Guppedentha Manasu Jan 22 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఒక్కసారిగా ఎమోషనల్ గా మారిపోయింది.మంచి లవ్ స్టోరీతో అందరిని ఆకట్టుకుంటూ వస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ ఒక్కసారిగా మహేంద్ర అనారోగ్యం పాలవడంతో ఎమోషనల్ అయిపోయింది.నిన్నటి ఎపిసోడ్. లో మహేంద్ర ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది అని డాక్టర్లు చెప్పగా, మహేంద్రని చూడడానికి ఫణింద్ర, దేవయాని,, ధరణి హాస్పిటల్ కు వస్తారు. వారు రావడంతో జగతి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది.ఈరోజు కూడా మళ్ళీ హాస్పిటల్లోనే సీన్ ప్రారంభమైంది.
Karthika Deepam Jan 22 Today Episode: అబ్బా! ఒక కాఫీ ఎంతపని చేసింది.దీపను అడ్డంగా బుక్ చేసేసిందిగా. మరి దీప ఎలా తప్పించుకుంటుందో..?
Guppedentha Manasu Jan 22 Today Episode: హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న మహేంద్ర :
మీరందరు ఇంటికి వెళ్లండి నేను డాడ్ ని తీసుకొస్తా అని చెబుతాడు రిషి. దానితో దేవయాని, ఫణీంద్ర,ధరణి ఇంటికి వెళ్ళిపోతారు.ఇంతలో మిషన్ ఎడ్యుకేషన్ పనులు ఎంతవరకూ వచ్చాయని మహేంద్ర అనడంతో ఇప్పుడు అవి అవసరమా అంటుంది జగతి. నాకు కాఫీ తాగాలని ఉందని అంటే నువ్వేం తినాలో నేను డిసైడ్ చేస్తాను అని జగతి అంటే ఇదే మాట మన పుత్రరత్రం కూడా అన్నాడు తెలుసా అంటాడు. అలాగే మా వదిన నాపై తెగ ప్రేమ చూపిస్తోందిలే అంటాడు మహేంద్ర జగతితో.మిమ్మల్ని ఏమైనా అన్నదా అంటే ఆ అవకాశం ఇవ్వలేదు అంటుంది వసుధార. జగతి నువ్వుకూడా వెళ్లిపోతావా అంటే.. తప్పదు కదా మహేంద్ర అంటే నాతో రావొచ్చు కదా ఇంటి వరకూ వచ్చి నన్ను వదిలేసి వెళ్లిపో అని అడుగుతాడు.ఇదంతా రిషి చూసి బయటకు వెళ్లిపోతాడు.
Devatha Serial: దేవి మీద తనకేం హక్కుందో రాధకు తేల్చి చెప్పిన ఆదిత్య..!! తన కన్నకుతూరే అని చెప్పేశాడా..!?
మహేద్రతో కలిసి వచ్చిన జగతి.. ఇంటి లోపలికి రమ్మని రిషి పిలుస్తాడా..?
రిషి, వసుధారా, మహేంద్ర, జగతి నలుగురు కలిసి కారులో ఇంటి దగ్గరకు వస్తారు.అయితే ముందు కార్లోంచి జగతి దిగడం చూసి దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి జగతి లోపలకు వస్తుందా? ఎలా వస్తుందో చూస్తా అడుగు పెట్టనిచ్చేదే లేదని మనసులో అనుకుంటుంది. కార్లోంచి దిగిన మహేంద్ర తూలిపడబోతుంటే జగతి పట్టుకోవడం చూసి మా డాడ్ ని నేను చూసుకుంటాను అని రిషి అనడంతో మహేంద్ర చేతిని జగతి వదిలేస్తుంది. మహేంద్రను రిషి పట్టుకుని ఇంటి లోపలకు తీసుకుని వెళ్తుంటే ధరణి వచ్చి దిష్టి తీస్తుంటే ఆ పళ్లెం తీసుకున్న దేవయాని జగతిని తిట్టేలా దిష్టి తీస్తుంది. మహేంద్ర వెనక్కు తిరిగి జగతిని చూసి నవ్వుతూ ఈ గడప దాటి ఎప్పుడు వస్తావు జగతి అని మహేంద్ర మనసులో అనుకుంటే నేను ఆ గడప దాటి ఎప్పటికీ లోపలకు రాలేనేమో మహేంద్ర అని జగతి అనుకుంటారు.
జగతి కళ్ళముందే తలుపులు వేసిన దేవయాని :
ఇంతలో దేవయానికి వచ్చి మహేంద్రకి జగతి కనిపించకుండా అడ్డంగా నిల్చుంటుంది. ఇంతలో గౌతమ్ బయట కారు దిగివస్తాడు. ధరణి లోపలకు వచ్చి తలుపు వేసేయండి అన్న దేవయానితో రిషి ఒక్క నిముషం అని జగతి దగ్గరకు వెళ్లి నమస్కారం పెట్టి మీరిద్దరూ లేకపోతే ఈరోజు మా డాడీ ఉండేవారే కాదు థ్యాంక్యూ అని చెప్పి,గౌతమ్ తీసుకెళ్లి డ్రాప్ చేసిరా అని చెప్పి లోపలకు వెళ్లిపోతాడు.ఇంటికి తిరిగి వెళుతూ దేవయాని, రిషి అన్నా మాటలు అన్నీ గుర్తుచేసుకుంటుంది జగతి.
అనాధ శవంలా కాటికి వెళ్తానేమో అనే బాధలో జగతి :
మేడం మీరుకూడా ఇంట్లోకి వెళ్లాల్సింది కదా అన్న వసుతో ఏ అర్హతతో వెళ్లాలి చెప్పు,మహేంద్ర భార్యగానా దేవయాని ఒప్పుకోదు, రిషి తల్లిగానా రిషి ఒప్పుకోడు.ఆ ఇంటి కోడలిగానా అప్పుడు అందరూ ఒప్పుకోవాలి ఇంకా ఎలా వెళ్లాలి చెప్పు వసు అంటుంది జగతి.మిషన్ ఎడ్యుకేషన్ రూపకర్తగా మాత్రమే వాళ్ల దృష్టిలో ఉన్నాను అంటుంది. మీరు వెళితే మహేంద్ర సార్ సంతోషపడేవారు కదా అంటే లోపలకు వెళ్లాలంటే తలుపులు తీసి ఉంటే సరిపోదు.వాళ్లంతా స్వాగతించాలి.అవకాశం ఉందని కాదు ఆహ్వానం ఉన్నప్పుడే వెళ్లాలి అప్పుడే ఆ గడప తొక్కుతాను.ఆ గడపకి మొక్కుతాను.అది గడపకాదు సీతారాముల్ని విడదీసిన లక్ష్మణరేఖ అని నన్ను గౌరవంగా పిలిచిన రోజే ఆ గడప దాటి లోపలకు వెళతాను అంటుంది. అసలు వేళతానో లేదో..ఇలాగే ఒంటరిగా అనాధ శవంలా కాటికి వెళతానేమో అని జగతి బాధపడుతూ అన్నా మాటలు విని వసు షాక్ అవుతుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.!