NewsOrbit
న్యూస్

Guppedantha Manasu : రిషి నిజంగానే తన ఈగోను పక్కనపెట్టి తన తల్లిని ఇంటికి తీసుకుని వెళ్తాడా…? దీని వెనుక ఎమన్నా ప్లాన్ ఉందా..?

Guppedantha Manasu

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ పోతుంది.తండ్రి సంతోషం కోసం రిషి ఒక మెట్టు దిగి… కాదు కాదు వంద మెట్లు దిగి మరి తన తల్లి జగతిని ఇంటికి తీసుకురావాలని అనుకుంటాడు. తల్లి జగతి ఇంటికి వెళ్లి మేడం మా ఇంటికి రండి అని పిలుస్తాడు. ఈ మాట విని జగతి ఆనందంలో మునిగిపోతుంది. నిన్నటి ఎపిసోడ్ ఇక్కడే ముగిసింది. అలాగే మళ్ళీ ఈరోజు. ఎపిసోడ్ కూడా సేమ్ అదే సీన్ తో మొదలవుతుంది.మేడం మీరు మా ఇంటికి రావాలి ఏమి జగతితో రిషి అంటాడు. అలాగే వసుధారా నువ్వు కూడా మా ఇంటికి రావాలి.ఇప్పుడే వెళుతున్నాం బయలుదేరండని చెబుతాడు రిషి. ఈ జన్మకి ఇది చాలు అని వసుతో చెప్పి జగతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Guppedantha Manasu : డాడ్ కోసం వంద మెట్లు కిందకి దిగిన ఈగో మాస్టర్:

Guppedantha Manasu

ఇక రిషి మనసులో డాడ్ నీ సంతోషం కోసం ఏదైనా చేస్తాననుకుంటాడు. సీన్ కట్ చేస్తే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇంటి బయట ముగ్గులేస్తు ఉంటుంది ధరణి. ఆ ముగ్గులు చూసి దేవయాని నీకు కామన్ సెన్స్ ఒక్కటే లేదనుకున్నా కానీ కలర్ సెన్స్ కూడా లేదని దేవయాని ధరణినీ సాధిస్తుంటుంది. ఇంతలో గౌతమ్ అక్కడకు వచ్చి ముగ్గు చాలా బావుందని అంటాడు.ఇది కూడా ఒక ముగ్గేనా, నేను రథం ముగ్గేస్తే ఊరంతా అలా నోరెళ్లబెట్టి మరి చూసేవాళ్ళని గొప్పలుపోతూ ఉంటుంది దేవయాని.సరే అయితే మరి మీరే ముగ్గు వేయండని గౌతమ్ అనడంతో ఇరుక్కుపోయానంటూ ఏదో చెప్పి తప్పించుకుంటుంది దేవయాని.

Guppedantha Manasu : వసు, జగతిని చూసి షాక్ లో దేవయాని :

Guppedantha Manasu

ఇంతలో ఇంటి బయట కారు వచ్చి ఆగుతుంది. ఇంతపొద్దున్నే రిషి ఎక్కడికి వెళ్లాడని అనుకుంటూ కారు దగ్గరకు వెళుతుంది దేవయాని.అప్పుడు కారులోనుంచి జగతి, వసుధార కిందకు దిగడం చూసి షాక్ అవుతుంది. జగతిని,వసుని చూసి గౌతమ్, ధరణి ఇద్దరూ సంతోషిస్తారు.ఈ సంక్రాంతికి మంచి గిఫ్ట్ ఇచ్చావ్ రా థ్యాంక్యూ అంటాడు గౌతమ్. వీళ్ల లగేజ్ ని లోపలకు తీసుకెళ్లు అని గౌతమ్ చెబితే.. లగేజ్ ఏంట్రా ఏకంగా కార్ కూడా లోపల పడేస్తా అని అంటాడు గౌతమ్. లోపలకు రండి అని జగతిని రిషి పిలుస్తాడు.నువ్వేంటి పొద్దున్నే అని దేవయాని కోపంగా జగతిని అడిగితే పెద్దమ్మా నేనే తీసుకొచ్చా అని సమాధానం చెబుతాడు రిషి. ఇంతలో గౌతమ్ అక్కడకు వచ్చి వదినా వీళ్లకి హారతి ఇవ్వడాలు, దిష్టి తీయడాలు ఉంటాయా అన్న గౌతమ్ తో దేవయాని కోపంగా ఆగు అంటుంది. రిషి ఏంటిది అని క్వశ్చన్ చేయడంతో..పెద్దమ్మ వివరాలు నేను తర్వాత చెబుతాను ఇప్పుడేం అడగకండి అంటాడు.

లక్ష్మణ రేఖను దాటి లోపలికి జగతి అడుగు పెడుతుందా..??

Guppedantha Manasu
వదిన వీళ్లను లోపలకు తీసుకెళ్లండి అంటే చిన్నత్తయ్యా వెల్ కమ్ బ్యాక్ అని లోపలకు తీసుకెళుతుంది ధరణి. జరిగిన పాత సంఘటనలు అన్నీ తలుచుకుంటూ జగతి ఎమోషనల్ అవుతూ గడపకి నమస్కారం చేసి అత్తవారింట్లోకి అడుగుపెడుతుంది జగతి. ఇదంతా చూసి దేవయాని కోపంతో రిగలిపోతూ ఉంటుంది. మరోవైపు రిషి మనసులో మళ్లీ మా కుటుంబంలోకి అడుగుపెట్టలేరు, పెట్టనివ్వను అని అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. ఇక జగతి లోపలికి అడుగుపెడుతూనే సంక్రాంతి శుభాకాంక్షలు అక్కయ్య అని దేవయానికి మరో షాక్ ఇస్తుంది.

జగతిని ఇంట్లో చూసి మహేంద్ర రియాక్షన్ ఏంటో..?

ఇక మహేంద్ర రూమ్ డోర్ తీసిన రిషి గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు. మార్నింగ్ లో గుడ్ ఏముంటుంది రిషి అంటే ఏమో డాడ్ మార్నింగ్ చెప్పాక అందులో గుడ్ ఉండొచ్చు కదా అంటాడు రిషి. క్యాలెండర్లో రోజులు మారుతున్నా గాని గుడ్ అనిపించేలా ఒక్కరోజు కూడా లేదు కదా అంటాడు మహేంద్ర. మీకు నాపై నమ్మకం లేదా డాడ్ అని అంటే ఏ విషయంలో అని అడుగుతాడు మహేంద్ర.. అప్పుడు ఒక్కసారిగా పక్కకు తప్పుకుని జగతిని చూపిస్తాడు రిషి. జగతిని అక్కడ గదిలో చుసిన  మహేంద్ర ఒక పక్క ఆనందపడుతూ మరోపక్క ఆశ్చర్యంతో అలాగే ఉండిపోవడంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju