Guppedentha manasu Jan 14 today’s episode: రిషికి ప్రపోజ్ చేసిన వసు… రిషి ఓకే అంటాడా.. ఈ రోజు ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్..?

Share

Guppedentha manasu Jan 14 today’s episode: గుప్పెడంత మనసు సీరియల్ చాలా ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.ఎవరు ఊహించని విధంగా వసుధారా దేవయానికి సారీ చెప్పి అందరికి షాక్ ఇస్తుంది వసుధార..ఇంకా ఈరోజు ఎపిసోడ్ లో రిషితో కలసి బయటకు వెళ్లిపోతుంది వసుధారా. ఇంతలో దేవయాని జరిగినదంతా తలుచుకుని కోపంతో కోపంతో దిండు విసిరేస్తుంది సరిగ్గా అదే సమయానికి మహేంద్ర వచ్చి ఈ విసిరి కొట్టడాలు, దూరంగా విసిరేయడాలు ఇంకా మీరు తగ్గించలేదా వదినా అంటాడు.నాకు నచ్చనివి విసిరేస్తుంటాను అవి వస్తువులైనా, మనుషులైనా అని సమాధానం చెబుతుంది దేవయాని. మీరు విసిరేసినప్పుడు బలహీనంగా ఉన్నవాళ్లు మరింత బలంగా తయారవుతారు అన్న మహేంద్రతో..ఏంటి బెదిరిస్తున్నావా అంటే లేదు వాస్తవాలు చెబుతున్నా…దౌర్జన్యం పనిచేయదు అంటాడు.

Guppedentha manasu Jan 14 today’s episode: వదిన ఆశీర్వాదం కోసం మహేంద్ర… ఎందుకు అనుకుంటున్నారా..?

ఇంతకీ నా రూమ్ కి ఎందుకొచ్చావ్ అంటే… మీకు నమస్కరించి వెళ్లాలనుకుంటున్నా అంటాడు మహేంద్ర. నా మనసులో ఉన్న కోరిక నెరవేరాలని ఆశీర్వదించండి వదినగారూ అని అనడంతో కోపంతో వెళ్ళిపోతుంది దేవయాని. ఇంకా రిషి వసు ఇద్దరూ ఫీల్డ్ విజిట్ కి అని ఓ కొండపైకి వెళ్లి లొకేషన్లు చూసి ఫైనల్ చేసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండగా,లొకేషన్ చూస్తున్న రిషి ఫేస్ పైకి వసు చున్నీ గాలికి ఎగిరిపడుతుంటే రిషి డిస్టబ్ అవుతూ అలా వెనక్కు అడుగులు వేసుకుంటూ వెళ్లుతుండగా తూలి పడబోతుండగా పట్టుకుంటుంది వసుధార. నువ్వు నన్ను పట్టుకుంటే నాతోపాటూ నువ్వూ పడిపోతావ్ జాగ్రత్త అంటే..ఆ క్షణంలో అన్ని ఆలోచనలు రావుకదా సార్ అంటుంది.


CPI Narayana: సీఎం జగన్ తో చిరంజీవి భేటీపై కీలక వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ..! ఆ పాయింట్ కరెక్టేగా..?

చున్నీ విషయంలో వసుకు రిషి ఏమి సలహా ఇచ్చాడంటే..?

చున్నీ చివర గవ్వలు, మువ్వలతో అలంకరిస్తే అవి ఎగరకుండా ఉంటాయన్న రిషితో..ఆలోచన బావుంది సార్..ఈ సారి తీరిక దొరికితే నేను ట్రై చేస్తా అంటుంది.ఇంతలో రిషికి కాల్ చేసిన గౌతమ్..ఎక్కడున్నావ్ అంటే..నేను బిజీగా ఉన్నా మెసేజ్ చేయి అని కాల్ కట్ చేస్తాడు. గౌతమ్ ఆలోచనలో పడతాడు. సీన్ కట్ చేస్తే ఆకలేస్తోందా అని వసు అడిగితే ఆకలి అనేంత ఆకలి లేదు కానీ అలా అనిపిస్తోందంటాడు రిషి. నాకు మాత్రం బాగా ఆకలేస్తోందని అన్న వసుతో..కారులో బిస్కెట్లు ఏమీలేవని.. ఈ రోజు ఉపవాసం తప్పేలా లేదులే అనుకుంటాడు.

గౌతమ్ ను అవమానించిన రిషి, వసు.. మరి గౌతమ్ రియాక్షన్ ఏంటో..?

రిషి కాల్ కట్ చేశాడు కదా..వసుధార అలా చేయదు కదా అనుకుంటూ ఆమెకు కాల్ చేస్తాడు. వసు కూడా కాల్ లిఫ్ట్ చేసి వర్క్ లో ఉన్నాను..తర్వాత మాట్లాడుతా అని కట్ చేస్తుంది. దీంతో ఇంత అవమానమేంటని గౌతమ్ ఫీలవుతాడు. మళ్ళీ సీన్ కాలేజీలో ఓపెన్ అవుతుంది.ఫణీంద్ర, మహేంద్ర, జగతి సహా టీచర్లంతా కాలేజీలో మీటింగ్ లో ఉంటారు. కాన్సెప్ట్ ఎంత సింపిల్ గా ఉంటే అంత త్వరగా అందరికీ అర్థమవుతుంది అని మాకు తోచిన సలహాలు ఇస్తాం అంటారు. షార్ట్ ఫిలిం చేయడానికి డేట్, ప్లేస్ ఫిక్స్ చేశాం..మినిస్టర్ గారినుంచి మెయిల్ వచ్చాక కన్ఫామ్ చేసుకుందాం అనుకుంటారు

వసుతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసిన గౌతమ్ :

షార్ట్ ఫిలింలో నాకో చిన్న పాత్ర ఫిక్స్ చేయండని అడిగిన గౌతమ్ మాటలు గుర్తుచేసుకున్న మహేంద్ర…తనకి ఓ క్యారెక్టర్ ఇమ్మని అడుగుతాడు.ఇంతలో జగతి …ఇందులో స్టూడెంట్స్ ఉంటే బావుంటుంది గౌతమ్ ఎందుకు అంటుంది ఈలోపు ఫణీంద్ర ఏంకాదు ఫిక్స్ చేసుకో మహేంద్ర అంటాడు. అదే విషయం గౌతమ్ కి తెలిసి వసుతో పాటూ కలసి నటించే అవకాశం దొరుకుతుందని సంబరపడతాడు గౌతమ్.
ఓ దగ్గర కారు ఆపి పక్కన షాప్ లో ఓ రెండు టీలు, బన్నులు తీసుకెళ్లి రిషికి ఇస్తుంది.అంతలో ప్రేమ లేఖ సంగతి గుర్తుచేసిన వసుధార..ఎవరు రాశారో తెలుసుకోండి సార్..జీవితంలో అది నాకు మొదటి ప్రేమలేఖ..నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను…మీరంటే నాకు ఇష్టం అని అంటుంది.వసు మాటలు విని రిషి షాక్ లో ఉండిపోతాడు.ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.


Share

Related posts

IPL 2021: ఫామ్ లో లేని కోల్‌కతా తో పంజాబ్ చిత్తుగా ఓడిపోవడానికి ఇవే కారణాలు?

arun kanna

Bigg Boss 5 Telugu: నాగార్జున పై సెటైర్లు వేసిన తెలుగు యాంకర్..??

sekhar

Bomma Adhirindi: హీరో రాజశేఖర్ ను ఇమిటేట్ చేసిన సద్దాం.. నాపేరు రాణిశేఖర్ అంటూ రచ్చరచ్చ?

Varun G