న్యూస్ సినిమా

Guppedantha Manasu: తండ్రి కోసం రిషి ఏమి చేయనున్నాడు… జగతిని తండ్రికి దగ్గర చేసి రిషి దూరమావుతాడా..?

Share

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ భలే ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతూ వెళ్తుంది. మహేంద్ర, జగతి ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు తలుచుకుంటూ బాధ పడుతూ ఉంటారు. రిషి తండ్రి గదిలోనే ఉంటూ మహేంద్రను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర కుర్చీలో కూర్చుని నిద్రపోతున్న రిషిని చూసి తనని నిద్రలేపాలా వద్దా అనుకుని వద్దులే అని ఊరుకుంటాడు. జగతి ఇంటి వరకూ వచ్చి ఎంత బాధపడుతూ వెళ్లిందో అనుకుని రిషి చూడకుండా మొబైల్ తీసి జగతికి ఐ యామ్ ఓకే’ అని మెసేజ్ చేస్తాడు.

Guppedantha Manasu : జగతిని మర్చిపోలేని మహేంద్ర :

మెసేజ్ చుసిన జగతి మహేంద్ర ఈ టైమ్ లో మెసేజ్ చేశాడంటే ఇంకా పడుకోలేదా అనుకుంటూ “ఐ యామ్ నాట్ ఓకే’ అని రిప్లై ఇస్తుంది. కాల్ చేయనా అని అడిగితే వద్దు సారీ పక్కనే రిషి ఉన్నాడని రిప్లై ఇస్తాడు. మరో మెసేజ్ చేసేలోపు రిషి లేచి వాటర్ ఇస్తాడు. పక్కనే మొబైల్ చూసి సెల్ ఫోన్ ఆన్ చేశారు కదూ అని రిషి అంటే..నిద్ర పట్టడం లేదు అంటాడు మహేంద్ర. ఏమైనా టెన్షన్ ఫీలవుతున్నారా డాడ్ మీరు సంతోషంగా ఉండాలి అన్న రిషితో…సంతోషం అంటే ఏంటి అని అడుగుతాడు. కంఫర్ట్ గా ఉండడం అని సమాధానం ఇస్తాడు రిషి.

Guppedantha Manasu : సంతోషం అంటే ఏంటో రిషికి చెప్పిన మహేంద్ర :

కంఫర్ట్ వేరు సంతోషం వేరు అని కారు, బ్యాంక్ బ్యాలెన్స్, విలాసాలు ఇవన్నీ సౌకర్యాలు మాత్రమే సంతోషాలు కాదని క్లారిటీ ఇస్తాడు.మీరేదో సంతోషాన్ని పోగొట్టుకున్నట్టు ఉన్నారు మీ మనసేదో కోరుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది అన్న రిషితో ఇరవైఏళ్లుగా పడుతూనే ఉన్నా నా మనసు నా బాధను తట్టుకుంది కానీ నా గుండె తట్టుకోలేకపోయింది అంటాడు. మీ సంతోషం కోసం నేను ఏం చేయాలి అని అడిగిన రిషి ప్రశ్నకు..జగతి అనే మూడక్షరాలతో సమాధానం ఇస్తాడు మహేంద్ర. నా భార్య ,నా జీవితం ,నా అర్థాంగి.సంతోషం అంటే పొద్దున్నే లేవగానే కోటి రూపాయల ఖరీదైన కారుని చూసుకోవడం కాదు..చిరునవ్వుతో కాఫీ అందించే తన భార్యని చూడడం అంటాడు. అలాగే మీ ఇద్దరూ అల్లరి చేస్తూ,గొడవపడుతూ నా దగ్గరకి వచ్చి ఎవరిది న్యాయం అంటూ నన్ను అడగాలి.ఎంత బావుంటుందో ఇవన్నీ ఊహించుకుంటే రిషి అని ఇదీ సంతోషం అంటే.. ఇలాంటివి ఎప్పుడైనా ఈ ఇంట్లో జరిగయా లేదు కదా అన్న మహేంద్ర మాటలు విని అక్కడి నుంచి ఏమోషనల్ గా వెళ్లిపోతాడు రిషి

సంక్రాంతి సంబరాల్లో జగతి, వసు :

 

సీన్ కట్ చేస్తే సీరియల్ లో సంక్రాంతి సంబరాలు ఇప్పుడే మొదలు అయ్యాయి.ఇంటి ముందుకి వచ్చిన హరిదాసుకి బియ్యం, కూరగాయలు వేస్తుంది జగతి. అందరిలా దీపావళి,దసరా,సంక్రాంతి అన్ని పండుగలు చేసుకోవాలని ఉంటుంది.కానీ నేను ఒంటరి దాన్ని కదా వసు. ఒక్కరే కలిసి చేసుకునే పండుగ లేదుకదా. పండుగ అంటేనే అంతా కలసి ఒకేచోట సంతోషంగా గడపడం. కానీ నాకు అందరూ ఉన్నా ఎవ్వరూ లేని ఏకాకిని.నాకున్న రెండే రెండు పండగలు ఏంటో తెలుసా ఒక పండుగ పేరు మహేంద్ర, మరో పండుగ పేరు రిషి అంటుంది.

తండ్రి సంతోషం కోసం రిషి ఏమి చేయనున్నాడు..?

సీన్ కట్ చేస్తే ఇంటి బయట కూర్చున్న రిషి…తండ్రి మాటలు గుర్తుచేసుకుంటాడు.ఆయన సంతోషం కోసం నేను తనకు కావాల్సింది ఇవ్వాలి కదా అనుకుంటాడు. తన ఆనందం ముందు ఎంత విలువైంది అయిన గడ్డిపరకతో సమానం అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్ ఏదేదో మాట్లాడుతుంటే ప్లీజ్ నన్ను ఒక పదినిముషాలు వదిలేయ్ అనగానే గౌతమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. డాడ్ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి అనుకుంటూ వసుధార దగ్గరకు వెళ్తాడు.నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీ రెస్టారెంట్ డ్యూటీ కన్నా వందరెట్లు ఇది ముఖ్యం అని వివరాలు అడగొద్దు కారెక్కు వెళదాం అంటాడు.పదండి సార్ అని కారెక్కుతుంది వసు. మరోవైపు జగతి మహేంద్రకి ఏమి తినాలి అనే లిస్ట్ చెబుతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోతుంది.!


Share

Related posts

సి‌ఎం మరియు పిఎం రీలీఫ్ ఫండ్ కి రెండు నెలల జీతాలు ఇచ్చిన వైఎస్ఆర్ సిపి ఏంపిలు

Siva Prasad

Mobile మొబైల్ తీసుకుని టాయిలెట్ లో కి వెళ్తున్నారా ??

Kumar

వైద్యుడి వయసు 87 ; రోజూ సైకిల్ పై తిరిగేది 10 కిలోమీటర్లు ; ఎందుకో తెలుసా..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar