Guppedantha manasu : గుప్పెడంత మనసు సీరియల్ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళ్తుంది.జగతి మేడం తిరిగి ఇంటికి వచ్చేయడంతో విషాదంతో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో మళ్ళీ రిషి, వసుధారల ప్రేమాయణం మొదలవుతుంది. జగతి మేడం ఇంటికి వచ్చిన రిషి సార్ తో మేడం గురించి గురించి మాట్లాడుదాం అనుకుంటే ఆ అవకాశమే రిషి సార్ ఇవ్వలేదని బాధపడుతుంది వసు. ఇంతలో రిషి నుంచి పిలవగానే పండుగకి వచ్చినందుకు మీ ఇద్దరికి థ్యాంక్స్ అంటూ మా ఇంట్లో సౌకర్యాలు బావున్నాయా అని మెసేజ్ చేస్తాడు.
Guppedantha manasu : వసు ఇచ్చిన రిప్లై చూసి కోపంలో ఉగిపోతున్న రిషి :
ఏమని రిప్లై ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇంతలో రిషి దగ్గరకు వచ్చిన గౌతమ్ ఓ కవిత రాశాను ఎలా ఉందో చెప్పు అని అంటే వద్దు గౌతమ్ చెప్పొద్దు అంటాడు రిషి. అయినా చెబుతా విను అని మొదలుపెడతాడు.నీ చిరునవ్వులు నాకు వరం..నీ పేరు తలుచుకుంటేనే నాకు ప్రేమ జ్వరం అంటూ వసుని తలుచుకుంటూ రాసిన కవిత రిషికి వినిపిస్తాడు. ఎలా ఉందని గౌతమ్ అంటే బానే ఉందిగాని పనుకో అంటాడు.ఇంతలో రిషి సెల్ మోగడంతో ఇప్పుడు మెసేజ్ లు ఏంటని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు గౌతమ్ కానీ ఫోన్ లాగేసుకుంటాడు రిషి. సౌకర్యాలు బావున్నాయి కానీ అని ఆపేసిన వసు రిప్లై చూసి కానీ ఏంటి అనుకుని గుడ్ నైట్ అని రిప్లై ఇస్తాడు.
Guppedantha manasu: వసు ప్రేమలో మునిగి తేలుతున్న గౌతమ్ :
ఇక గౌతమ్ ఐ లవ్ యూ అంటూ వసు బొమ్మ ముందు నిల్చుని ఏదేదో మాట్లాడుతాడు. రిషి-గౌతమ్ ఇద్దరూ కాలేజీకి బయలుదేరుతారు.గౌతమ్ వసు బొమ్మ ఉన్న చార్ట్ పట్టుకుని కార్ ఎక్కుతాడు.రిషికి కనిపించకుండా ఆ బొమ్మని గౌతమ్ దాచడం చూసి మధ్యలో కార్ ఆపేసి సీట్లో ఉన్న చార్టుని తీసి వెనక పడేస్తాడు. వెనుక చాలా స్టేషనరీ ఉండంతో ఇన్నింటి మధ్య వసు బొమ్మని ఎక్కడ వెతుక్కోవాలో అనుకుంటాడు గౌతమ్. సీట్లో కూర్చున్నట్టే కూర్చుని అందులో ఒక చార్ట్ తీసి పట్టుకుని నేను తీసుకున్నది వసు బొమ్మేనా కాదా నా ప్రేమ అలాంటిది వసుదే అయిఉంటుందని ఫిక్సైపోతాడు.కట్ చేస్తే కాలేజీలో సీన్ ఓపెన్ అవుతుంది.
వసులో రిషి మీద చిగురించిన ప్రేమ :
క్లాస్ రూమ్ లో కూర్చున్న వసుధార మ్యాథ్స్ చేస్తూ లెక్కని పదే పదే కొట్టేస్తుంది. అది చూసి రిషి ఇన్నిసార్లు కొట్టేశావేంటి..నేను చెప్పినా అర్థంకాలేదా అంటూ ఏదీ నన్ను చూడనివ్వు అని వసు పక్కనే కూర్చుంచాడు.లెక్కని ఎక్స్ ప్లైన్ చేస్తున్న రిషిని చూస్తూ ఉండిపోతుంది వసుధార. తాను చెప్పింది వినడం లేదని గమనించిన రిషి సడెన్ గా ఎక్కడికో వెళ్లిపోతావ్ ఏంటి..లెక్క అర్థమైందా అంటే కాలేదు అని రిప్లై ఇస్తుంది. సరే ఈవెనింగ్ కలసిప్పుడు లెక్క చెబుతాను అనేసి వెళ్లిపోతాడు.కాలేజీ బయట నిల్చున్న గౌతమ్ తన వెంటతీసుకొచ్చి చార్టు ఓపెన్ చేసి వసు బొమ్మ చూస్తు రిషి గాడు వసుధార కళ్లు ఎంత బాగా గీశాడో అనుకుంటాడు. ఈ బొమ్మని వసుకి ఇచ్చి క్రెడిట్ అంతా మనమే కొట్టేయాలి అనుకుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పుష్ప కార్ లో ఏవో చార్టులున్నాయంట కదా అవి తీసుకొచ్చి మహేంద్ర సార్ కి ఇమ్మన్నారని చెబుతుంది.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది