న్యూస్

Guppedentha Manasu Highlights: గుప్పెడంత మనసు సీరియల్ ఈ వారం హై లైట్స్..!

Share

Guppedentha Manasu Highlights: గుప్పెడంత మనసు సీరియల్ మంచి ట్రాయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తికరంగా ముందుకు సాగిపోతూ ఉండగా ఒక విషాద ఘటన చోటుచేసుకోవడంతో అందరు కూడా ఒక్కసారిగా సోకశంద్రంలో మునిగిపోతారు. ఈ వారం అంతా అలాగే భారంగా, ఎమోషనల్ గా ముందుకు వెళ్ళింది గుప్పెడంత మనసు సీరియల్.. మరి ఈ వారం సీరియల్ లోని హై లైట్స్ ఏంటో ఒకసారి చూద్దామా.జగతి, మహేంద్రలు దేవయాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మహేంద్ర బాగా నవ్వుతూ నవ్వుతూ నొప్పి అంటూ దగ్గిదగ్గి సోఫాలో ఒరిగిపోతాడు. దాంతో జగతి కంగరుపడిపోయి ఏడుస్తు ఫోన్స్ వసుకు, రిషికి ఫోన్ ట్రై చేస్తుంది.కానీ వసు, రిషి ఇద్దరూ ఫోన్ తియ్యరు.ఇంకా వసు రెస్టారెంట్‌లో డ్యూటీలో ఉంటుంది కదా అనుకుని రెస్టారెంట్ కి ఫోన్ చేసి వసు కి జరిగింది అంతా చెబుతుంది.ఈలోపు జగతి ఆంబులెన్స్‌కి కాల్ చేస్తుంది.వసు రాగానే ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తారు. రిషి నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని వసుని చెయమని చెప్తే వసు ఫోన్ కూడా తీయడు. గౌతమ్ తో వాలీబాల్ ఆడుతూ ఉంటాడు.

NTR: టీడీపీలో సంచలనం..! ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ఎన్టీఆర్..!

Guppedentha Manasu Highlights:మహేంద్రకు గుండె నొప్పి….శోక సంద్రంలో రిషి, జగతి :

ఈలోపు వసు గౌతమ్ కు ఫోన్ చేసి మహేంద్ర గురించి చెప్పి హాస్పిటల్ కి రమ్మని. దాంతో రిషి కంగారుగా‘హాస్పిటలా? అంటాడు..రిషిని తీసుకుని కారులో హాస్పిటల్‌కి బయలుదేరతాడు.వసు జగతి ఏడుస్తూ ఉంటే.. రిషి, గౌతమ్ వాళ్ల దగ్గరకు వస్తారు. ‘వసుధరా లోపల ఉన్నది ఎవరు అంటే ‘సార్ మహేంద్ర సార్‌కి హార్ట్ ఎటాక్ వచ్చింది’ అని వసు చెప్పడంతో రిషి డాడ్ అని చాలా ఏడుస్తాడు. జగతి కూడా చాలా ఎమోషనల్‌గా.. ‘తనకి ఏదైనా జరిగితే నేను కూడా తుదిశ్వాస వదులుతా అని జగతి ఏడుస్తుంది.ఆ మాటలు రిషి కూడా వింటాడు.ఇంతలో మహేంద్రని డాక్టర్స్ వచ్చి, కంగారు పడాలిసిన పని లేదు మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని చెబుతారు.ఇంతలో గౌతమ్ వాడికి అంకుల్ అంటే ప్రాణం, నాకు వాడికి పరిచయం అయ్యేసరికి వాళ్ల అమ్మ దూరమైంది.

Ram Charan: శంకర్ దెబ్బకి దిల్ రాజు అదిరిపోయేలా ఉన్నాడు..! ఒక్క పాటకి అంత ఏంది సామీ..?
తండ్రిని తలుచుకుని కుమిలిపోతున్న రిషి :

అంకులే వాడికి ప్రపంచం అని వసుధారతో అంటాడు గౌతమ్.  బెడ్ పై ఉన్న మహేంద్ర పక్కనే రిషి కూర్చుని ఉంటే కాస్త దూరంలో జగతి నిలబడి ఉంటుంది. తండ్రితో తాను గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుచేసుకుని, మేడం ఏం జరిగింది అని అడుగుతాడు. ఎందుకో తెలియదు ఎక్కువగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్వుతూ ఒక్కసారిగా పడిపోయారని చెబుతుంది జగతి.అందరికీ దూరమై ఒంటరిగా ఉన్న నాకు మిగిలిన ఏకైక మిత్రుడు మహేంద్ర మాత్రమే అని,తనకి ఏమైనా జరిగితే ఈ జగతి మరుక్షణమే తుదిశ్వాస వదులుతుంది అంటుంది.

Mahesh-Rajamouli Movie: మ‌హేష్-రాజ‌మౌళి సినిమాలో విల‌న్‌గా స్టార్ హీరో.. అత‌నెవ‌రో మీరు అస్స‌ల ఊహించ‌లేరు!
అది మహేంద్ర భూషణ్ అంటే…??

కళ్లు తెరిచిన మహేంద్ర ఏంటి భయపడ్డారా మహేంద్ర భూషణ్ ఇక్కడ ..సన్నాఫ్ దేవేంద్ర భూషన్ నాకేం కాదు అంటాడు.నా గుండె ఆగిపోయినంత పనైంది మహేంద్ర..నువ్వు లేకుండా ఈ జగతి బతకదు అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్స్ ఆయన్ని ఎంత సంతోషంగా ఉంచితే అంత తొందరగా కోలుకుంటారని చెబుతాడు. పెద్దమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పి తీసుకురమ్మని గౌతమ్ ను పంపిస్తాడు.తండ్రి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒక దగ్గర కూర్చున్న రిషికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది వసుధార. అయినాగానీ డాడ్ ని ఆసుపత్రిలో చేర్పిస్తే నాకు కాల్ చేయాలి కానీ గౌతమ్ కి కాల్ చేయడం ఏంటని అడుగుతాడు.నేను, మేడం మీకు కాల్ చేశాం. కానీ మీరు తీయలేదు.అందుకే గౌతమ్ సార్ కి కాల్ చేశాను అంటుంది.

వసుకు దగ్గరగా రిషి :

రిషి సడెన్ గా వసు చేతులు పట్టుకుని డాడ్ తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నా వసుధార, నాక్కూడా డాడ్ తప్ప ఎవ్వరున్నారు చెప్పు..నా చుట్టూ ఓ సర్కిల్ గీసుకుని నేను బయటకు రాను, అందులోకి ఎవ్వర్నీ రానివ్వను..నేనున్న సర్కిల్లో నాకు తోడుండేది డాడ్ ఒక్కరే అంటాడు.డాక్టర్లు మహేంద్ర బయటకు బాగానే ఉన్నా ఆయన దేని గురించో మహేంద్ర ఎక్కువగా ఆలోచిస్తున్నారని చెబుతారు. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళితే తన మనసు ప్రశాంతంగా ఉండి మనసులో భారం తగ్గుతుంది అని డాక్టర్ క్లారిటీ ఇస్తాడు. ఇంకా మహేంద్ర మళ్ళీ తల్లి కొడుకులను కలిపే బాధ్యత వసుకు అప్పచెపుతాడు. మహేంద్ర మనసు తెలుసుకున్న మనిషిగా మీతో మాట్లాడుతున్నా.

రిషి మాటలకు బాధపడిన జగతి ఏమి చేయనుందో?

అని జగతి రిషితో మహేంద్ర గురించి చెబుతుంది.తన మనసులో ఏదో బాధ, మనకు తెలియనిది ఏదో దాగుందని నా అనుమానం. డాడ్ క్షేమం కోసం మాత్రమే మీరు ఆలోచిస్తే మాట్లాడండి వింటాను..కానీ.. మర్చిపోయిన బంధాలను ఇందులోకి తీసుకురాకండి అంటాడు రిషి. మీరు దూరంగా ఉన్నన్ని రోజులు డాడ్ లో నాకు ఎలాంటి బాధా కనిపించలేదు..మళ్లీ మీరొచ్చాక ఆయన బాధ తిరిగి మొదలైంది అంటాడు.మీతో ప్రయాణం కొనసాగించలేక,ఇంట్లో సమాధానం చెప్పలేక డాడ్ సతమతమవుతున్నాడు అంటాడు.రిషి మాటలు విని షాక్ అవుతుంది జగతి.ఇంతలో దేవయాని, ఫణింద్ర, ధరణి లోపలికి రాగానే జగతి బయటకు వచ్చేస్తుంది.

మహేంద్ర ఇంటికి జగతి వెళుతుందా… ఎందుకు రిషి జగతికి దణ్ణం పెట్టాడు?

మరుసటి రోజు మహేంద్ర ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు అంటారు.అందరిని ఇంటికి వెళ్లండి అని పంపించేస్తాడు రిషి జగతిని కూడా తనతో పాటు ఇంటి వరకూ వచ్చి వదిలేసి వెళ్లిపో అని అడుగుతాడు.ఇదంతా రిషి చూసి బయటకు వెళ్లిపోతాడు.రిషి, వసుధారా, మహేంద్ర, జగతి నలుగురు కలిసి కారులో ఇంటి దగ్గరకు వస్తారు.అయితే ముందు కార్లోంచి జగతి దిగడం చూసి దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జగతి లోపలకు రానివ్వను అంటుంది కార్లోంచి దిగిన మహేంద్ర తూలిపడబోతుంటే జగతి పట్టుకోవడం చూసి మా డాడ్ ని నేను చూసుకుంటాను అని రిషి అనడంతో మహేంద్ర చేతిని జగతి వదిలేస్తుంది.గుమ్మం దాక. వెళ్లిన మహేంద్ర వెనక్కు తిరిగి జగతిని చూసి నవ్వుతూ ఈ గడప దాటి ఎప్పుడు వస్తావు జగతి అని మహేంద్ర మనసులో అనుకుంటే నేను ఆ గడప దాటి ఎప్పటికీ లోపలకు రాలేనేమో మహేంద్ర అని జగతి అనుకుంటారు.రిషి వచ్చిజగతి దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి మీరిద్దరూ లేకపోతే ఈరోజు మా డాడీ ఉండేవారే కాదు థ్యాంక్యూ అని చెప్పి. లోపలికి వెళ్ళిపోతాడు.

జగతికి మహేంద్రకు మధ్య లక్ష్మణ రేఖ గీసినది ఎవరు..??

కారులో ఇంటికి తిరిగి వెళుతూ దేవయాని, రిషి అన్నా మాటలు అన్నీ గుర్తుచేసుకుంటుంది జగతి.మేడం మీరుకూడా ఇంట్లోకి వెళ్లాల్సింది కదా అని వసు అంటే ఏ అర్హతతో వెళ్లాలి చెప్పు,మహేంద్ర భార్యగానా దేవయాని ఒప్పుకోదు, రిషి తల్లిగానా రిషి ఒప్పుకోడు.ఆ ఇంటి కోడలిగానా అప్పుడు అందరూ ఒప్పుకోవాలి ఇంకా ఎలా వెళ్లాలి చెప్పు వసు అంటుంది జగతి.మిషన్ ఎడ్యుకేషన్ రూపకర్తగా మాత్రమే వాళ్ల దృష్టిలో ఉన్నాను అంటుంది.అది గడపకాదు సీతారాముల్ని విడదీసిన లక్ష్మణరేఖ అని నన్ను గౌరవంగా పిలిచిన రోజే ఆ గడప దాటి లోపలకు వెళతాను అంటుంది. అసలు వేళతానో లేదో..ఇలాగే ఒంటరిగా అనాధ శవంలా కాటికి వెళతానేమో అని జగతి బాధపడుతుంది. జగతి.మాటలు విని వసు కూడా బాధపడుతుంది


Share

Related posts

భారీ ఆఫర్ ని రిజక్ట్ చేసిన అనుష్క ..?

GRK

RC15: దిల్ రాజు ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్‌తో ఇక ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పట్టించుకోరేమో..

GRK

Big Breaking: నాందేడ్ వెళుతున్న పాసింజర్ ట్రైన్ లో స్పల్ప అగ్నిప్రమాదం

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar