NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha manasu : రిషితో వసుకు చీర ఇవ్వమన్నది దేవయానా.? నేనా… మీ మేడమా తేల్చుకో అన్నా రిషి..!

Guppedantha Manasu October 17 Today Episode:: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 583వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 17న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్ లో వసుని కొట్టినందుకు జగతిని మందలిస్తాడు మహేంద్ర.

వసును కొట్టడం తప్పు అని జగతిని మందలించిన మహేంద్ర :

Guppedantha Manasu October 17 Episode Review
Mahendra jagathi

అందరి ముందు తనని ఎలా కొట్టావు నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు. నువ్వు బాధపడుతున్న వసు గురించి ఆలోచిస్తున్నావ్ కానీ నేను రిషి మనసుకైనా గాయం గురించి ఆలోచిస్తున్నాను అని చెప్తుంది జగతి.అయినా వసు ఆ చీర కట్టుకొని ఉండాల్సింది కదా అని బాధపడుతుంది. మహేంద్ర కూడా రిషి, వసులు బయటకు వెళ్లారు.వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగిపోతుంది ఏమో అని అంటాడు. అయినా వసు ఈమధ్య మొండిగా ప్రవర్తిస్తుంది. ఆ మొండితనం విలువ రిషి మనసు అని తెలుసుకోలేకపోతుంది అంటుంది జగతి. ఇక మహేంద్ర.. రిషి ఫోటో చూస్తూ సారీ నాన్న ఇదంతా నా వల్లే కదా అని బాధపడతాడు.

వసుకు సారీ చెప్పిన రిషి :

Vasu rishi

ఇక గార్డెన్లో కూర్చున్న రిషి వసుతో బాధపడుతున్నావా అని అడుగుతాడు.దేని గురించి సార్ మేడం నన్ను కొట్టినందుకా, లేక ఆ చీర కట్టుకోలేనందుకా అనీ అంటుంది. ఆవిడ కొట్టడం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది.అది వదిలేయ్ నేను తెచ్చినందుకైనా ఆ చీర కట్టుకోవచ్చు కదా అప్పుడు నీకు కోడలు స్థానం వచ్చేది కదా అని అంటాడు రిషి.ఆకాశమంత ప్రేమ ముందు ఆరు గజాలు చీర ఏ మాత్రం సార్ అంటుంది వసు. ఎవరు ఎలా అనుకున్నా ఎవరు తిట్టినా కొట్టినా మన మధ్య ఉన్న బంధం చెరిగిపోదు కదా సార్ అని అంటుంది. ఇష్టం లేని పని చేస్తే బంధం ఎలా నిలబడుతుంది అన్న రిషితో, ప్రేమ సార్, ప్రేమ ఉన్నచోట ఇలాంటివేవీ నిలబడవు మన మధ్య అభిప్రాయ బేధాలు ఉన్నాయి గాని, అంతుచిక్కని విభేదాలు ఏమీ లేవు అని రిషికి నచ్చ చెబుతుంది.అసలు అలా చీర ఇవ్వాలనే ఆలోచన మీది కాదు అని అంటుంది వసు. అప్పుడు రిషి…దేవయాని తనకు చీర ఇచ్చి వసుకి ఇమ్మని చెప్పిన విషయం గుర్తుచేసుకుంటాడు. అదే విషయం వసుకి కూడా చెప్తాడు రిషి. ఇక ఆ చీర విషయం వదిలేయమని వసు కి సారీ చెప్తాడు రిషి.మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు తప్పు చేస్తేనే వాళ్ల గురించి బాధపడుతూ ఎదుటి వాళ్ళకి సారి చెప్తారు, అంటే మీరు జగతి మేడంని అని అనే లోపు రిషి కోపంతో అరిచి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మీరు మారతారు సార్ అనుకుంటూ రిషి ని వెంబడిస్తుంది వసు.

ధరణి పట్ల దేవయానిలో వచ్చిన మార్పు నిజమేనా..?

Devayani

ధరణి ఇచ్చిన కాఫీ తాగుతూన్న దేవయాని ఏంటో ధరణి, ఆలోచిస్తుంటే ఈ లోకం ఏమైపోతుందో… రాను రాను మనుషుల్లో మానవత్వం మాయమైపోతుంది అని అంటుంది. దెయ్యాలు వేదాలు వెల్లిస్తున్నాయి అని అనుకుంటుంది ధరణి మనసులో. అయినా వసుధారకి ఏమైంది మా అత్తయ్య గారి చీర కట్టుకోమంటే కట్టుకోకుండా రిషిని బాధ పెట్టింది అంటుంది.ఏదేమైనా ఈ చీర నీకు కూడా చాలా బాగుంది అని,కాఫీ కూడా బావుంది థాంక్యూ ధరణి అని అంటుంది. ఈ మహా తల్లి నాకు థాంక్స్ చెప్పింది అంటే ఏదో ప్రళయం రాబోతుంది అని మనసులో అనుకుంటుంది ధరణి.

నేనా.. మీ మేడంనా తేల్చుకో అని వసుధారను అడిగిన రిషి :

Vasu rishi

వసుని ఇంటి దగ్గర డ్రాప్ చేసిన రిషి, బాయ్ చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నావెంటి అని అడుగుతాడు వసుని. అప్పుడు వసు కారు తాళం లాక్కొని లోపలికి వెళ్లబోతుంటే ఎందుకు అలా చేసావ్ అని రిషి అంటే లోపలికి రమ్మని అర్థం సార్ అని అంటుంది. లోపలికి వచ్చిన రిషి ఏంటో ఈ గదిలోకి వస్తే నాకు ఏదో తెలియని శక్తి వస్తుంది అని అంటాడు. అదే సర్ ప్రేమ అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మన దగ్గర ఉంటే ఏదో శక్తి వచ్చినట్టుగా ఉంటుంది. అప్పుడు రిషి వసు చేతులు పట్టుకొని నా జీవితం చాలా వింతగా ఉంటుంది కదా వసు, అలాగే నీ జీవితంలో నీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అసలు నేనా,మీ మేడమా అని అడుగుతాడు. అప్పుడు వసు వెంటనే మేడమ్ సర్ అని అంటుంది.వసు చేతులు వదిలేసిన రిషి మరి నేనేంటి అని అడుగుతాడు. మీరు నా జీవితం సార్. నా దృష్టిలో మీరు నేను వేరు వేరు కాదు సార్ అని అనడంతో ఈరోజు సీరియల్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?