Guppedentha Manasu Jan 29 Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ కధనం భలే ఉత్కంఠగా మారింది. జగతిని ఇంటికి తీసుకురావడంతో దేవయాని రగిలిపోతూ ఫణేంద్రకు ఫోన్ చేసి త్వరగా రండీ అంటుంది. ఇంకా వసు కాలికి దెబ్బతగలడంతో రిషి సపర్యలు చేస్తూ ఉంటాడు ఇక ఈరోజు ఎపిసోడ్ లో జగతి నువ్వు మనింటికి వచ్చావంటే నాకు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు అంటాడు మహేంద్ర.నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడుతుంటే నా కళ్లతో చూసేవాడ్ని.. ఈ ఇంట్లో నీ కాలు మోసి ఎన్నాళ్లైంది. సంక్రాంతి పండుగకి రిషి నాకు చాలా గొప్ప గిఫ్ట్ ఇచ్చాడనమాట’ అంటూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు.
Job Notificatation: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకి సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్..!!
Guppedentha Manasu Jan 29 Today Episode: ఇది నిజామా… కలా అనే సంధిగ్ధంలో జగతి :
ఇక జగతి మహేంద్రని కళ్లార్పకుండా చూస్తూ ‘నన్ను మాట్లాడించకు మహేంద్రా ఒకవేళ ఇది కలేమో ఎక్కడ మెలుకువ వస్తుందో అనే భయంలోనే ఉన్నాను అంటుంది.ఇంతలో ధరణి వచ్చి.. ‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ‘పెద్ద అత్తయ్యగారి కోపం చూస్తుంటే భయం వేస్తోంది అంటుంది. మేము వచ్చి అన్నయ్యని కలుస్తాంలే’ అని ధరణిని పంపించి.. జగతితో పాటు మహేంద్ర కూడా కిందకి వెళ్తాడు.
Samantha: ఇంత జరుగుతుంటే సమంత ఊరుకుంటుందా..?
వసు పెట్టిన పోటీలో ఎవరు గెలుస్తారో..?
ఇక వసు.. గౌతమ్, రిషిలతో.. ‘గొబ్బ లేనిదే ముగ్గుకి విలువ లేదు.. పండగకి విలువ లేదు’ అంటూ ఆవు పేడ ఎవరు ముందు తెస్తారో వాళ్లకి నేను గిఫ్ట్ ఇస్తాను అంటుంది. దాంతో గౌతమ్, రిషిలు ఆవు పేడ కోసం సైకిల్స్ వేసుకుని వెళ్లిపోతారు.ఇక దేవయాని రగిలిపోతూ.. ‘ఏంటి దేవయానీ? నీ బాధేంటీ?’ అంటాడు మహేంద్ర. ‘ఎప్పుడో తెంచుకున్న చుట్టరికం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అని అడుగుతున్నాను’ అంటుంది
‘వదినా జగతి తనంతట తాను ఇక్కడికి రమ్మన్నా రాదు..’ అంటాడు మహేంద్ర. ‘మరి ఎందుకొచ్చిందో’ అని దేవయాని వెటకారంగా అనడంతో.. ‘దీనికి సమాధానం రిషి చేత చెప్పిస్తాను’ అంటాడు.
Budget 2022: రొయ్య, చేపల ఫీడ్ పై దిగుమతి సుంకం తగ్గించాలంటూ కేంద్రమంత్రికి లేఖ..!!
అసలు దేవయాని బాధ ఏంటో..?
దేవయానీ అసలు నీ బాధేంటో ఇన్నేళ్లు అయినా నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఎప్పుడో ఏదో జరిగిందని ఆ బరువుని ఇంకా మోస్తున్నావా.. నీ ఇల్లు నీ ఇల్లు అంటున్నావ్.. ఈ ఇంటి మీద నీకు ఎంత హక్కు ఉందో జగతికి కూడా అంతే హక్కు ఉంటుంది’ అంటాడు ఫణేంద్ర. ఇక ‘అక్కయ్యగారు.. నేను హక్కులకోసం పంతానికి వెళ్తే మీకే అవమానం జరుగుతుంది. రిషి మనసు కష్టపెట్టకూడదు అనే ఒకే ఒక్క విషయంలో మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా సహిస్తున్నాను’ అంటుంది జగతి.అదండీ సంగతి.. వింటున్నారా’ అంటుంది దేవయని.‘వదినా మీరు తప్పుగా మాట్లాడుతున్నారు.. ఇక్కడ ఎవ్వరూ పరాయి వాళ్లు లేరు.. జగతి నా భార్య..’ అంటాడు మహేంద్ర కోపంగా.. ‘కానివ్వండి అంతా ఒకటి అయ్యారు’ అంటూ దేవయాని అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతుంది. జగతి ఎమోషనల్ అవుతూ ఉండగా.. ఫణేంద్ర, మహేంద్ర పైకి లేస్తారు. జగతీ.. అంటూ మహేంద్ర ఓదారుస్తుంటే.. ‘ఊరుకోమ్మా ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చావ్ కన్నీళ్లు పెట్టుకోవద్దు’ అంటూ నచ్చజెబుతాడు ఫణేంద్ర.
జగతి, మహేంద్రలకు బట్టలు పెట్టనున్న దేవయాని:
ఇక దేవయాని ఒంటరిగా కూర్చోవడం చూసి మహేంద్ర కోసమైనా నాలుగు రోజులు నవ్వుతూ ఉండొచ్చుగా’ అంటాడు ఫణేంద్ర. నా వల్ల కాదు అంటుంది దేవయాని. ఇంతలో ధరణి వచ్చి.. ఫణేంద్ర చేతిలో బ్యాగ్స్ అందుకుంటుంది. ‘ఏంటండీ..అవి’ అంటుంది దేవయాని. ‘జగతి మహేంద్రకు బట్టలు తెచ్చాను దేవయాని.. మన చేతులతో వాళ్లకి ఇస్తే బాగుంటుంది. అయినా ఆ జగతిని నా చేతులతో బట్టలు పెట్టను’ అంటూ అక్కడ నుంచి వెళ్లబోతుంటే.. మహేంద్ర, జగతి అప్పుడే వస్తారు. వాళ్లని చూడగానే.. ‘రండి మహేంద్రా రా అమ్మా జగతి’ అని మహేంద్ర కవర్ చేసి దేవయాని ఇరికిస్తాడు. సరిగ్గా అప్పుడే రిషి పై నుంచి కిందకు దిగడం చూసి రిషి కోసమైనా దేవయాని జగతికి బట్టలు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది