Ice Cubes: ఐస్ క్యూబ్స్ సౌందర్య పోషణకు చాలా బాగా పనిచేస్తాయి. చాలా మంది తమ చర్మం అందంగా,ఆరోగ్యంగా కనిపించేందుకు రకరకాల బ్యూటీ ప్రొడెక్ట్స్ వాడుతుంటారు. ఈ సారి అలా కాకుండా.. కేవలం ఐస్ క్యూబ్స్‌తో చర్మానికి చికిత్స చేసుకునేలా ట్రై చేయండి. ఐస్‌తో చాలా చర్మ సమస్య లు తగ్గుతాయి. వాటి గురించి తెలుసుకుందాం..
అస్తమానము దూర ప్రయాణాలు చేసే వారికి ముఖం లో అలసట కనిపిస్తూ ఉంటుంది.అలా కాకుండా ముఖం తాజాగా కనిపించాలి అంటే ఐస్ క్యూబ్స్ తీసుకుని వాటితో తో ముఖంపై నెమ్మదిగా మసాజ్ చేస్తుంటే అలసట మొహం లో అలసట మాయం అవుతుంది.
ముఖంపై మొటిమలు వచ్చినప్పుడు నొప్పి తో ఇబ్బంది గా అనిపిస్తుంటుంది. అలాంటప్పుడు ఒక మెత్తని క్లోత్ తీసుకుని అందులో ఐస్ ముక్కలు పెట్టి నొప్పి ఉన్న భాగంలో నెమ్మదిగా అద్దుతూ ఉండాలి. ఇలా చేయడం వలన మొటిమలు తగ్గిపోతాయి. ఐస్ క్యూబ్స్ తీసుకుని ఫేషియల్ చేసినట్టు గా మొహం పైన రుద్దితే మొహం ఫ్రెష్ గా కనిపిస్తుంది.చర్మం సాగినట్లు ఉన్న చోట ఐస్ క్యూబ్స్ పెట్టి సున్నితంగా మర్దన చేసుకోవడం వల్ల శరీరంలో చర్మం బిగుతుగా ఉంటుంది. కొందరిలో కళ్ళు ఉబ్బి ముడతలు కనిపిస్తుంటాయి. ఆ ప్రాంతంలో ఐస్ క్యూబ్ తో కాపడం పెడితే రక్తప్రసరణ సక్రమంగా జరిగి చర్మం నిగారింపుతో ఉంటుంది.ఐబ్రోస్ చేయించుకున్నప్పుడు, ఆ ప్రాంతంలో నొప్పి వస్తుంది. అలాంటప్పుడు ఐబ్రోస్ చేయించుకునే ముందు కనుబొమ్మలు ఐస్ క్యూబ్ తో రుద్దితే నొప్పి ఉండదు.
ఐస్ క్యూబ్స్ ఫేషియల్ హెయిర్ రిమూవర్ గా కూడా పనిచేస్తాయి. తరుచూ ఐస్ క్యూబ్స్ తో ముఖం మీద మసాజ్ చేసుకుంటూ ఉంటే,ముఖం మీద ఉన్న హెయిర్ రూట్స్ శాశ్వతంగా మూసుకుపోతాయి. ఐస్ క్యూబ్స్ తో ముఖం మీద మసాజ్ చేసుకున్న తర్వాత నేచురల్ ఫేస్ స్క్రబ్బర్ ను వాడటం వలన ఫేషియల్ హెయిర్ శాశ్వతంగా తొలగించబడుతుంది . గమనిక :ఐస్ క్యూబ్స్ తో ఐదు నిమిషాల లోపు మాత్రమే మసాజ్ చేసుకోవాలి.మీకు ఇంకా ఏదైనా సమస్య గా అనిపిస్తే టైం ఇంకా తగ్గించుకోండి.