Guppedantha Manasu Dec 21:గత ఎపిసోడ్‌ని ఒకసారి నెమరు వేసుకుందాం.. రోజూ జరిగిన తంతే, వసుని రిషి తన పెద్దమ్మకి సారీ చెప్పు అని అడగడం, దాన్ని వసు తిరస్కరించడం, ఆ సారీ చెప్పే బాధ్యత రిషి తన తండ్రి అయినటువంటి మహేంద్రకి అప్పజెప్పడం, మహేంద్ర దానికి షాక్ అవ్వడం మనకు తెలిసిందే. దాంతో నిన్నటి ఎపిసోడ్ కి ఎండ్ టైటిల్ కార్డు పడింది. ఇక నేడు అది కొనసాగుతుంది. మహేంద్ర రిషికి జరిగిన విషయం గురించి చెప్పే ప్రయత్నం చేసి, మరలా నోరు మెదపకుండా.. సరే అన్నట్టుగా ఊరుకుంటాడు. కట్ చేస్తే…
After Meal: భోజనం చేసిన తర్వాత ఈ రెండు పనులు చేస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదు..!!
రిషి, మహేంద్ర మధ్యలో గౌతమ్ ఎంట్రీ..
సరిగ్గా అదే టైంలో గౌతమ్ వచ్చి.. రిషిని బయటకు వెళ్దాం అని పిలుస్తాడు. దానికి రిషి బిజీ.. రాలేను, నువ్వు వెళ్ళు అని అనగానే, అయితే అంకుల్ మీరు రండి మనం వసుతో కలిసి మంచి కాఫీ తాగుదాం అనే సరికి రిషికి ఎదో టెన్షన్ మొదలవుతుంది. వెంటనే గౌతమ్ తో ‘నేను వస్తాను’ అంటూనే.. ‘డాడ్ మీకు నేనో పని అప్పజెప్పాను. దాన్ని మీరు ఖచ్చితంగా చేసి తీరాలి.’ అని చెప్పి గౌతమ్‌తో పాటు బయటకు వెళ్తాడు. కట్ చేస్తే..
రెస్టారెంట్లో జరిగేది ఇదే…
రెస్టారెంట్లో కథ మొదలవుతుంది. రిషి రావడం చూసి వసు మనసులో హ్యాపీ ఫీల్ అవుతుంది. కానీ.. దాన్ని వ్యక్త పరచదు. మౌనంగా వున్న వసుతో గౌతమ్ ‘కాఫీ తాగడమేనా, మాట్లాడేది ఏమన్నా వుందా?’ అని అంటాడు. ప్రస్తుతానికి నాకు అంత టైం లేదు. డ్యూటీ అయ్యాక నేను మాట్లాడతాను! అని అంటుంది. ఇంతలో రిషి పైకి లేచి.. నాకు పనుంది, మీరు మాట్లాడి రండి అంటూ వెళ్ళిపోతాడు. అలా వెనక్కి వెళ్లిన వాడు మరలా తిరిగి వచ్చి అక్కడే కూర్చుంటాడు. దానికి ఇద్దరు షాక్ అవుతారు. కట్ చేస్తే.. ముగ్గురూ కలిసి బయలుదేరతారు. వసు ఇల్లు రాగానే వసు దిగుతుంది. ఆ వెంటనే గౌతమ్ దిగుతాడు. రిషి ఎందుకు అని అడిగితే.. వసు అమ్మానాన్నలతో పరిచయం కోసం అని చెప్తాడు. కట్ చేస్తే.. వసు ఇంటిలోనుండి మహేంద్ర జగతి రావడం చూసిన రిషి, వసు షాక్ అవుతారు. కట్..