Guppedentha manasu: రిషి వలన రోడ్డున పడిన వసుధారా… పాపం తన పయనం ఎటువైపో..?

Share

Guppedentha manasu: నిన్నటి గుప్పెడంత మనసు సీరియల్లో వసు జగతి మేడం ఎందుకిలా ప్రవర్తిస్తున్నారని ఆలోచిస్తూ ఉంటుంది. వసుధార ఎన్నిసార్లు అడిగినా జగతి మేడం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరగనుందంటే….
కాలేజీకి టైమ్ అవుతోందని బయటకు వచ్చేసిన జగతికి మహేంద్రకి కాల్ చేసి ఏమైంది అని అడుగుతాడు. నీ ఆలోచనల్లో, నీ మనసులో మార్పు వచ్చింది.ఏమైంది చెప్పు ప్లీజ్ అంటాడు. దేవయాని అక్కయ్య కారణంగా అందరికీ దూరంగా ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చావ్. లేని బంధాలు వెతుక్కుంటూ వచ్చి నరకయాతన పడుతున్నా, నాకు నీ ఓదార్పు మాటలు అవసరం లేదు నువ్వు-వసు,రిషి అందరూ నన్ను ఒంటరిగా వదిలేయండి అనిఫోన్ కట్ చేస్తుంది. జగతి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని మహేంద్ర షాక్ లో ఉండిపోతాడు. జగతి మాటలను వెనుకనుంచి వసుధార విని కన్నీళ్లు పెట్టుకుంటుంది. 

Karthika deepam: బిచ్చగాడి ద్వారా కార్తీక్,దీపలు ఎక్కడున్నారో సౌందర్య తెలుసుకుంటుందా…?? 
జగతి మాటలకూ కంటతడి పెట్టిన వసుధారా:

సీన్ కట్ చేస్తే కాలేజీలో ఒంటరిగా కూర్చుని జగతి మేడం అన్నమాటల్ని తలుచుకుంటుంది వసుధార. ప్రతి కష్ట సమయంలోనూ నాకు తోడుగా ఉన్నారు, కానీ ఇప్పుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అనుకుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి వసుని గమనించి ఎందుకలా ఉన్నావని అడుగుతాడు. ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం కావుకదా అంటుంది. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కొనే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు రిషి. అయినాగానీ నీ పర్సనల్ అయితే ఏం చెప్పొద్దులే అనేసి లేచి వెళ్లిబోతుంటే..జగతి మేడం ఆలోచనలు, ఆచరణ ఒకేలా ఉంటాయి.ఈ మధ్య మేడం కొత్తగా మాట్లాడుతున్నారు, మునుపెన్నడూ లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని బాధపడుతుంది. నేను తన దగ్గర ఉండడం ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు సార్ అని చెబుతుంది. తనకి ఇష్టం లేనప్పుడు నువ్వు అక్కడ ఉండడం అవసరం లేదు కదా.. ఎక్కడోచోట ఉండడం కాదు నా సమస్య, మేడం కొత్తగా అలా మాట్లాడటమే నమ్మలేకపోతున్నా  అని చెబుతుంది. వెళ్లిపొమ్మని చెప్పారా అని రిషి అడిగితే..అలా చెప్పినా బావుండేది, నా తప్పేంటని అడిగేదాన్ని కానీ చెప్పకనే చెబుతున్నారంటుంది.

Nails: గోర్లు కట్ చేసుకునే ముందు ఈ విషయం తెలుసుకోండి!!
ఈగో మాస్టర్ కి జలక్ ఇచ్చిన వసు :

ఇవన్నీ తెలిసినప్పుడు వద్దని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నప్పుడు అక్కడే ఉండడం ఎందుకని క్వశ్చన్ చేసిన రిషి..ఏదైనా హాస్టల్లో ఉండొచ్చు కదా అంటాడు. నేను హాస్టల్ కి వెళ్లలేను సర్ అని షాక్ ఇస్తుంది. మేడం మాట్లాడే మాటలు అసలు మేడంవే కాదు , నాకు అర్థమవుతున్నాయి, తను అలా మాట్లాడరు, ఎవరో ఏదో అన్నారు.అదెవరో చెప్పడం లేదు, కానీ నేను తెలుసుకుంటాను అంటుంది. మరి మేడంని బాధపెట్టను,హాస్టల్ కి వెళ్లను అంటున్నావ్..మరెక్కడికి వెళతావ్ అని రిషి అడగడంతో మేడంని విడిచిపెడితే హాస్టల్ కి వెళ్లేది లేదు, ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు అంటుంది. మీ మేడం చెప్పినట్టు వినొచ్చు కదా అన్న రిషితో..ఆమె ఏం చెప్పినా వింటాను, నా కోసం మానాన్ననే ఎదిరించారు, నాకోసం ప్రతిసారీ రక్షణగా నిలిచారు..అలాంటి మేడం మనస్ఫూర్తిగా చెబితే వింటాను కానీ ఆమెని ఎవరో వ్యక్తి కట్టిపడేస్తున్నారు. నన్ను వెళ్లిపొమ్మంటున్నారంటే నాకన్నా ఎక్కువగా తను బాధపడుతున్నారు, వినిపించే మాటలు మేడంవి కావు సార్ అంటుంది.

పాపం వసుధారా…. తన పయనం ఎటువైపో??

నేను ఎమన్నా హెల్ప్ చేయనా అంటే వద్దు సార్ ఉంటే మేడం దగ్గర ఉంటా, లేదంటే ఎవ్వరికీ భారం కాకుండా, ఎవ్వరి కంటికీ కనిపించకుండా ఏటో అటు వెళ్లిపోతాను సార్ అంటుంది. నేను ఎక్కడికి వెళ్లినా, ఎక్కడైనా బతికే ధైర్యం నాకుంది సార్ అంటుంది వసు. వసు మాటలు విని షాక్ అవుతాడు రిషి. అసలు ఎక్కడికి వెళతావ్, ఏం చేస్తావ్ అని అడిగినా.. నేను నా మనసు చెప్పింది చేయబోతున్నా అనేసి అక్కడినుంచి వెళ్లిపోతుంది వసు.. సీన్ కట్ చేస్తే లోపల నుంచి లగేజ్ సర్దుకుంటూ జగతి మేడం తనకోసం చేసిన ప్రతి సహాయాన్ని గుర్తుచేసుకుని,సూట్ కేస్ తీసుకుని బయటకు వస్తుంది వసుధార. జగతి మేడం దగ్గర కాసేపు అలా నిల్చుని, ఏమి మాట్లాడకుండా బయటకు వెళ్లిపోతుంది. పాపం జగతి అటువైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.ఇక్కడితో ఈరోజు ఏపిసోడ్ ముగిసింది.మరి రేపటి ఎపిసోడ్ లో వసుదార పయనం ఎటువైపో అన్నది సస్పెన్స్ గా మిగిలింది.


Share

Related posts

IPL 2021 : కెప్టెన్ అయిన వెంటనే రోహిత్ శర్మ ను దాటేసిన రిషబ్ పంత్

arun kanna

ఈ హత్యలు అన్నీ జగన్ చేశారా…? ఈ లెక్కన బాబు జీవితాంతం జైల్లోనే ఉండాలేమో లోకేషా…

arun kanna

రియా చ‌క్ర‌వ‌ర్తి గురించి షాకింగ్ విష‌యాల‌ను బ‌య‌ట పెట్టిన సుశాంత్ వంట మ‌నిషి

Srikanth A