Guppedentha manasu: వసుధారకి గౌతమ్ క్లోజ్ అవుతుంటే రిషికి వచ్చిన బాధ ఏంటి అంటే.??

Share

Guppedentha manasu: గుప్పెడంత మనసు సిరియాల్ ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఒకపక్క వసూను దూరం పెడుతున్న జగతి మేడం.. మరో పక్క వసుధారను లైన్లో పెట్టే పనిలో గౌతమ్…ఎక్కడ గౌతమ్,వసుకి దగ్గర అయిపోతాడేమోనన్నా టెన్షన్ లో రిషి… ఇలా ఎవరికీ వారు వారి పని చేసుకుంటూ పోతున్నారు. గత ఎపిసోడ్ లో అయితే వసుధారను హాస్టల్ కి పంపే పని ఎంతవరకు వచ్చిందో అని జగతి మేడంను రిషి అడగగా జగతి చిరాకుగా ప్రవర్తించడంతో పాటూ రిషికి కూడా అర్ధం అయ్యేటట్లు ఒక క్లారిటీ ఇస్తుంది. ఇక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరుగుతుందంటే జగతి మేడం ప్రవర్తన సరిగా లేదని వసుధార మహేంద్రతో చెబుతుంది.అవసరం లేకపోయినా చికాకు పడుతున్నారని అంటుంది వసుధార.

Trust: జీవితం లో ఇలాంటి వారిని  నమ్మడం వలన ఎప్పటికి మోసపోరు!!
మహేంద్ర ఫోన్ కట్ చేసిన జగతి… ఎందుకంటే?

ఇదే విషయాన్నీ ఆలోచిస్తూ మహేంద్ర జగతికి కాల్ చేసి ఎలా ఉన్నావ్ అని అడగడంతో మళ్లీ చికాకు పడుతుంది. జగతి ఒకసారి రెస్టారెంట్ దగ్గర కలుద్దామా అని అడగడంతో లేదు మహీంద్రా నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి కట్ చేస్తుంది. ఏంటి మేడం మాట్లాడుతుంటూనే కట్ చేసేసిందని వసుతో చెబుతాడు మహేంద్ర. సరే నువ్వు డ్యూటీకి వెళ్లు అని వసును పంపించేస్తాడు. జగతి డిస్ట్రబ్ వెనుక కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే రిషి రూమ్ లో బట్టలు సర్దుతుంటుంది ధరణి. అక్కడికి వచ్చిన రిషి ఏంటి వదినా ఎప్పుడూ ఏదోపని చేస్తూనే ఉంటారా అంటాడు నీకు ఏమైనా కావాలా అని అడిగితే వద్దు వదినా అంటాడు.సరేగాని గౌతమ్ ఎక్కడికి వెళ్లాడని అడిగితే ఏమో నాకు తెలియదు అంటుంది ధరణి.

Trust: జీవితం లో ఇలాంటి వారిని  నమ్మడం వలన ఎప్పటికి మోసపోరు!!
గౌతమ్ వేసిన బొమ్మను రిషి చూసేస్తాడా..?

ఈలోపు గౌతమ్ వేసిన బొమ్మ ఏమయి ఉంటుందా అని చూద్దామనుకుని మళ్ళీ మొత్తం పూర్తయ్యాక చూద్దాంలే అని వెళ్ళిపోతాడు.మళ్ళీ రెస్టారెంట్లో సీన్ ఓపెన్ అవుతుంది. రెస్టారెంట్లో వసుధారని చూసి ఏంజెల్ రెస్టారెంట్లో కనిస్తుంది అని అనుకుంటాడు. అక్కడకు వచ్చి ఒక అమ్మాయి ఆర్డర్ ప్లీజ్ అని అడగడంతో వెన్నెల వర్షం కప్ ప్లీజ్ అనేసి వెంటనే సారీ.. కాఫీ ప్లీజ్ అంటాడు.కానీ వసు మాత్రం తనని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటుంది. అది చూసి అక్కడే వెయిట్ చేస్తూ కాఫీలపై కాఫీలు తాగుతుంటాడు.ఇక చేసేది లేక వసుని పిలవడంతో సర్ ఎప్పుడొచ్చారని అడుగుతుంది వసుధార. ఈ కాఫీలన్నీ నేను తాగినవే నువ్వు వస్తావని చూస్తున్నా అంటాడు.ఇంతకీ నీ టేబుల్ ఎక్కడ అని అడిగి అక్కడ కూర్చుని ఒక కాఫీ తెప్పించుకుంటాడు.ఇంట్లో కూర్చున్న రిషి వసు జ్ఞాపకాలను తలుచుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రెస్టారెంట్లో వసు తెచ్చిన కాఫీతో సెల్ఫీ తీసుకుని తన స్టేటస్ లో పెడతాడు. ఇంకేముంది అది చూసిన మన ఈగో మాస్టర్ షాక్ అవుతాడు. గౌతమ్ రెస్టారెంట్లో ఉన్నట్టు తెలుసుకుంటాడు.

రాత్రిపూట రిషి కంగారుగా ఎక్కడికి వెళ్తున్నాడనే ఆలోచనలో పడిన దేవయాని :

మరోవైపు దేవయాని రూమ్ కి వెళ్లిన ధరణితో.. నీకు నాపై కోపం వస్తుందా అని అడుగుతుంది. నాకెందుకు కోపం అన్న ధరణితో..నాకు నీపై వస్తోంది.రిషి-వసుధార మధ్యలో జరిగేవి నాకు ఏమి చెప్పడం లేదంటుంది దేవయాని. అదేమీ లేదు అత్తయ్య..రిషి బయటకు వెళ్లాడని చెబుతుంది ధరణి. రిషి ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్లినట్టు అనే ఆలోచనలో పడుతుంది దేవయాని. గౌతమ్ నాకు చెప్పకుండా రెస్టారెంట్ కి వెళ్లాడనుకుంటూ వెంటనే కారేసుకుని బయలుదేరుతాడు. ఇక రెస్టారెంట్లో వసుధార బయలుదేరుతుంటే గౌతమ్ వచ్చి నీకోసం ఇప్పటి వరకూ వెయిట్ చేశా అంటాడు.

ఈగో మాస్టర్ ఎంట్రీ…షాక్ లో వసూ,గౌతమ్ :

ఇంటికే కదా వెళ్లేది..క్యాబ్ బుక్ చేస్తా అంటాడు.లేదు సార్ నేను ఆటోలో వెళతా అంటే నేను కూడా నీతో ఆటోలో వస్తా అంటూ ఆటో గొప్పతనం గురించి చెప్తాడు. వసుధారా నవ్వకపోయేటప్పటికీ… జోక్ చేశా నవ్వవా అంటే.. జోక్ అనుకులేదు సర్ అంటుంది. నేను వెళతా అని వసు అంటే నేను వస్తా అంటాడు గౌతమ్ ఈలోపు రిషి అక్కడికి వచ్చి నేనుకూడా వస్తా అంటాడు.అంతే అటు వసుధారకు, ఇటు గౌతమ్ కు ఫ్యూజులు ఎగిరిపోతాయి. వాళ్ళ మొహాలు చూస్తే రిషి ఏంటి ఆటోలో రావడం ఏంటి అని ఆశ్చర్యంలో ఉండిపోతారు.. మరి రేపటి ఎపిసోడ్ లో రిషి ఆటోలో ప్రయాణం చేస్తాడా? లేదా అనేది చూడాలి.


Share

Related posts

100 Crores: ఆసక్తిరేకెత్తిస్తున్న “100 కోట్లు” టీజర్ ను విడుదల చేసిన అనిల్ రావిపూడి..!!

bharani jella

సుకుమార్ సినిమాలో సరికొత్త పాత్రలో విజయ్ దేవరకొండ..!!

sekhar

Vastu Shastra: కుటుంబ సమస్యలు, వాస్తు దోషాలు, పిల్లల సమస్యలు వీటన్నిటి నుండి ఈ ఒక్క పని తో బయటపడండి!!

Kumar