NewOrbit
న్యూస్

Guppedantha Manasu November 3 Today Episode: అర్ధరాత్రి బయటకు వెళ్లిన వసు, రిషిలను తప్పుపట్టిన దేవయాని..మరి వసు, రిషిల రియాక్షన్ ఏంటో..?

Share

Guppedantha Manasu November 3 Today Episode: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.ఇక ఈరోజు November 3వ తేదీ Guppedantha Manasu సీరియల్ 597వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం.గత ఎపిసోడ్ లో వసు ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి బాగా టెన్షన్ పడుతూ ఉంటుంది.  అదే సీన్ ఈరోజు ఎపిసోడ్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం టెన్షన్ పడుతున్న వసుధార తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ మాటలన్నీ రిషి వెనుక నుంచి వింటాడు.

వసుకు దైర్యం చెప్పిన రిషి :

Advertisements
rishi supports vasu
rishi supports vasu

రిషిని చూసిన వసుధార ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి కంగారు పడుతున్నావ్ అని అడుగుతాడు రిషి. ఎగ్జామ్స్ రిజల్ట్స్ గురించి చాలా టెన్షన్ గా ఉంది సార్ అని అంటుంది వసుధార. అదేంటి యూత్ ఐకాన్ వి నీకు ఎగ్జామ్స్ టెన్షనా అని తనకి ధైర్యం చెప్తాడు. నాకు ఒక హెల్ప్ చేయండి సార్ ఇంకా ధైర్యంగా ఉంటుంది అని వసు అడగగానే చెప్పు నువ్వు చెప్పిన పని చేయడం నా బాధ్యత అని అంటాడు రిషి. సరే అని ఇద్దరు ఊరు చివరన ఉన్న చెరువుకి వెళ్తారు.

వసు, రిషి అర్ధరాత్రి ఎక్కడకు వెళ్ళారంటే..?

rishi vasu conversation
rishi vasu conversation

అక్కడకు వెళ్ళగానే రిషి ఏంటి ఇంత రాత్రి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అని వసును అడుగుతాడు.ఊరంతా నిద్రపోతున్నప్పుడు మనిద్దరం మాత్రమే ఇక్కడ ఉంటే ఎంత బాగుంటుంది కదా సార్ అని అంటుంది వసు.సార్ కాగితము పడవలు చేసి దాని మీద మన మనసులో కోరిక చెప్పుకొని చెరువులో వదిలితే ప్రకృతి మన కోరిక తీరుస్తుందంట. అందుకే ఇక్కడ కాగితం పడవలు వదులుదామని వచ్చాను సార్ అని అంటుంది వసు.

చెరువులో పడవలు వదులుతున్న వసు, రిషిలు :

rishi vasu playing
rishi vasu playing

మీరు కూడా మీకు నచ్చినది మనసులో కోరుకొని ఈ పడవ మీద రాసి చెరువులో వదలండి అని అంటుంది. ఇద్దరు కూడా వాళ్ల కోరికలు రాసి పడవలుగా చేసి చెరువులో వదులుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.ఏది ఏమైనప్పటికి నీ పద్ధతులు నీ ఆలోచనలు నాకు చాలా కొత్తగా ఉంటాయి అని అంటాడు రిషి. ఇక వసు కూడా రిషి ని చూసి మీరు గ్రేట్ సార్ అని అంటుంది వసుధార. ఎందుకలా అంటున్నావ్ అని అంటాడు రిషి. నేను ఏదో అడిగితే ఈ రాత్రి అప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి నా సరదా తీర్చారు అని అంటుంది. మనం ఒక మనిషిని ఇష్టపడినప్పుడు వాళ్ళ సరదాలు కోరికలు తీర్చవలసింది కూడా మనమే కదా అని అంటాడు రిషి.సర్ నేను టాపర్ ని అవుతాను కదా అని అంటుంది వసు. నీ సంగతి ఏమోగానీ నాకు మాత్రం కచ్చితంగా నువ్వు టాపర్ వి అవుతావు తర్వాత డాడీ వాళ్లు వచ్చేస్తారు తర్వాత అందరం కలిసి మీ ఇంటికి వెళ్లి మన పెళ్లి గురించి మీ అమ్మానాన్నలతో మాట్లాడాలి అని చాలా సంతోషంగా అంటాడు.

సైలెంట్ గా దేవయానికి సెటైర్స్ వేస్తున్న ధరణి :

devayani fire
devayani fire

సీన్ కట్ చేస్తే వంట గదిలో ఉన్న ధరణిని పిలిచి ఈ టైంలో వంట గదిలో ఏం చేస్తున్నావ్ అని దేవయాని అడుగుతుంది. వంటగదిలో పని ఉంది అత్తయ్య గారు అని అంటుంది ధరణి. ఈ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాగాని నీ జీవితం అంతా ఆ వంట గదిలోనే తెల్లారిపోతుంది అని అంటుంది దేవయాని.సర్లేగాని రిషి ఈ రూమ్ లో లైట్ వెలుగుతుంది ఎక్కడ అని అడుగుతుంది. బయటికి వెళ్ళాడు అని చెప్తుంది ధరణి. ఈ టైంలో బయటకు ఒక్కడేనా వసుధార కూడా వెళ్లిందా అని అడుగుతుంది దేవయాని. కలిసే వేళ్ళుంటారులే. పెళ్లి కాకముందే వీళ్ళు ఇలా తిరిగితే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు అంటుంది దేవయాని.ఇక ధరణి మధ్యలో కలగచెసుకుని నేను ఒక మాట మాట్లాడవచ్చా అని అంటుంది ధరణి.
ఏదో అన్ని నన్నే అడిగి మాట్లాడుతున్నట్టు అడుగుతావే అని చెప్పు అదేంటో అని అంటుంది.కలిసి తిరిగితే తప్పేంటి? వసుధార ఈతరం అమ్మాయి తెలివైన అమ్మాయి అని అంటుంది. కలిసి తిరిగితే తప్పు కాదా అని అంటుంది దేవయాని.

అర్ధరాత్రి బయటకు వెళ్లడం ఏంటి అని కోపంలో దేవయాని :

vasu expression on rishi
vasu expression on rishi

మరి అలాంటప్పుడు అదే విషయాన్ని రిషికి చెప్పొచ్చు కదా అని అంటుంది ధరణి.అలా ఎలా చెప్పేస్తాం మనసులో ఉన్నవన్నీ బయటికి అలా చెప్పకూడదు అని అంటుంది దేవయాని. నువ్వు నటిస్తున్నావో జీవిస్తున్నావో నాకు అర్థం అవ్వటం లేదు ధరణి. ఆ జగతి వచ్చాక ఈమధ్య నీకు తెలివితేటలు బాగా ఎక్కువ అయ్యాయి అని అంటుంది దేవయాని. నేనెక్కడ మారిపోయాను అత్తయ్య గారు గంటకు ఒకసారి కాఫీ కావాలా… టీ కావాలా అని అడుగుతున్నాను కదా అని అంటుంది ధరణి.ఇంక నటించింది చాలు వెళ్ళు అని అంటుంది దేవయాని.అయినా ఇంత రాత్రి అప్పుడు వీళ్లిద్దరూ ఎక్కడ తిరుగుతున్నారో ఏంటో అని తెగ కంగారు పడిపోతుంది దేవయాని.ఇక వసు మాత్రం నేను అడగ్గానే బయటికి తీసుకుని వచ్చినందుకు థాంక్స్ చెబుతుంది.మీరు నిజంగా జెంటిల్మెన్ సార్ అని అంటుంది. నన్ను ఏదో మునగ చెట్టు ఎక్కించేస్తున్నట్టున్నావ్ అని అంటాడు రిషి.

రేపటి ఎపిసోడ్ సుపర్…. దేవయానికి మంచి షాక్ :

vasu rishi proposal
vasu rishi proposal

నేను నిజంగానే చెప్తున్నాను సార్ అంటుంది. ఇక రిషి మాత్రం మనం ఇద్దరం చాలా సార్లు గొడవలు పడ్డాం. చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు వచ్చాయి అయినా ఎప్పటికప్పుడు నువ్వు నన్ను సమర్థిస్తూ వచ్చావు. నన్ను ఆకాశానికి ఎత్తేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ నాకు అండగా నిల్చున్నావ్ ఇలాగే జీవితకాలం ఉంటావా అని అడుగుతాడు రిషి. జీవితకాలం కాదు సార్ జన్మజన్మలకి ఈ వసుధార మీదే అని అంటుంది వసు. ఇక్కడితో ఈరోజు ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో వసు వంట గదిలో ఉన్న ధరణితో మేడం నేను చేసే చపాతీలకు రిషి సార్ పేరు పెడతాను..ప్రిన్స్ చపాతీ, జెంటిల్మెన్ చపాతీ అని పెడతాను అంటుంది వసుధార. ఇంతలో వెనుకే ఉన్న రిషి ని చూసి షాక్ అవుతుంది.నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అన్న రిషికి చపాతీలు ఎలా చేయాలో నేర్పిస్తుంది వసుధార.


Share

Related posts

జగన్ బాబు అమిత్ షా ను కలిసింది అందుకా?

Yandamuri

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి వెళ్తూ వెళ్తూ కాజల్ కి ఊహించని షాక్ ఇచ్చిన కంటెస్టెంట్..??

sekhar

‘నేను సూపర్’

somaraju sharma