NewsOrbit
Telugu TV Serials న్యూస్

Guppedantha manasu: జగతి కోపంతో ఉక్కిరి బిక్కిరి అయిన వసు… మహేంద్ర మాత్రం ఫుల్ ఖుష్..!

Guppedantha manasu : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ గుప్పెడంత మనసు. మంచి కథ, కథనంతో ముందుకు సాగుతూ 575 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు అక్టోబర్ 8న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం..జగతీ మేడమ్‌ని అమ్మా అని పిలవమని వసు రిషిని అడగడంతో రిషి చాలా సీరియస్ అవుతాడు.ఇక ధరణీ, జగతీ మాట్లాడుకుంటూ ఉండగా దేవయాని వచ్చి జగతీ నీ శిష్యురాలు వసు నాకు నచ్చలేదు.అందుకే రిషికి వసుని దూరం చేసి చక్కగా వేరే మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. నీకు నాకు కావాల్సింది రిషి సంతోషమే కదా అందుకే వసును జాగ్రత్తగా నువ్వే దూరం చేసెయ్ అనేసి వెళ్లిపోతుంది. దేవయాని మాటలకూ జగతి కాస్త కంగారు పడుతుంది.

వసును కలిసిన మహేంద్ర :

Vasu mahendra


సీన్ కట్ చేస్తే వసుని కలుస్తాడు మహేంద్ర. ‘ఈ గురుదక్షిణ ఒప్పందాన్ని మరిచిపో వసుదార అంటాడు రిక్వస్ట్‌గా.సార్ అంత ఈజీగా ఎలా తగ్గుతానని అనుకున్నారు? గురుదక్షిణ ఒప్పందాన్ని జగతీ మేడమ్‌కి చెల్లించుకుని తీరతాను..’ అంటుంది వసు. వద్దు వసు అసలే రిషి పంతం కలవాడు. ఈ కారణంగా మీరిద్దరూ దూరం అయిపోతారేమోనని నా భయం అంటాడు మహేంద్ర.అలా దూరం అయితే నేను ఊరుకుంటానా సార్.అయినా సార్ చాలా మారారు.కోపం చూడాల్సిన రిషి సార్ కళ్లల్లో ప్రేమని చూస్తున్నాను.ఆయన కచ్చితంగా మారతారు అంటుంది వసు. ఆ మాటలు విన్న మహేంద్ర ‘వసుధారా నువ్వు గ్రేట్.. నువ్వు ఎక్కడ సరే అని ఈ గురుదక్షిణ ఒప్పందం వదిలేద్దాం అంటావేమో అనుకున్నాను’ అంటాడు మహేంద్ర నవ్వుతూ.

జగతి కోపం చూసి అల్లాడిన వసు :

Jagathi vasu


సీన్ కట్ చేస్తే వసు జగతి క్యాబిన్ లోకి వెళ్లి ప్రాజెక్ట్ కు సంబందించిన రిపోర్ట్ అందిస్తుంది. ‘వసు గురుదక్షిణ విషయం గురించి ఏం ఆలోచించావ్.. వెనక్కి తగ్గు వసు రిషిని బాధపెట్టొద్దు’ అంటూ మొదట జగతీ రిక్వస్టింగ్‌గా మాట్లాడుతుంది. అయితే వసు చాలా లైట్‌గా మాట్లాడుతుంది. దాంతో జగతీకి కోపం వచ్చి అక్కడే ఉన్న ఫైల్స్ అన్నీ విసిరేసి గట్టిగా అరిచేస్తుంది చెబితే అర్థం కాదా వసు అంటూ అరవడంతో వసు బిత్తరపోతుంది.నీ వల్ల నాకు భయమేస్తుంది.. నేను ఇన్నాళ్లు రిషి మనసుకి గాయం కాకూడదనే జాగ్రత్త పడ్డాను కానీ నువ్వు అదే చేస్తున్నావ్.నువ్వు ఇక్కడ రాకున్నా బాగుండేది. ఎందుకు వసు ఎందుకు ఇలా చేస్తున్నావ్.

రిషి మనసు బాధ పెట్టకు అని వసును రిక్వెస్ట్ చేసిన జగతి :

Jagathi

రిషి నన్ను అమ్మా అని పిలవకపోతే నష్టం ఏముంది చెప్పు?’ అని అరుస్తుంది జగతీ. ‘అది తప్పు కదా.. మేడమ్? అంటుంది వసు ఆవేదనగా. ‘నువ్వు చేస్తున్నది అంతకన్నా పెద్ద తప్పు అంటుంది జగతీ.అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు వసు అర్థం కావట్లేదా నీకు? జీవితాలు నాశనం అవుతాయి.అర్థం చేసుకో.. నీ మొండితనాన్ని తగ్గించుకో’ అంటూ అరుస్తుంది జగతీ ఆవేదనగా. ఇంతలో మహేంద్ర వస్తాడు. కింద పడిన పేపర్స్, ఫోన్ అన్నీ చూసి పరిస్థితిని అర్థం చేసుకుంటాడు.మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! 

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N