Guppedantha manasu : గుప్పెడంత మనసు సీరియల్లో రిషి, వసుధారల లవ్ ట్రాక్ ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతూ వెళుతుంది. గత ఎపిసోడ్ లో రిషి,వసు ఇద్దరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు లైబ్రరీలో ఇరుక్కుపోతారు.ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే రిషి ఎంత కాల్ చేసినా లైబ్రరియన్ కాల్ లిఫ్ట్ చెయ్యడు. దాంతో రిషి టెన్షన్ పడుతుంటే వసు మాత్రం ‘సార్ కూల్ సార్ కూల్‌గా ఉండాలి అని చెప్పి లైబ్రరియన్ లిఫ్ట్ చెయ్యలేదంటే తనకు ఎన్ని టెన్షన్ ఉండి ఉంటాయో కదా మీరు కూడా ఇప్పుడు కూల్ అయ్యి కాల్ చేసి చూడండి సార్ లిఫ్ట్ చేస్తాడు’అంటూ సలహా ఇస్తుంది.
Guppedantha manasu : టెన్షన్లో రిషి, ధ్యానంలో వసు :
దాంతో రిషి కాల్ చేస్తే సరిగ్గా అప్పుడే లైబ్రరియన్ ఫోన్ చూసుకుని లిఫ్ట్ చేస్తాడు.దాంతో రిషి ఆ లైబ్రరియన్‌కి తన లైబ్రరీలో ఇరుక్కున్నాను అని విషయం చెబుతాడు. దాంతో ‘సార్ నేను ఇప్పుడే బయలుదేరతాను’ అంటూ లైబ్రరియన్ స్టార్ట్ అవుతాడు. అయితే వసు మాత్రం ‘కూల్ సార్ ప్రశాంతంగా ఉండండి అంటే రిషి కూల్‌గా కూర్చుని ‘సరేలే ఆ లైబ్రరియన్ ఊరు వెళ్లాడట. రేపు ఉదయాన్నే వస్తాడులే గాని మనం ఇక ఇక్కడే ఈ రాత్రి అంతా ఉందాము అంటాడు.
Guppedantha manasu : నైట్ అంతా ఒకే రూమ్ లో రిషి, వసుధారా:
అప్పటి దాకా కూల్‌గా ఉన్న వసు ఒక్కసారిగా బిత్తరపోతుంది. ‘అదేంటి సార్.. ఇక్కడ నైట్ అంతా ఎలా ఉండాలి సార్? నా వల్ల కాదు సార్..’అంటూ గోలగోల చేస్తుంది. ‘ఏం అయ్యిపోయింది నీ ప్రశాంతత?’ అంటూ వెటకారం చేసి వస్తున్నాడులే అని నిజం చెబుతాడు. ఇక వసుధర ఆటలు మొదలుపెడుతుంది. ఇక కాగితలపై పేర్లు రాయడం అంతా రిషితో చేయిస్తుంది. అప్పుడే రిషి ఇంగ్లీష్‌లో రాస్తుంటే.. తెలుగులో రాయండి సార్ అంటుంది. రిషి తన పేరు తెలుగులో రాసి ఇస్తాడు. అది చూసి మీ తెలుగు రైటింగ్ అంత సూపర్ ఏం కాదు సార్.. అంటుంది.
లవ్ లెటర్ రాసింది రిషి అని వసు పసిగడుతుందా..?
హే కాదు నా రైటింగ్ చాలా బాగుంటుంది తెలుసా’ అంటాడు రిషి.అయితే నేను చెప్పింది తెలుగులో స్పీడ్‌గా రాయండి అంటూ పేపర్ పెన్ ఇస్తుంది వసు. మనసులో తనకు లవ్ లెటర్ రాసింది ఎవరో అనుకుంటూ ఒకసారి ‘రిషి సార్ రైటింగ్ చెక్ చేస్థా..చూస్తే తప్పేముంది అని మనసులో అనుకుంటుంది.అయితే రిషి రాస్తూ ఉంటాడు వసు చెబుతూ ఉంటుంది. సడన్‌గా రిషికి లవ్ లెటర్ సీన్ గుర్తొచ్చి ‘అమ్మో వసుధరా.. నా హ్యాండ్ రైటింగ్ చెక్ చెయ్యడానికి.. ఈ ప్లాన్ చేశావా అనుకుని రాసింది అంతా కొట్టేసి.. నా రైటింగ్ కంటే నీదే బాగుంటుందిలే అని ఆ పేపర్ని వసుకి ఇవ్వకుండా చుట్టి చేతిలో పెట్టేసుకుంటాడు.
వసు, రిషిని చూసి ఒకే గదిలో చూసి షాక్ అయిన గౌతమ్ :
ఇక లైబ్రరియన్ బైక్ మీద అక్కడికి వస్తాడు. అక్కడే ఉన్న గౌతమ్‌తో జరిగిన విషయం చెబుతాడు. దాంతో ఆ లైబ్రరియన్ వెనుకే గౌతమ్ కూడా వచ్చి తలుపు తీయిస్తాడు. ఇక గౌతమ్ తలుపు తీయించి లోపలికి వచ్చేసరికి వసుని, రిషిని అక్కడ చూసి ‘వసుధరా నువ్వు ఇక్కడా’ అంటూ బిత్తర చూపులు చూస్తాడు.అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.