Guppedentha manasu Jan6 Episode: క్లాస్ లో స్టూడెంట్స్ ముందు వసుకు రోమియో జూలీయేట్ బుక్ ఇచ్చిన రిషి…అ తరువాత ఎలా కవర్ చేసాడంటే..?

Share

Guppedentha manasu Jan6 Episode: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తిగా ముందుకు సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో వసుధారను తలుచుకుంటూ వసు బొమ్మ గిస్తాడు రిషి. ఈరోజు ఎపిసోడ్ కాలేజీ లో ఓపెన్ అవుతుంది.గౌతమ్ వసునూ రోమియో జూలీయేట్ బుక్ అడగగా ఆ బుక్‌ని వసు లైబ్రేరీలో వెతుకుతుంటే.. గౌతమ్ మాత్రం సైలెంట్ గా ఉండకుండా అల్లర చేస్తుంటాడు. అది చూసిన వసు ‘సార్ సైలెంట్‌గా ఉండండి’ అంటూ సైగ చేస్తుంది. అయినా గౌతమ్ వినిపించుకోకుండా నేను రిషి ఫ్రెండ్ అని చెప్పా దాంతో లైబ్రరియన్ మూసుకున్నాడు’ అంటూ బిల్డప్ కొడతాడు గౌతమ్. దాంతో వసు ఓ పేపర్ పెన్ తీసుకుని..మీరు రిషి సార్ ఫ్రెండ్ అనే అభిమానంతోనే మీరు చెప్పిన బుక్ వెతుకున్నాను.. ప్లీజ్ సైలెంట్‌గా ఉండండి’ అని రాసి గౌతమ్‌కి చూపిస్తుంది. దాంతో గౌతమ్ నోటిపై వేలు వేసుకుని సైలెండ్‌గా ఉంటాడు.ఇంతలో రిషి లైబ్రరీ కి వచ్చి ‘రేయ్ ఇంకా లైబ్రేరీ టైమ్ కాలేదు, నువ్వేంటి ఇంత సైలెంట్‌గా ఉన్నావ్?’ అంటూనే.. వసు రాసిన పేపర్ చూసి.. ‘రేయ్ ఏంట్రా ఇది వసుధర రాసింది కదా.. ఇక్కడ కూడా నన్ను వాడేస్తున్నావా?’ అని తిడతాడు.

Guppedentha manasu Jan6 Episode: వసూకి రోమియో జూలీయేట్ బుక్ ఇచ్చిన రిషి :

ఇంతలో వసుకి రోమియో జూలియట్ బుక్ దొరకడంతో.. దాన్ని తీసుకుని రిషికి ఎదురొస్తుంది. అనుకోకుండా ఇద్దరూ తగులుకోవడంతో ఆ బుక్ కాస్త కిందపడిపోతుంది. దాన్ని రిషి తీసుకుని.. ‘ఏంట్రా ఇది? వసుధరకి పని చెబుతున్నావా నువ్వు?’ అంటాడు. దాంతో గౌతమ్ కావాలని ‘నువ్వే అన్నావ్ కదరా.. రోమియో జూలియట్ డ్రామాని కాలేజ్ యానివర్సరీకి వేయిద్దాం అని అందుకే వెతికించాను’ అంటూ రిషికి సైగ చేస్తాడు.దాంతో రిషి.. ‘హా అవును అంటూ ‘వసుధరా ఇప్పుడు నా క్లాస్ ఉంది కదా. నువ్వు క్లాసుకి వెళ్లు’అని అంటాడు.బుక్ ఇవ్వకుండా అదే బుక్ తీసుకుని రిషి క్లాసుకి వెళ్తాడు.

Karthika Deepam Jan6 Episode: దీపకు అసలు నిజం తెలిసిపోయిందా..? ఇవాళ ఎపిసోడ్ లో BIG TWIST
మహేంద్ర ఐడియా ఏంటి? అది వర్క్ అవుట్ అవుతుందా..?

గౌతమ్ అసహనంగా రిషి క్యాబిన్‌కి వెళ్తూ వెళ్తూ.. మధ్యలో జగతి, మహేంద్రలను చూసి ఆగి ‘రిషి నాకు ఏం అర్థం కావట్లేదు. రోమియో జూలియట్స్‌ని విడకొడుతున్నాడు’ అంటూ ఏదేదో అనేస్తాడు.మధ్యలో రోమియో జూలియట్స్‌ ఏంటీ అంటే.. అబ్బో అది పెద్ద కథ అంకుల్ అంటూ వెళ్లిపోతాడు. దాంతో మహేంద్రకు ఒక ఐడియా వచ్చి యాహూ అనుకుంటూ జగతికి చెబుతాడు.జగతి మాత్రం రిషి మీద ప్రయోగాలు చెయొద్దు’ అంటుంది కానీ మహేంద్ర మాత్రం ఫిక్స్ అవుతాడు.ఇక క్లాసుకి రోమియో జూలియట్ బుక్ తీసుకుని వెళ్లిన రిషి.. చేతిలో ఆ పుస్తకం ఉందని తెలియక.. ‘ఈరోజు మనం దీనిపై చర్చిద్దాం’ అంటాడు. అంతా షాక్ అవుతారు.దాంతో చేతిలోని పుస్తకం వైపు చూసుకున్న రిషి అయ్యో ఇలా బుక్ అయ్యానేంటి..ఎలాగయినా కవర్ చెయ్యాలి’ అనుకుంటూ ‘కాలేజ్ యానివర్సరీలో దీన్ని డ్రామా చేద్దాం అని వసుని పిలిచి ఇది నీ కోసం అని చేతిలో పెడతాడు.

స్టూడెంట్స్ ముందు వసునూ ఇరికించిన రిషి… పాపం వసు..:

ఇంతలో ఓ అబ్బాయి లేచి.. ‘మన భాషలో ఎన్నో నవలలు ఉండగా పరాయిభాషలో పుస్తకాలనే ఎందుకు ఎంచుకున్నారు’ సార్ అనేసరికి రిషి సమాధానం చెప్పలేక దీనికి సమాధానం వసుధర చెబుతుంది’ అని తనని బుక్ చేస్తాడు. దింతో వసు బిత్తరపోతుంది. ‘పరాయి భాష నేర్చుకోవడం తెలుసుకోవడం విజ్ఞానం.. మన భాష మరిచిపోవడం అజ్ఞానం’ అంటూ డైలాగ్‌ చెప్పడంతో అందరు చప్పట్లు కొడతారు.ఇక సీన్ కట్ చేస్తే.. వసు కాలేజ్ మైదానంలో మెట్లపై కూర్చుని ‘ఏంటి సార్ ఈ బుక్ నాకిచ్చారు’అని ఆలోచిస్తూ ఉంటుంది.ఈలోపు రిషి కాస్త వసుకు దదూరంగా కూర్చుని ‘ప్రేమ అంటే ఏంటో తెలిసిందా.. బుక్ చదివాక?’ అంటాడు. ‘నేను ఇంకా దీన్ని చదవలేదు సార్’ అంటుంది వసు. ఇంతలో గౌతమ్ వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని.. ‘లైలా మజ్ను, రోమియో జూలియట్.. వీరందరిలో కామన్‌గా ఉండేది ప్రేమ..లవ్ ఇష్క్.. అంటూ ఏదేదో చెప్తాడు.


Share

Related posts

ఆంధ్రా ప్రాజెక్టులపై కెసిఆర్ ఆగ్రహం ..!ఎమన్నారంటే..?

Special Bureau

Dammalapati Case: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో మరో పెద్ద షాక్..! దమ్మాలపాటి పై పెట్టిన కేసు కొట్టివేత..!!

somaraju sharma

Pooja hegde : పూజా హెగ్డే మీద రూమర్స్.. క్లియర్ గా క్లారిటీ ఇచ్చింది..!

GRK