ఈ చిట్కాలు పాటిస్తే తీరైన కను బొమ్మలు మీ సొంతం!!

మొహానికి అందాన్ని ఇవ్వడం లో కనుబొమ్మల పాత్ర చాలముఖ్యమైనది.కానీ చాలామందికి కను బొమ్మలు పల్చకగా ఉండీ,లేనట్టుగా ఉంటాయి. కనుబొమ్మలు ఒత్తుగా ఉన్నవారు వయ్యస్సులో చిన్నవారిగా కనిపిస్తారు.

ఈ చిట్కాలు పాటిస్తే తీరైన కను బొమ్మలు మీ సొంతం!!

అయితే, అనేక కారణాల వల్ల చాలామందికి కను బొమ్మలు అంత ఒత్తుగా, దృఢంగా పెరగవు. అలాంటి వారు ఆందోళన  పడకుండా కొన్ని ఇంటిలో చేసుకునే  చిట్కాలు పాటిస్తూ తీరైన కను బొమ్మలను పొందవచ్చ.

ముందుగా  ఒక చిన్న బౌల్‌లో  పావు టీ స్పూన్ చొప్పున  ఆముదం,  వేజలెన్ పెట్రోలియం జల్లి తీసుకుని  రెండింటి ని బాగా కలపాలి .ఈ మిశ్రమాన్ని  ప్రతిరోజూ పడుకునే ముందు ఐబ్రోస్‌పై రాసి 3 నిమిషాల పాటు మసాజ్ చేయాలి.రోజూ ఇలా చేయడం మొదలు పెట్టిన  2 వారాల నుంచే మీ  ఐబ్రోస్‌ ఒత్తు గా పెరగడం గమనించవచ్చు. పెట్రోలియం,ఆముదం లోని మాయిశ్చరైజర్ గుణాలు కనుబొమ్మల్ని మాయశ్చరైజ్ చేసి ఒత్తు గా పెరిగే లా చేస్తాయి.ఈ మిశ్రమం  కనురెప్పలకు కూడా వాడుకోవచ్చు .

బాదం నూనె లో విటమిన్స్ ఏ, బి, ఇ లు  జుట్టు పెరుగుదల కు బాగా ఉపయోగ పడతాయి. ఈ ఆయిల్‌ని ఐబ్రోస్ పై మసాజ్ చేయడం వల్ల బాగా పెరుగుతాయి. రాత్రి పడుకునే ముందు కనుబొమ్మలకు కొబ్బరి నూనె రాస్తూ ఉండాలి. ప్రతి రోజు  ఇలా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి.
ఉల్లిపాయ రసం లో కూడా కనుబొమ్మలు ఒత్తుగా పెంచగల శక్తి ఉంది.

ఉల్లి రసం లో సల్ఫర్ కారణం గా  హెయిర్ ఫోలిక్స్ బలపడి కొల్లాజెన్ కణజాల ఉత్పత్తి పెరుగుతుంది . ఈ కారణం తో  ఐబ్రోస్ బాగా పెరుగుతాయి. పడుకునేముందుపాలల్లో దూదిని ముంచి కనుబొమ్మలపై రాస్తూ ఉన్నాకూడా చక్కని మార్పు ఉంటుంది. కను బొమ్మలు తేమగా ఉంటే పెరుగుదల ఉంటుంది . కాబట్టి కనుబొమ్మలను తేమగా ఉంచుకునేందుకు రోజుకి రెండు సార్లు  పెట్రోలియం జెల్లీ ని రాసి మర్దన చేయడం వలన అందమైన కను బొమ్మలు మీ సొంతమవుతాయి.