Guppedentha manasu Jan 8 today episode: వసుధారకు ఐ లవ్ యూ చెప్పిన గౌతమ్.. షాక్ లో రిషి… మరి వసు సమాధానం ఏంటి..?

Share

Guppedentha manasu Jan 8 today episode: గుప్పెడంతమనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు ఉత్కంఠను కలిగిస్తుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఒకరికి తెలియకుండా ఒకరు అందరు ఒకే చోటకు చేరతారు.ఈరోజు ఎపిసోడ్ కూడా అదే సీన్ తో మొదలవుతుంది. వసునూ కలవడానికి ఇంటికి వచ్చిన గౌతమ్ అక్కడ రిషిని చూసి వీడికి ఇలా బుక్ అయ్యానెంట్రా బాబు అని మనసులో అనుకుంటూనే ఇబ్బందిగా అందర్నీ పలకరిస్తాడు గౌతమ్. అప్పుడు ఏంటి గౌతమ్ నా కార్లో వచ్చి సగం దారిలో దిగిపోయావు అని మహేంద్ర అంటాడు. హా అంకుల్ ఆపని అవలేదంటాడు. అయినా నువ్వెందుకు వచ్చావ్ అంటే నువ్వెందుకు వచ్చావ్ అని గౌతమ్-రిషి ఇద్దరూ అనుకుంటారు.

Prabhas, NTR: ప్రభాస్, ఎన్టీఆర్ చేతులు కలిపితే మాములుగా ఉండదు.. చూడండి మీరే..

Guppedentha manasu Jan 8 today episode:జగతి మేడం ఇంట్లో మహీంద్రను చూసి అనుమానపడిన గౌతమ్ :

ఈ రోజు పెండింగ్ లో ఉన్న మిషన్ ఎడ్యుకేషన్ వర్క్ చేయాలి అని మాట్లాడుకుంటుంటే ఈలోపు గౌతమ్ అంకుల్ మీరేంటి ఇలా జగతి మేడం ఇంటికి వచ్చి చనువుగా మిర్చి బజ్జీ పకోడి తింటున్నారు అనడంతో అందరూ షాక్ అయ్యి చూస్తారు. ఇంతలోనే మేడం మీరు క్లాస్ మేట్స్ అనుకుంటా అందుకే ఇంత ఫ్రీగా ఉంటున్నారని అంటాడు. మళ్ళీ నువ్వెందుకు వచ్చావో చెప్పు అంటూ ఇద్దరూ కూడా మళ్ళీ గొడవ మొదలుపెడతారు.ఈలోపు రిషి ఏంటీ నమ్మడం లేదా అంటూ జేబులోంచి పెన్ డ్రైవ్ తీసి ఇస్తాడు.ఈలోపు గౌతమ్ అందరం కలిసాం కదా అలా వెళ్లి స్నాక్స్ తిందాం అంటే..ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ ఏమి లేవు గాని నువ్వు వెళ్ళు గౌతమ్ అని మహేంద్ర కార్ తాళాలు ఇచ్చి గౌతమ్ ను అక్కడనుండి పంపించేస్తాడు రిషి.

Karthika Deepam Jan 8 episode: అది దీపక్క అంటే… కళ్ళు ఎర్ర చేస్తే దెబ్బకి రౌడీలు సైతం పరార్..!
కొడుకు అంటే రిషిలాగానే ఉండాలి.. ఎందుకంటే..?

ససీన్ కట్ చేస్తే ఒక గ్రౌండ్ లో కార్ ఆపిన రిషి మహేంద్రను కిందకు దిగమని అడుగుతాడు. సారీ డాడ్ అనడంతో నువ్వెందుకు సారీ చెబుతున్నావ్ రిషి అని అడుగుతాడు మహేంద్ర. గౌతమ్ ఏదో అన్నాడని నేను ఫీలవుతున్నా అని నువ్వు ఫీలవుతున్నావా అంటాడు. గౌతమ్ కి మీ గురించి పూర్తిగా తెలియదు, చెప్పాల్సిన అవసరం కూడా రాలేదు.మీరు వాడికి సమాధానం చెప్పాలిసిన సందర్బం వస్తుందని అసలు అనుకోలేదు అంటాడు రిషి.అక్కడకు నేను రావాల్సింది కాదేమో అంటాడు మహేంద్ర. మీరు ప్రపంచంలో నాకు తప్ప ఎవ్వరికి సారీ చెప్పినా బాధపడతాను.అలా అని నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు..మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనాలంటే నన్ను దాటి వెళ్లాల్సిందే అని ఏమోషనల్ అవుతాడు రిషి. మీ మనసుకి నచ్చింది మీరు చేయండి..మీరేం చేసినా మీరు నా హీరో అని తన మాటలతో మహేంద్రను కదిలిస్తాడు.

కొడుకు కోపాన్ని తలుచుకుని మురిసిపోతున్న జగతి మేడం :

మళ్ళీ సీన్ వసుధారా దగ్గర ఓపెన్ అవుతుంది.ఆలోచనలో పడ్డ వసుధార దగ్గరకు వచ్చిన జగతి రిషి కోపం బావుంటుందా- సహనం బావుంటుందా అని అడుగుతుంది వసునూ. మేడం రిషి సర్ సహనమే బావుంటుందని అంటుంది. కాని జగతి మాత్రం రిషి…రిషిలా ఉంటేనే బావుంటుంది.. తన కోపాన్ని అదుపులో పెట్టుకుని మహేంద్రకి ఎక్కడ చెడ్డపేరు వస్తుందో అని రిషి పడిన తపన నేను చూశాను..అప్పుడు తల్లిగా నా మనసుకి చాలా బాధేసింది వసు. నిజమైన కష్టం అంటే ఏంటో తెలుసా వసు మనం కష్టాలు పడడం కాదు,మనకు ఇష్టమైన వాళ్లు మనకోసం కష్టపడుతుంటే వారి కష్టాన్ని చూసి ఏమీ చేయలేని పరిస్థితిలో అలా చూస్తుండిపోతాం చూడు అదే కష్టం అని అంటుంది.భవిష్యత్ లో అయినా వాడికి కొంతైనా ఆనందాన్ని ఇవ్వగలిగితే అదే చాలని జగతి అక్కడి నుంచి బాధతో వెళ్ళిపోతుంది. మీరు బాధపడకండి మేడం ఆ రోజు తప్పకుండా వస్తుంది అంటుంది వసుధార.

గౌతమ్ ప్రేమకు విలన్ లా మారిన రిషి :

సీన్ కట్ చేస్తే  రిషి గీసిన వసుధార బొమ్మ ముందు కూర్చుని ఉంటాడు గౌతమ్. ఈలోపు అక్కడికి వచ్చిన రిషి ఏరా ఇంకా పడుకోలేదా అంటాడు.నువ్వెందుకురా రిషి పరిగెడుతున్న నా కాళ్లకు కాళ్లు అడ్డంపెట్టి మరి ఆపేస్తున్నావ్ అని అంటాడు గౌతమ్. సాధ్యమైతే నాకు హెల్ప్ చేయి కానీ ఇలా అడ్డుపడడంనాకు చాలా బాధగా ఉందని అంటాడు గౌతమ్. నువ్వు నా స్నేహితుడివి దేనికి సపోర్ట్ చేయాలో నాకు తెలుసు అంటాడు రిషి. ఏంటో నీ కోపాన్ని తట్టుకోలేను, నీ ప్రేమను భరించలేను అంటాడు.నా ప్రేమకి అందరూ విలన్స్ లా తయారయ్యారని వసు ఫొటో చూస్తూ మాట్లాడతాడు గౌతమ్. అయినాగానీ వసుధారా నా మనుసులో ఉండగా నేను తన కళ్ళను గీయలేకపోయాను.మరి రిషి ఏంటి ఇంత అందంగా ఎలా కళ్ళు గీయగలిగాడు అనుకుంటాడు గౌతమ్.నెక్స్ట్ఎపిసోడ్ లో గౌతమ్ వసుకు ఐ లవ్ యూ అని ప్రొపోజ్ చేసి రిషికి, వసుకు పెద్ద షాక్ ఇస్తాడు.. మరి గౌతమ్ యాక్షన్ కు వసు రియాక్షన్ ఏంటి అనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి.


Share

Related posts

అందరిని భయపెడుతున్న WHO సరికొత్త వార్త..!!

sekhar

బ్రేకింగ్: ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ సీఎం అంజబ్ బాషాకు కరోనా పాజిటివ్

Vihari

Pawan Kalyan: ప్రధాన మంత్రి మోడికి థ్యాంగ్స్ చెప్పిన పవన్ కళ్యాణ్..! ఎందుకంటే..?

somaraju sharma