Hair: ఈ లోకంలో ఏదీ కూడా ఊరికే పోవడం లేదు. ఏ థింగ్ అయినా సరే ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది. ఇన్నాళ్లూ ఆడవాళ్ల చిక్కు వెంట్రుకలే తీసుకునే వారు. కానీ ఇప్పుడు మగవాళ్లు హేర్ కట్ చేయించుకునే సమయంలో రాలిన వెంట్రుకలను కూడా తీసుకుంటున్నారు. ఇలా ఓ ఆస్ట్రేలియా కంపెనీ మగాళ్ల మీసాలతో ఓ సూట్ ను తయారు చేసింది. వినేందుకు వింతగా ఉన్నా కానీ ఇది నిజం. ఇక ఆ సూట్ విశేషాలను గురించి ఒక్కసారి లుక్కేస్తే.. .
ఆస్ట్రేలియన్ కంపెనీ చొరవతో…
ఆస్ట్రేలియన్ మెన్స్ వేర్ కంపెనీ పాలిటిక్స్ మెన్స్ వేర్ విజువల్ ఆర్టిస్ట్ పమేలా క్లీమాన్ పాసీ సహకారంతో ఈ ప్రత్యేక సూట్ ను తయారు చేసింది. ఇక ఈ సూట్ ను మువంబర్ అనే స్పెషల్ ప్రోగ్రాంలో ప్రవేశపెట్టింది. ఇది చూసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురుషులు తమ మీసాలను పెంచే పనిలో పడ్డారు. కానీ ఈ ప్రత్యేక సూట్ ను ఎందుకు తయారు చేశామనే విషయాన్ని కంపెనీ ఇదే కార్యక్రమంలో వెల్లడించింది.
పురుషుల వ్యాధుల అవగాహన కోసమే..
ఈ ప్రత్యేక సూట్ ను తయారు చేసేందుకు కారణం ఉందని కంపెనీ చెప్పుకొచ్చింది. పురుషులకు కలిగే వ్యాధులపై అవగాహన కల్పించడం కోసమే ఇలా సెపెరేట్ సూట్ ను డిజైన్ చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు. కేవలం అవగాహన కోసమే ఇలా తయారు చేశామని ఎవర్నీ కించ పర్చేందుకు కాదని పేర్కొంది. ఈ స్పెషల్ సూట్ కు పాలిటిక్స్ మెన్స్ వేర్ కంపెనీ మో హెయిర్ సూట్ అని నామకరణం కూడా చేసింది. ఈ సూట్ ను తయారు చేయడం కోసం మెల్ బోర్న్ కు చెందిన విజువల్ ఆర్టిస్ట్ పమేలా క్లీమాన్ పాసీ చాలా కష్టపడ్డారు. వివిధ సెలూన్లు తిరుగుతూ అతడు జుట్టును సేకరించాడు.