Guppedentha manasu Jan 13 Today episode: వసు కనిపించే అంతా సాఫ్ట్ కాదుగా… కావాలనుంటే మీరే చూడండి.. ఎలా నటించిందో..!

Share

Guppedentha manasu Jan 13 Today episode:తన నటన చూసి గుప్పెడంత మనసు సీరియల్ భలే ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతూ వెళుతుంది.ప్రేమలేఖ బాగా రాసారు అన్నా వసు మాటలు తలుచుకుని ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతాడు రిషి.ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో ధరణిని పిలిచిన దేవయాని..రిషి ఇంకా లేవలేదా అని అడుగుతుంది. రాత్రి లేటుగా వచ్చినట్టున్నాడు అంటుంది. ఏంటి మహేంద్ర ఇది అని అంటేరిషి ఇంకా చిన్నపిల్లాడు కాదు పదే పదే అలా అడగడం సరికాదంటాడు మహేంద్ర. ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన రిషి…గౌతమ్ ఏడి అని అడుగుతాడు. పొద్దున్నే ఇంట్లోంచి బయలుదేరాడంటే వీడు వసుధార దగ్గరకే వెళుతున్నాడేమో అనుకుని కాల్ చేస్తాడు. కానీ కాల్ కట్ చేస్తాడు గౌతమ్.

Health Tips: కళ్లు ఎక్కువగా స్టైన్ అవుతున్నాయా..ఈ విషయాలు తెలుసుకోండి..

Guppedentha manasu Jan 13 Today episode: వసుని అర్జెంట్ గా ఇంటికి రమ్మన్న రిషి… కొంపతీసి అలా చేయడుగా..?

వెనక్కు రమ్మంటానని కట్ చేశావ్ కదా అనుకుని రిషి.. వసుధారకి కాల్ చేస్తాడు. ఆ కాల్ చూసిన జగతి..ఏంటో మా అబ్బాయి కాల్ చేస్తున్నాడా, మీ సార్ కాల్ చేస్తున్నారా అంటే..అది రిషి సార్ మూడ్ ని బట్టి ఉంటుంది అని సమాధానమిస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన వసుధారతో..నువ్వు అర్జెంటుగా బయలుదేరి ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ తీసుకుని ఇంటికొచ్చెయ్ అంటాడు. నేను, రిషి సార్ ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్క్ కోసం బయటకు వెళుతున్నాం అని చెప్పేసి హడావుడిగా పరిగెత్తుతుంది వసుధార

Karthika Deepam Jan 13 Today episode: ఆ బిడ్డా మోనిత కొడుకు అని దీపకు తెలిసిపోయిందా… అసలు ఆ డైరీలో ఏముంది..?
జగతి మేడంతో మాట్లాడం చాలా కష్టం అనుకున్న గౌతమ్ :

వసు అటు వెళ్లగానే ఇటు దిగుతాడు గౌతమ్. జగతికి గుడ్ మార్నింగ్ చెప్పి వసుని పిలవమని చెబుతాడు. వసు బయటకు వెళ్లిందని చెప్పిన జగతితో నేను డ్రాప్ చేసేవాడిని కదా అంటాడు.కాల్ చేసి రావాల్సింది.. ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం నాదే తప్పు అంటాడు.మీ షార్ట్ ఫిలింలో నాకో క్యారెక్టర్ ఇవ్వండని అడిగితే..అది నా చేతిలో ఉండదని చెప్పిన జగతి కాలేజీకి టైమ్ అవుతోందని చెప్పి గౌతమ్ ని పంపించేస్తుంది.

ఆహా… దేవాయనిని మించిన నటనతో వసు..:

సీన్ కట్ చేస్తే రిషి కంగారు చూసి ఎక్కడికైనా వెళ్లాలా అని ఫణింద్ర అంటే అవును అంటాడు.దేవయాని ఎవరు వస్తున్నారని అడగ్గా..వసు పేరు చెప్పి షాకిస్తాడు. తనని ఎందుకు ఇంటికి పిలవడం..చేసిన నిర్వాకాలు చాలవా అని ప్రశ్నిస్తుంది దేవయాని. ఇంతలో అక్కడకు వస్తుంది వసుధార. ఇక దేవయాని అక్కడ నుండి వెళ్లిపోబోతుంటే మేడం మీకు ఒంట్లో ఎలా ఉందని అడుగుతుంది. గిల్లి జోల పాడటం అంటే ఇదే అనికుని పర్వాలేదు..నీ పరామర్శలు-సానుభూతి నాకు అవసరం లేదులే అంటుంది దేవయాని. మీరు పెద్దవారు.. మీరంటే నాకు గౌరవం ఉంది..జరిగిన దాంట్లో తప్పొప్పుల ప్రస్తావన పక్కనపెడితే మీరు మా రెస్టారెంట్ కి వచ్చి అలా జరిగినందుకు నాకు బాధేసింది… రెస్టారెంట్లో మీకేదైనా అసౌకర్యం జరిగి ఉంటే సారీ అంటుంది వసుధార. షాక్ అయిన రిషి లేచి నిల్చుంటాడు.నన్ను క్షమించండి మేడం అంటుంది. నేనే గొప్ప నటిని అనుకుంటే నా కన్నా ఉందే అనుకుంటుంది దేవయాని. వసు నీ సంస్కారానికి హ్యాట్సాఫ్ అని మహేంద్ర .అహంకారి అయిన అత్తయ్యకి నీలాంటి కోడలు రావాలని ధరణి అనుకుంటారు. ఏదో పని ఉందన్నావ్ వెళ్లు అంటుంది దేవయాని. పెద్దమ్మకి సారీ చెప్పాలి అని అడిగినప్పుడు…చెప్పమన్నా చెప్పను అన్న వసుధార మాటలు గుర్తు చేసుకుంటాడు.నిన్ను అంచనా వేయడం చాలా కష్టం ఏప్పటికప్పుడు ఓ చిక్కు ప్రశ్నలా మారుతుంటావ్ అంటాడు.

వసు క్లారిటీ కి హ్యాట్సఫ్ అనాలిసిందే.:

సారీ చెప్పను అన్న నేను ఈ రోజు నాకు నేనుగా వచ్చి ఎందుకు చెప్పానని ఆలోచిస్తున్నారు కదా అంటుంది. ఆవిడపై నాకు కోపం ఉండదు.కానీ జగతి మేడంని, నన్ను సూటిపోటి మాటలు అని బాధిస్తారు..అవన్నీ మీకు చెప్పలేను, మొన్న కూడా తనంతట తానే పడిపోయారు, అందులో మా తప్పు లేదు.. కానీ పెద్దావిడ పడిపోయినందుకు బాధ అనిపించింది… జరిగిన దానికి బాధపడి చెప్పాను కానీ తప్పుచేశానని చెప్పలేదని జగతి మేడం టాపిక్ తీయగానే ఎక్కడికి వెళదాం అని అడుగుతాడు. అదేంటి మిషన్ ఎడ్యుకేషన్ పనిపై వెళదాం అని.. మళ్లీ నన్ను అడుగుతున్నారేంటని అడుగుతుంది.అంతే ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది.


Share

Related posts

లోకేష్‌ను జ‌నం మీద‌కు వ‌దిలారు… వైసీపీకి దొరికిపోయిన బాబు?!

sridhar

కడప పెద దర్గాలో ప్రార్ధనలు

somaraju sharma

బ్రేకింగ్ : విజయవాడ ఘటనలో ముగ్గురు అరెస్టు

Srinivas Manem