IQ: ఐక్యు అనేది ఒక వ్యక్తి తెలివితేటలకు కొలమానం.. ఒక వ్యక్తి ఎంత తెలివైనవాడు తెలుసుకోవడానికి ఐక్యూ టెస్ట్ చేస్తే సరిపోతుంది.. ప్రపంచంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నప్పటికీ ఐక్యూ ఎక్కువగా ఉన్నవారు మాత్రం కొద్ది మంది మాత్రమే.. ఐక్యు ఎక్కువగా ఉన్నవారు కొన్ని అలవాట్లను కలిగి ఉంటారు.. వారి అలవాట్లు ఏంటో తెలుసుకొని పాటిస్తే సరి..!
ఐ క్యు ఎక్కువగా ఉండేవాళ్ళు పుస్తకాలలో మునిగిపోతారు. ఓ విధంగా చెప్పాలంటే వీళ్ళని పుస్తకాల పురుగులు అని కూడా అంటారు. ఇంకా వీరి ఇళ్లలో ఏకంగా చిన్న లైబ్రరీనే దొరుకుతుంది.. ఎక్కువగా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది ప్రతి దానిని ప్రశ్నించడం.. అర్థం కాకపోయినా ఏ విషయాన్ని అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.. ఎదుటివారిని ప్రశ్నలు అడగడానికి అస్సలు వెనుకడరు..
వీళ్లు చాలా తెలివిగా నడుచుకుంటారు. బ్యాలెన్స్ థింకింగ్ తో ఉంటారు.. ఒక్క చిన్న విషయం మాట్లాడినా కూడా అన్ని ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు ముందుగానే లాభనష్టాలను బేరుజు వేసుకుంటారు తాము తీసుకునే నిర్ణయం సరైనదా కాదా అని ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు ఇంకా కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు.. మెదడుని చురుకుగా మార్చే పజిల్ గేమ్స్ ను వీళ్ళు ఎక్కువగా ఆడుతూ ఉంటారు.. ఏదైనా కొత్త విషయం నేర్చుకున్న కూడా అందులో ప్రావీణ్యం సంపాదించడానికి ఎక్కువగా సాధన చేస్తూ ఉంటారు..