Guppedentha manasu Jan 12 Today episode: పాపం వసుధారా మాటలు విని నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితిలో రిషి… ఎందుకంటే?

Share

Guppedentha manasu Jan 12 Today episode: గుప్పెండంత మనసు సిరియాల్ భలే ఆసక్తిగా ముందుకు సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో వసుకు రిషి ప్రేమలేఖ రాయడం, అది కాస్త జగతి కంట పడడం, గౌతమ్ ను రిషి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు అని వార్నింగ్ ఇవ్వడంజరిగిపోయాయి. ఇంకా ఈరోజు ఎపిసోడ్ జగతి, మహేంద్ర దగ్గర ఓపెన్ అవుతుంది.
రిషి నీకు ఏమైనా చెప్పాడా అని జగతి మహేంద్రని అడిగితే ఏమీ చెప్పలేదంటాడు.వసుధారకి లవ్ లెటర్ రాశారని అంటే.. అంత ధైర్యం ఎవరికి ఉంటుందంటాడు మహేంద్ర. ఈ ప్రేమ లేఖ ఏదో రిషి రాసి ఉంటే బావుండేది అనుకుంటారు ఇద్దరు.అది జరిగే పనేనా అంటే..కానీ ఆ చేతిరాత ఎక్కడో చూశాను అనిపిస్తోంది అని జగతి అంటే..అంతమంది స్టూడెంట్స్ చేతిరాత తెలుసుకదా చూసే ఉంటావులే అని సమాధానమిస్తాడు మహేంద్ర.

Karthika Deepam Jan 12 Today Episode: మోనిత దీపను, కార్తీక్ ను చూడనుందా…?? మళ్ళీ కధ మొదటికే వస్తుందా..?

Guppedentha manasu Jan 12 Today episode: తనని తానే తిట్టుకున్న గౌతమ్ :

ఇంకా చిరాగ్గా ఇంట్లోకి వెళ్లిన గౌతమ్..నేను మంచి అవకాశం మిస్ చేసుకున్నా అనుకుంటాడు. ఎదురుగా దేవయాని కనిపించి..నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావ్ అంటే.. ఆత్మవిమర్శ అంటాడు. రిషి ఎక్కడ అని అడిగితే..ఏమో తెలియదు అంటాడు. ఇంతలో వసుధార రిషిని రమ్మని చెప్పగా అసలు ఎందుకు రమ్మంది..ఆ ప్రేమలేఖలో హ్యాండ్ రైటింగ్ కనిపెట్టేసిందా అనుకున్న రిషి..ఎందుకు రమ్మన్నావ్ అని అడుగుతాడు. ఆ ప్రేమలేఖ ఎవరు రాసి ఉంటారు సార్ అన్న వసుతో.. ఇప్పుడా టాపిక్ అవసరమా అంటాడు.

Kodali Nani – Vangaveeti Radha: కొడాలి నాని, వంగవీటి రాధాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ..హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స..
ప్రేమ లేఖని రాసిన వాళ్ళని పొగిడే పనిలో పడ్డ వసుధారా:

చాలా బాగా రాశార్ కదా సార్ అన్న వసు మాటలు విని షాక్ అవుతాడు రిషి. ఒక్క పదం కూడా చెడుగా లేదు అంటుంది. వసు మాటలు విని నవ్వాలో-ఏడవాలో తెలియని పరిస్థితి అంటే ఇదేనేమో అని మనసులో అనుకుంటూ నీకు కోపం రాలేదా అని ప్రశ్నిస్తాడు. జీవితంలో అన్నీ నెగిటివ్ గా తీసుకుంటే ఎలా..ఆ అక్షరాలు , మాటలు అన్నీ…నా జీవితాన్ని బాగా చూసిన వ్యక్తే రాసిఉంటాడని పిస్తోంది.రాసింది ఎవరో తెలుసుకోవాలి సార్ అంటుంది వసు. ఎందుకో తనని చూడాలని ఉంది సార్ అంటుంది.ఒకవేళ ఆ లెటర్ డైరెక్ట్ గా ఇచ్చి ఉంటే వాడి ప్రేమని నువ్వు ఒప్పుకునే దానివా అంటాడు. అదేంటి సార్ ఆ ప్రేమలేఖ రాసిన విధానం, ఆభావం నచ్చాయి..అంతే కానీ..లెటర్ ఇవ్వగానే ఒప్పుకోవడం ఏంటి అంటుంది. ప్రేమలేఖ రాసిన వాడు దొరుకుతాడన్న నమ్మకం నాకైతే లేదని చెప్పిన రిషి జేబులోంచి చాక్లెట్ తీసి వసుకి ఇస్తాడు.అది చూసి మీరు చాక్లెట్స్ కొంటున్నారా అంటే..ఏదో కొంటే చిల్లర లేదని ఇచ్చారులే అంటాడు రిషి. ఎప్పుడూ నువ్వేనా ఈసారి కాకి ఎంగిలి నా వంతు అంటూ కశ్చీఫ్ లో పెట్టి ఓ ముక్క చేసి వసుకి ఇస్తాడు.

కొడుకు కోసం టెన్షన్ పడుతున్న మహేంద్ర :

రిషి..ఎక్కడ తిరుగుతున్నావు రా..మీ పెద్దమ్మ రిషిని పట్టించుకోవు అంటుంది, మీ అమ్మ ఏమో రిషి గురించి ఆలోచించవు అంటుంది..నన్ను ఏం చేయమంటావ్… జగతి అన్నట్టు రిషి మనసులో వసు ఆలోచనలు పెరుగుతున్నాయా ఏంటో అనుకుంటాడు మహేంద్ర. కట్ చేస్తే కార్లో కూర్చున్న వసుధార… రిషి కాకి ఎంగిలి గుర్తుచేసుకుని నవ్వుకుంటుంది.ఇంతలో గౌతమ్ కి కాల్ చేసిన మహేంద్ర ఎక్కడున్నావ్ అంటే ఇంటికొస్తున్నా అని కాల్ కట్ చేస్తాడు.

వసు ఊహల్లో రిషి :

జగతి ఇంటి దగ్గర దిగిన వసుధారతో ఇంకా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టులో భాగంగా స్లమ్ ఏరియాలకు వెళ్లాలి.షార్ట్ ఫిలిం వర్క్ ప్రారంభమైతే మనం బిజీ అయిపోతాం అంటాడు.ఇంకా వసు బై చెబుతుంది.మరోవైపు కారులో వెళుతున్న రిషి..ప్రేమలేఖ గురించి వసు అన్నా మాటలు గుర్తుచేసుకుని కారు పక్కన ఆపి రోడ్డుపై నిల్చుని ఆ ప్రేమలేఖ రాసింది నేనే..ఐ యామ్ సో హ్యాపీ అని గట్టిగా అరిచి ఒరేయ్ గౌతమ్ గా నువ్వు చేసిన వెధవ పని నాకు బాగా ఉపయోగపడిందిరా అనుకుంటాడు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.


Share

Related posts

బిగ్ బాస్ గుట్టు విప్పి నాగార్జున కి కోపం తెప్పించిన జోర్దార్ సుజాత…?

arun kanna

కరోనా వైరస్ ప్రభావంతో కరీంనగర్ లో కర్ఫ్య్హూ వాతావరణం ..

Siva Prasad

స్టేజీ పై అలా పిలిచేసరికి వర్ష ని హత్తుకొని ముద్దు పెట్టేసిన జబర్దస్త్ ఇమాన్యుయెల్…!

arun kanna