ ప్రేమిస్తున్న అమ్మాయి వసునే అని రిషి తెలుసుకుంటాడా?

వసుని దూరం నుండి గమనించిన రిషి.. అటెండర్‌ని పిలిచి.. ఓ అరగంట వరకూ ఎవ్వరినీ లోపలికి పంపించొద్దు.. అని చెబుతాడు. విషయం తెలుసుకున్న వసు విసుక్కుంటూ జగతి, మహేంద్రల దగ్గరకు వెళ్లి.. ‘రిషి సార్ ఇదంతా కావాలనే చేస్తున్నారు.. నాకు చాలా ఇబ్బందిగా వుంది’ అంటూ తన కోపాన్ని ప్రకటిస్తుంది. వెంటనే అక్కడి నుండి లైబ్రేరీకి వసు వెళ్ళిపోతుంది. కట్ చేస్తే… వసు వెళ్తున్న దారిలోనే రిషి, గౌతమ్‌లు కారులో వెళ్తారు. సరిగ్గా అదే సమయంలో గౌతమ్ వసుని చూసి కారు ఆపిస్తాడు. రిషి షాకింగ్‌గా ‘గౌతమ్ ఇంతవరకు చెప్పిన అమ్మాయి ఇదేనా’ అని మనసులో అనుకుంటాడు. రిషిని అడిగి మరీ వసుకి గౌతమ్ లిఫ్ట్ ఇచ్చేలా చేస్తాడు. గౌతమ్ ఏవేవో వాగుతూ ఉంటాడు. మధ్యలో వసుతో “నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడతా అండి.. ఏమీ అనుకోవద్దు!” అని అనగా.. వసు వెంటనే, “అదే మంచిది లెండి.. కొందరున్నారు, మనసులో ఒకటి, బయటకు ఒకటి మాట్లాడతారు.. వారు అర్ధం కారు!” అని రిషి కి కౌంటర్ ఇస్తుంది.. రిషి అవాక్కవుతాడు… కట్… తరువాయి భాగం మళ్ళీ చదువుదాం…


Share

Related posts

50 దాటినవారు ఈ జాగ్రత్తలు తీసుకోవలిసిందే!!

Kumar

Karthika Deepam Jan 10 today episode: రుద్రాణిని ఎదిరించి కార్తీక్ దీపకు పనిచ్చిన దేవుడు..!!కార్తీక్ పనోడిగా, దీప వంటలక్కగా..మారానున్నారా..??

Ram

సినిమా కథ వేరుగా ఉంటుంది అంటున్న సోహెల్..!!

sekhar