గుర్తుందా శీతాకాలంపై కీలక అప్‌డేట్..?

Share

కన్నడ సినిమా లవ్ మాక్‌టైల్ (Love Mocktail)కి తెలుగులో గుర్తుందా శీతాకాలం అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. తమన్నా, సత్యదేవ్ హీరోహీరోయిన్లుగా ఈ సినిమా రెండు సంవత్సరాల క్రితమే షూటింగ్ మొదలు పెట్టింది. ప్రస్తుతానికి చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఇక రిలీజ్ కావడమే తరువాయి అన్న దశలో ఉంది. మొదటిగా ఈ సినిమాని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదల చేయాలనుకున్నారు. ఆ తర్వాత జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మళ్లీ పదిరోజుల తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆగస్టు 5న రిలీజ్ రిలీజ్ చేస్తామని తెలిపారు. అయితే అదే రోజున బింబిసార, సీతా రామం సినిమాలు విడుదల అవుతున్నాయని సినిమాని ఇప్పుడు కూడా విడుదల చేయడం మానుకుంది చిత్రబృందం. అయితే సినిమాను వాయిదా వేస్తున్నట్లు కూడా ప్రకటించక పోవడం గమనార్హం.

ఊరించడమే కానీ రిలీజ్ ఎప్పుడు?

గుర్తుందా శీతాకాలం సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నటించింది స్టార్ హీరో కాకపోయినా కన్నడలో ఆల్రెడీ వచ్చిన మూవీ కాబట్టి, కథ కూడా తెలుసు కాబట్టి దీనిపై అంచనాలు మంచిగానే ఉన్నాయి. కానీ సినిమా రిలీజ్ అప్పుడు… ఇప్పుడు అని మూవీ యూనిట్ ఊరిస్తోందే తప్ప రిలీజ్ మాత్రం చేయడం లేదు. దీంతో ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న వారిలో సహనం చచ్చిపోతోంది. మరికొద్ది రోజులు లేట్ చేస్తే ఈ సినిమా వచ్చినట్లు, పోయినట్లు కూడా ఎవరూ తెలుసుకోలేరేమో.

కీలక అప్‌డేట్..?

ఈ సినిమాలో హీరోగా చేసిన సత్యదేవ్ కూడా గుర్తుందా శీతాకాలం గురించి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టడం లేదు. ఇక తమన్నా కూడా ఈ సినిమాని ప్రచారం చేయడం లేదు. ఆ విధంగా ఈ సినిమా నుంచి అధికారిక అప్‌డేట్స్‌ రాక ఈ సినిమా ఒకటి తీశారనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఇప్పటికిప్పుడు ఒక కీలక అప్‌డేట్ ప్రకటించి.. ఈ సినిమా ప్రచారాన్ని జోరుగా చేయకపోతే దీనిపై అందరిలో ఆసక్తి తగ్గిపోయే ప్రమాదం ఉంది.


Share

Recent Posts

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

21 mins ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

22 mins ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

1 hour ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

2 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

3 hours ago

సినీ ఎంట్రీ విషయంలో తల్లి శ్రీదేవి అప్పటి రియాక్షన్ తెలియజేసిన జాన్వి కపూర్..!!

దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది. "ధడక్" అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి…

3 hours ago