Guppedentha manasu: గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తిగా ముందుకు సాగుతుంది. వసు మీద ఉన్న ప్రేమను బయటకు చెప్పలేక, గౌతమ్ వసుకు దగ్గర అవ్వడం చూడలేక రిషి సతమతమైపోతున్నాడు. ఈరోజు ఎపిసోడ్ మళ్ళీ రెస్టారెంట్లోనే ఓపెన్ అవుతుంది.ఇంతలో వసుకి తెలియకుండా తీసుకున్న సెల్ఫీని రిషికి చూపిస్తాడు గౌతమ్. అది చూసి షాక్ అయిన రిషి తనకు చెప్పకుండా ఫొటో తీయడం మంచిది కాదని ఫోన్ లాక్కుని ఆ ఫొటో డిలీట్ చేస్తాడు. మిత్రద్రోహి,స్నేహం కోసం ప్రాణం ఇస్తారురా కొందరు స్నేహితులు అంటే, వాళ్ళు చేసిన చెత్తపనులను వ్యతిరేకిస్తారు నాలాంటి కొందరు అంటాడు రిషి. వసుధారకి పార్టీ ఇస్తాను తనకు చెప్పకు అంటాడు.. కానీ రిషి మాత్రం పార్టీ ఎందుకు ఇస్తున్నావని వసు ముందు ఇరికిస్తాడు.
Karthika Deepam: ఇవాళ ఎపిసోడ్ లో బాబు తో ఉన్న దీప -కార్తీక్ లని చూసి ప్రేక్షకుల కంట్లో నీళ్ళు తిరిగాయి !
Guppedentha manasu: వసుధారా బొమ్మని గీసిన రిషి :
సీన్ కట్ చేస్తే ఇంటికి చేరుకున్న రిషి మౌత్ ఆర్గాన్ తో బిజీగా ఉంటే.. గౌతమ్ మాత్రం తాను గీస్తున్న బొమ్మ సరిగా రావడం లేదని అంటాడు.మనసులో ఉండే రూపం పేపర్ పై ఆటోమేటిగ్గా ప్రవహిస్తుంది అంటాడు రిషి. గౌతమ్..ఆర్ట్ ని ఆర్టిఫిషియల్ చేయకురా.ఏకాగ్రత లేనప్పుడు ఏపనీ చేయకూడదు.అందులోనూ కళకు సంబంధించిన పనులు చేయకూడదంటాడు. నువ్వు ఎప్పుడూ ఎంకరేజ్ చేయవు అన్న గౌతమ్..అందమైన కళ్లని అందంగా గీస్తానని,అంతలోనే కుదరట్లేదని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు రిషి..వసుధార ఊహల్లో ఆమె బొమ్మ గీస్తాడు.
Vangaveeti Radha: పరీక్ష కొడాలి నానిది.. ఫెయిల్ అయింది జగన్..! రాధ రాజకీయంలో ట్విస్టు!!
గౌతమ్ కి అర్ధం కానీ రిషి :
ఇంతలో సోఫాలో పడుకున్న వసు చేతిలో బుక్ తీసి టేబుల్ పై పెట్టే సమయంలో నెమలి ఈక చూస్తుంది జగతి. ఒక్కోసారి ధైర్యంగా ఉంటావ్, మళ్ళీ చిన్న పిల్లలా మారిపోతావ్, రిషిలాగే నువ్వు కూడా అర్థం కావు.అనుకుని జంట నెమలీకలు ఉన్న బాటిల్లో మూడోది పెడదాం అనుకున్న జగతి జంట అంటే రెండే కదా మూడో నెమలీకను ఏం చేయాలని ఆలోచించి అదే బాటిల్లో పెట్టేసి వెళ్లిపోతూ..వద్దులే రెండే బావున్నాయని ఒకటి తీసేస్తుంది. ఈలోపు పేపర్ చదువుతున్న రిషికి గుడ్ మార్నింగ్ మిత్రమా అంటూ ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. కాఫీ తీసుకుందామని గౌతమ్ అనుకునే లోగా ఇది నా కాఫీ అంటూ తీసుకుంటాడు రిషి. ఇది నాకే రాసుందని త్యాగం చేసెయ్ అన్న గౌతమ్ తో..ఈ కాఫీపై నీ పేరు లేదు అంటాడు.పోనీ షేర్ చేసుకుందామా అంటే… అన్నీ షేర్ చేసుకోలేం అంటాడు.పొద్దున్నే విచిత్రంగా మాట్లాడుతున్నావ్ అన్న గౌతమ్ తో..సమయం సందర్భాన్ని బట్టి నేను పద్ధతి మార్చుకోను అంటాడు రిషి. నువ్వు మాట్లాడుతున్నది కాఫీ గురించేనా అన్న గౌతమ్ తో..నీకు ఎలా అర్థమైతే అలా అంటాడు . నేను కాలేజీకి వెళుతున్నా అంటే నువ్వెక్కడికి వెళితే నేను కూడా అక్కడికే అంటాడు గౌతమ్.ఏంటో రిషి..అస్సలు అర్థం కావడం లేదు అనుకుంటాడు గౌతమ్.
వసు కోసం రిషి తపన :
రాత్రికి అలా హాల్లో పడుకున్నావేంటని వసు అని అడుగుతుంది జగతి. చదువుతూ అలాగే నిద్రపోయా అన్న వసుతో..నీకు చదువుపై ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనుకున్నా అంటుంది జగతి. ఈ వారంలో మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మెయిల్స్ అవి చెక్ చేయాలి..మీ ఎండీ గారికి చెప్పు అన్న జగతితో..అదేంటి మేడం మన ఎండీగారు అనండి అంటుంది వసు.అలాగే కొద్దిగా మెషీన్ ఎడ్యుకేషన్ కు సంబందించిన వర్క్ పెండింగ్ లో ఉంది అని వసు అనడంతో నువ్వు తలుచుకుంటే ఎంతసేపులే అని అంటుంది జగతి. ఈలోపు కాలేజీలో దిగిన రిషి..ఇంట్లో గీసిన వసు బొమ్మని, వసుని జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆమె ఇంకా రాలేదా అనుకుని పుష్ప దగ్గరకు వెళ్లి అడుగుతాడు. లైబ్రరీకి వెళ్లిందని పుష్ప చెప్పడంతో అక్కడి నుంచి రిషి వెళ్లిపోతాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది…