న్యూస్ సినిమా

Devayani: దేవయాని దెబ్బకు వసు-రిషి రిలేషన్ మరింత చెడనుందా? ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతుందంటే!

Share

Devayani: “గుప్పెడంత మనసు” గత ఎపిసోడ్‌ చూసిన ఎవరికైనా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్సుకత కలగకమానదు. జగతి, వసుధారలను క్లోజ్ గా గమనించిన దేవయాని, అసూయతో వార్నింగ్ ఇద్దామని జగతి ఇంటి దగ్గరకు రావడం అందరికీ తెలిసిందే. అప్పుడే సరిగ్గా కాలేజీకి వెళ్తున్న జగతి, వసులని అడ్డుకుని అనరాని మాటలు అనేస్తుంది. దాంతో చిన్నబోయిన వసు దేవయానికి కొంచెం గట్టిగానే సమాధానం చెబుతుంది. దాంతో దేవయాని, ‘జగతీ! నా గురించి నీకు పూర్తిగా తెలుసు! అదే విషయం నీ శిష్య పరమాణువుకి చెబితే బావుంటుంది!” అని హెచ్చరించి వెళ్లిపోతుంది.

తరువాత జరిగింది ఇదే..

వసుధార, జగతి కాలేజ్‌కి వెళ్తారు. అక్కడ వసు.. రిషికి జరిగింది చెప్పే ప్రయత్నం చేయబోతుంది. కానీ జగతి వసుని వారిస్తుంది. దాంతో ‘కాలేజ్ అయిపోయిన తర్వాత నన్ను కలువు’ అని రిషి వెనుదిరుగుతాడు. కానీ, వసు కలవకుండానే కాలేజ్ నుంచి జగతితో కలిసి రెస్టారెంట్‌కి వెళ్లిపోతుంది. ఇక వసు కోసం రిషి చూసి, చూసి ఇంటికి పయనమవుతాడు. సరిగ్గా రిషి ఇంటికి చేరుకునే సమయంలో మహేంద్రతో ధరణి కంగారు పడుతూ.. ‘వసు, జగతి అత్తయ్య ఎక్కడున్నారు? దేవయాని అత్తయ్య వారి గురించి అడిగారు?’ నాకేదో టెన్సన్ గా వుంది అని అడుగుతుంది. దానికి ‘ఏం కాదులేమ్మా.. జగతి చూసుకుంటుంది’ అని మహేంద్ర వారిస్తాడు. ఈ విషయం రిషి వింటాడు.

 

Devayani:  దేవయాని ప్లాన్..

సరిగ్గా అదే సమయానికి దేవయాని రిషికి ఓ వాయిస్ మెసేజ్ పంపిస్తుంది. ‘నాన్నా రిషి.. నీకు ఇష్టం లేని వారిని కలవడానికి రెస్టారెంట్‌కి వెళ్తున్నా.. నన్నుక్షమించు!’ అనేది దాని సారాంశం. అది విన్న రిషి కారుని రెస్టారెంట్ వైపుకి మళ్లిస్తాడు. రిషి అలా వెళ్లడం చూసిన మహేంద్రకి డౌట్ వచ్చి, తను కూడా ఆ వెనకే బయలుదేరతాడు. ముందుగానే ప్లాన్ చేసిన దేవయాని, రిషి రాకను గమనించి.. తన యాక్టింగ్ ని షురూ చేస్తుంది. వసు పట్టుకున్న కుర్చీని కావాలనే తనవైపు బలంగా లాక్కుని.. కింద పడిపోయేలా నటిస్తుంది. దాన్ని చూసిన రిషి ఆవేశంతో వసుధార ఏం చెప్పినా వినకుండా గట్టిగా అరిచేస్తాడు.


Share

Related posts

యుపిలో మొత్తం సీట్లకు ‘హస్తం’ పోటీ

Siva Prasad

ప్రాఫిట్‌లో రామ్ `ఇస్మార్ట్ శంకర్`

Siva Prasad

Eatela Rajendar : కేసీఆర్ కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్న ఈట‌ల‌

sridhar