Guppedantha Manasu: రిషి.. వసుధారను ప్రేమిస్తున్నా అని జగతి మేడం తో చెప్పనున్నాడా..?

Share

Guppedantha Manasu:మా టీవీ లో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఆసక్తిగా మారుతుంది.ఈ సీరియల్ కు ఎక్కువగా యూత్ బాగా అట్ట్రాక్ట్ అవుతున్నారు.రిషి, వసుధారాల మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులకు బాగా వర్క్ అవుట్ అవుతుంది.మరి గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు ఈరోజు ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉంటారు కదా.. మరి మీ కోసం ముందుగానే గుప్పెడంత మనసు సీరియల్లో ఈరోజు ఏమి జరుగుతుందో చూద్దామా..

Karthika Deepam :సౌందర్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మోనిత.. !!

వసుధారతో రిషి అసలు ఏమి మాట్లాడాడు.?

నిన్నటి ఎపిసోడ్ లో రిషి వసుధారతో మాట్లాడేందుకు కారులో బయటకు తీసుకెళతాడు. ఒక ఓ గ్రౌండ్ లో కారు ఆపి వసుధారను దిగమని చెబుతాడు. పెద్దమ్మ కి వసుధార సారీ చెప్పను అన్నా మాటలు గుర్తుచేసుకున్న రిషి తప్పు చేశావ్ వసుధార పెద్దమ్మ విషయంలో పెద్ద తప్పు చేశావ్ అంటాడు. మధ్యలో మాట్లాడేందుకు వసు ప్రయత్నించినా నేను మాత్రమే మాట్లాడడానికి నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను.నువ్వు చెప్పేది నేను వినను అంటాడు.సార్ అసలు నేనేమి చేయకుండానే మీ పెద్దమ్మ పడిపోయారని అంటుంది. మధ్యలో రిషి కలుగచేసుకుని నువ్వు పెద్దమ్మ వైపు వేలుచూపి తిట్టావ్, ఆవిడపై అరిచావ్ నేను నా కళ్లారా చూసాను.

అయిన ఆమె ఏదైనా అని ఉండొచ్చు దానికి మీరు అంతలా రియాక్టవ్వాలా? ఆమె వయసుకు అన్నా గౌరవం ఇవ్వాలి కదా అంటాడు. పెద్దమ్మని కిందపడేశావ్, కనీసం సారీ చెప్పలేదు అంటాడు. రిషి మాటలు విన్న వసుధార.. ఆవిడ మీకు ఏం చెప్పారో నాకు తెలియదు కానీ ఆవిడని నేను గాని జగతి మేడం గాని అగౌరవ పరచలేదు.. తప్పు నావైపు ఉంటే ఎన్నో సార్లు సారీ చెప్పేదాన్ని కానీ తప్పు నావైపు లేదుకాబట్టే సారీ చెప్పడం లేదని అంటుంది వసు.చూడు వసుదారా మా పెద్దమ్మే నాజీవితం తనని బాధపెడితే నేను వందరెట్లు బాధపడతా అంటాడు.వసుదారా మా పెద్దమ్మ ఏం చేసినా అన్నీ నాకోసమే చేస్తుంది అంటాడు. పెద్దమ్మని గౌరవించకపోతే ఊరుకోను.మా అమ్మ చిన్నపుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతే పెద్దమ్మే నన్ను కంటికి రెప్పలా కాపాడింది అని చెప్పి ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేయ్ అంటూ కార్ ఎక్కుతారు.

Bigg Boss 5 Telugu: యాంకర్ రవి బాటలోనే షణ్ముక్..??

ఆలోచనలో పడిన జగతి, మహేంద్ర :

కాలేజ్ లో కలుసుకున్న జగతి,మహేంద్ర ఇద్దరూ కలిసి అసల రిషి పొద్దున్నే ఇంటికి ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారు. అసలు నువ్వు రిషిని పట్టించుకోవడం లేదు అని మహింద్రను జగతి అనడంతో నాకేం తెలుసు అంటాడు మహేంద్ర. రిషి మూడ్ ఎలా ఉందో అన్న మహేంద్రపై ఫైర్ అవుతుంది.

రిషిని చూసి దేవయాని ఏమి చేసిందంటే?

అప్పటి వరకూ ఎంచక్కా కాలూపుకుంటూ పడుకున్న దేవయాని రిషి రావడం గమనించి అమ్మో కాలు నొప్పి అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. పెద్దమ్మను చుసిన రిషి దగ్గరుండి ఆమెకు పనులు చేస్తాడు. వెంటనే దేవయాని అయ్యో రిషి.. ధరణి ఉంది కదా నువ్వు తీసుకురావాలా అని బిల్డప్ ఇస్తుంది. రెస్టారెంట్లో జరిగిన సీన్ ను మళ్ళీ గుర్తుచేసి రిషిని రెచ్చగొడుతుంది. నా కళ్లముందే జరిగింది కదా పెద్దమ్మా నేను అంత తెలికిగా ఊరుకోను పెద్దమ్మ అంటాడు రిషి. నాకు కావాల్సింది ఇదే కదా అని మనసులో నవ్వుకుంటుంది.

క్లాస్ రూమ్ లో వసుధార కోసం వెతికిన రిషి.. :

క్లాస్ రూమ్ లో ఉన్న రిషి..వసుధార కనిపించకపోవడంతో వెతుకుతున్న సమయంలో అప్పుడే వసు కమిన్ సార్ అంటుంది. ఏంటి లేట్ అని అడుగుతాడు ఏమి తెలియనట్లు.. వసు మనసులో మీరే కదా బయటకు తీసుకుని వెళ్ళింది మళ్ళీ లేట్ ఏంటి అని అంటారా అనుకుంటుంది.. సార్ లేట్ ఎందుకంటే అని చెప్పబోతుంటే సరే లోపలికి రా అని అంటాడు.

జగతి దగ్గర వసును ప్రేమిస్తున్న… అనే విషయం రిషి చెప్పబోతున్నాడా..??

జగతి మేడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేస్తాడు రిషి. ఆ తర్వాత వసు గురించి మీతో మాట్లాడాలి అని చెప్పి ఆగమంటాడు.వెంటనే సార్ వసు ఏమైనా తప్పు చేసిందా అని అడుగుతుంది.లేదు మేడం నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలని అనుకుంటున్నా అంటాడు. వేంటనే జగతి మేడం వసుని ప్రేమిస్తున్నా అనే మాట చెప్పబోతున్నాడా? అది అమ్మతో తన ప్రేమ విషయం చెప్పబోతున్నాడా అనుకుంటుంది. కానీ రిషి జగతికి షాకిస్తూ వసుధారని మీ ఇంట్లో నుంచి పంపించేయండి మేడం అంటాడు. ఆ మాట విని షాక్ లో ఉంటుంది

జగతి.ఎందుకు ఏంటి అని వివరాలు అడగొద్దు మేడం. పెద్దవాళ్ళ గొడవల వల్ల తనని తాను కోల్పోవడం నాకిష్టం లేదంటాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు వున్నా వసుధార ఈ గొడవల వలన ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. వసుధారా భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ మీరు వసుధారను మీ ఇంట్లో నుంచి బయటకు పంపించేసేయండి అంటాడు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి జగతి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుస్తుంది


Share

Related posts

కిసాన్ సమ్మాన్‌కు శ్రీకారం!

somaraju sharma

వైకాపా స్కాముల బండారం.. చంద్రబాబు చేతిలో ఆధారం?

CMR

Twist In Wedding: కొద్ది సేపటిలో పెళ్లి జరగాల్సి ఉండగా వధువు చేసిన పనికి అందరూ షాక్..! ధర్నాకు దిగిన వరడు..! మేటర్ ఏమిటంటే..?

somaraju sharma