Guppedentha manasu: సెల్ఫీ చూసి షాక్ అయిన రిషి.. ఇంతకీ ఎవరిదంటే..?

Share

Guppedentha manasu: గుప్పెడంత మనసు సీరియల్ మంచి రసవత్తరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది. ఒకపక్క వసుకు తన ప్రేమ విషయం చెప్పలేక,మరోవైపు గౌతమ్ వసుధారకు దగ్గర అవ్వడం చూడలేక సతమతమయిపోతూ ఉంటాడు రిషి. అయితే నిన్నటి ఎపిసోడ్ లో రిషి కార్ దిగి కాలేజ్ కి వెళ్తూ వెళ్తూ జేబులోని కారు కీ కింద పడిపోతుంది. అది వసు దూరం నుంచి చూస్తుంది. అయితే దగ్గరకి వెళ్లే లోపు అటుగా వెళ్తున్న స్టూడెంట్స్ దాన్ని చూసుకోకుండా కాలితో నెట్టడంతో ఆ కీ వసుకి కనిపించదు.ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఆ సీన్ తోనే కంటిన్యూ అవుతుంది.రిషి క్లాస్ రూమ్ కి వెళ్లడం ఆ వెనుకే వసు-పుష్ప క్లాస్ లోకి వెళతారు. క్లాసులో వసు ఏదో కంగారుగా ఉండడం చూసిన రిషి.. వసుధార అని రెండుసార్లు గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి లేచి నిల్చుంటుంది.

Marriage:  వివాహం  త్వరగా  జరగాలన్నా ,ఐశ్వ‌ర్య ప్రాప్తి కావాలన్నా  ఇది సులభమైన మార్గం!!


Guppedentha manasu: వసుధారను క్లాసులోంచి బయటకు పోమన్న రిషి

వసుధార నీకు క్లాస్ వినడం ఇష్టం లేకపోతే నువ్వు క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపో, వేరేవాళ్లని డిస్ట్రబ్ చేయొద్దు అంటాడు.వెంటనే పడిపోయిన సార్ కీ వెతకడానికి ఇదే మంచి సమయం అనుకుని,ఎస్ సార్ అనేసి క్లాసు నుంచి బయటకు వెళ్లిపోతుంది. అది చూసి షాక్ అయిన రిషి వెళ్లమంటే వెళ్లిపోవాలా ఉండొచ్చు కదా అనుకుని వసు ఆలోచనలతోనే ఉంటాడు. ఇక వసుధార కార్ కీ వెతికే పనిలో ఉంటుంది.ఈలోపు అక్కడకు వచ్చిన జగతి క్లాస్ వదిలేసి ఇక్కడేం చేస్తున్నావ్ అని అడుగుతుంది. పోయింది వెతుకున్నా అన్న మేడం అని అనడంతో పోగుట్టుకుంది దొరకడం చాలా కష్టం జాగ్రత్త అనేసి వెళ్లిపోతుంది

Karthika Deepam: బిచ్చగాడు కార్తీక్ ను చూస్తాడా..? అసలు దీప ఏమైంది.. ప్రాణాలతోనే ఉందా.. లేక..?
జగతిని పొగిడే పనిలో పడ్డ కాలేజ్ స్టాఫ్ :

ఇక కాలేజీ కాన్ఫరెన్స్ రూమ్ లో అంతా మీటింగ్ అయ్యి బంగారానికి మెరుగుపెట్టినట్టు ఈ కాలేజీకి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మంచి పేరు తెచ్చిపెట్టిందని పొడుగుతాడు ఫణింద్ర.అంతా జగతి మేడం-రిషి సార్ కష్టమే అంటాడు.మిషన్ ఎడ్యుకేషన్ అనాగనే నా పేరు చెబుతున్నారు కానీ దీని వెనుక అందరి కృషి ఉంది అని అంటుంది జగతి.ఈలోపు రిషి కార్ కీ వసుధారకి దొరుకుతుంది.ఈలోపు రిషి రావడం చూసి అటువైపు వెళుతుంది వసుధార. క్లాస్ లో ఆబ్సెంట్ మైండ్ తో ఉండడం నచ్చలేదంటాడు. ఆరోపణ చేసినప్పుడు నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి కదా అంటుంది వసుధార.

Ramgopal Varma: రాంగోపాల్ వర్మతో వైసీపీ మంత్రి పేర్ని నాని..!!
అసలు విషయం తెలిసి షాక్ అయ్యిన రిషి :

కాలేజ్ అయిపొయింది కదా.. నువ్వు రెస్టారెంట్ కి వెళ్లాలి కదా లిఫ్ట్ కావాలా? నేను ఇవ్వనా అంటూ కార్ కీ వెతుక్కుంటాడు రిషి. ఇంతలో కీ ఇచ్చిన వసుధార ఏం జరిగిందో చెబుతుంది. అంతా విన్న మన ఈగో మాస్టర్ కార్ కీ కోసం క్లాస్ పోగొట్టుకోవడం నచ్చలేదు..కార్ కీ పోయిందని చెబితే అటెండర్ వెతికేవాడు కదా అంటాడు.వెంటనే వసుధార ఆ క్లాస్ మళ్లీ అడిగితే చెప్పరా అని అనడంతో ఈగో మాస్టర్ కాస్త కూల్ అవుతాడు. వసుధార కంటే ముందుగా రెస్టారెంట్ కి వచ్చి వసుధార టేబుల్ ఎక్కడుందో అడిగి మరీ గౌతమ్ అక్కడ కూర్చుంటాడు. ప్రపంచంలో ఇంతమందిని చూశాను ఈ వసుధారకే ఎందుకు కనెక్టయ్యా.. అంతా ఆ దేవుడి లీల అనుకుంటాడు గౌతమ్. ఈలోపు రిషి కూడా రెస్టారెంట్ కి వెళ్లి వసు టేబుల్ దగ్గర కూర్చుంటాడు. గౌతమ్, రిషి ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకోరు.

మళ్ళీ సీన్  జగతి,మహేంద్ర దగ్గర ఓపెన్ అవుతుంది.నీ కొడుకు నిన్ను అలా కన్ఫ్యూజ్ చేశాడన్నమాట అంటాడు మహేంద్ర.అవును రిషి క్లియర్ గానే ఉన్నాడు మనమే అర్థం చేసుకోలేకపోయాం అంటుంది జగతి.ఇద్దరూ తెలివైన వాళ్లే కానీ ఎవ్వరూ ముందడుగు వేయడం లేదంటుంది. నిప్పు-ప్రేమ రెండింటినీ ఎంత దాచినా ఎప్పుడో అప్పుడు అవి బయట పడక తప్పదు అంటుంది జగతి.రిషి,గౌతమ్ ఇద్దరూ వసునూ తలుచుకుంటూ ఉంటారు. ఈలోపు గౌతమ్ హలో వసుధార అని పిలుస్తాడు. అప్పుడు రిషి-గౌతమ్ ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అంటే నువ్వేంటి ఇక్కడ అని క్వశ్చన్ చేసుకుంటారు.ఈ సీన్ భలే కామెడీగా ఉంటుందిలెండి.

వసు, గౌతమ్ కలిసి దిగిన సెల్ఫీ చూసి షాక్ లో రిషి :

అక్కడకు వచ్చిన వసుధార..సార్ మీ ఇద్దరూ వేర్వేరుగా వచ్చారా అని అడుగుతుంది. కాఫీ తీసుకురా అని పంపించేసి ఏంట్రా ప్రతిసారీ రెస్టారెంట్లో నీకేం పని నేనెప్పుడు వచ్చినా ఇక్కడే ఉంటున్నావ్ అన్న రిషితో.. నేను వచ్చిన ప్రతీసారీ నువ్వొస్తున్నావ్ అని తిరిగి అడుగుతాడు గౌతమ్. నువ్వెందుకు వస్తున్నావో నేనూ అందుకే వస్తున్నా అని షాకిచ్చి, మళ్ళీ వెంటనే కాఫీ తాగేందుకు అని చెబుతాడు. ఇంతలో చిన్న సర్ ప్రైజ్ అంటూ వసుతో దిగిన సెల్ఫీ చూపిస్తాడు గౌతమ్. దానిని చూసి మన ఈగో మాస్టర్ ఈగో మరింత రెట్టింపు అవుతుంది. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.


Share

Related posts

Aacharya : ఆచార్య లో పూజా హెగ్డే.. నిముషాలకే కోట్లు డిమాండ్ చేసిందా ..?

GRK

Sundari: సెన్సార్ పూర్తి చేసుకున్న “సుందరి”..!!

bharani jella

సుకుమార్ సినిమాలో విజయ్ దేవరకొండ హీరో కం ప్రొడ్యూసర్ ..?

GRK