NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు Vs జ‌గ‌న్‌… అమ‌రావ‌తి గ‌డ్డ‌పై రెండు ఈక్వేష‌న్లు… ఎవ‌రిది పై చేయో…!

ఏపీలో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో కీల‌క‌మైన ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌లు సీట్ల‌లో పోరు మామూలుగా లేదు. టీడీపీ – జ‌న‌సేన పొత్తు నేప‌థ్యంలో ఈ కూట‌మి వ‌ర్సెస్ వైసీపీ మ‌ధ్య పోరు హోరాహోరీగా ఉండ‌నుంది. వైసీపీ వ్యూహాల‌ను గ‌మ‌నిస్తే మామూలుగా లేవు. అస‌లే అమ‌రావ‌తి మార్పు ప్ర‌భావంతో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో వైసీపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు గ‌ట్టిగానే వీస్తాయంటున్నారు. ఈ వ్య‌తిరేక ప‌వ‌నాలు త‌ట్టుకుని జ‌గ‌న్ ఇక్క‌డ పార్టీని నిల‌బెట్టేందుకు ర‌క‌ర‌కాల ఈక్వేష‌న్ల‌తో వెళుతుంటే.. చంద్ర‌బాబు మాత్రం పాత ఈక్వేష‌న్ల‌తోనే ముందుకు వెళుతున్నారు.

ఉమ్మ‌డి జిల్లా మొత్తం మీద మూడు పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఈ మూడు సీట్ల‌లో బాప‌ట్ల ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ సీటు. మిగిలిన జ‌న‌ర‌ల్ స్థానాలు అయిన గుంటూరు, న‌ర‌సారావుపేట‌లో గ‌త ఎన్నిక‌ల్లో వేసిన ఈక్వేష‌న్లు జ‌గ‌న్ పూర్తిగా మార్చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గుంటూరు పార్ల‌మెంటును రెడ్డి వ‌ర్గానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి ఇవ్వ‌గా, న‌ర‌సారావుపేట నుంచి క‌మ్మ వ‌ర్గానికి చెందిన లావు శ్రీకృష్ణ దేవ‌రాయుల‌కు ఇచ్చారు. మోదుగుల ఓడిపోగా లావు విజ‌యం సాధించారు.

ఈ సారి ఎన్నిక‌ల‌కు రెండు సీట్ల‌లో జ‌గ‌న్ ఈక్వేష‌న్లు మ‌ళ్లీ మార్చేశారు. గుంటూరు నుంచి కాపు వ‌ర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంక‌ట‌ర‌మ‌ణ‌కు సీటు ఇస్తే… న‌ర‌సారావుపేట నుంచి బీసీ వ‌ర్గానికి చెందిన మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్‌కు సీటు ఇచ్చారు. చంద్ర‌బాబు 2014, 2019 రెండు ఎన్నిక‌ల్లోనూ రెండు సీట్లు క‌మ్మ వ‌ర్గానికే చెందిన గ‌ల్లా జ‌య‌దేవ్‌, రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు ఇచ్చారు. 14 ఎన్నిక‌ల్లో ఇద్ద‌రూ గెలిచారు. 19 ఎన్నిక‌ల్లో జ‌య‌దేవ్ మ‌రోసారి విజ‌యం సాధించ‌గా… రాయ‌పాటి లావు చేతిలో ఓడిపోయారు.

ఈ సారి కూడా చంద్ర‌బాబు రెండు సీట్ల‌ను క‌మ్మ నేత‌ల‌కే క‌ట్ట‌బెట్టేస్తున్నారు. గుంటూరు సీటును ఎన్నారై పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ లేదా భాష్యం రామ‌కృష్ణ‌కు ఇస్తారంటున్నారు. న‌ర‌సారావుపేట సీటును సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు టీడీపీలోకి వ‌స్తోన్న నేప‌థ్యంలో ఆయ‌న‌కే ఇస్తారంటున్నారు. అయితే గుంటూరులో కాపు వ‌ర్గం ఓట్ల‌ను జ‌న‌సేన + టీడీపీ కూట‌మికి వ్య‌తిరేకంగా ఏకం చేసేందుకు.. న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు సీటు బీసీల‌కు ఇవ్వడంతో ఆ ప్ర‌భావం పార్ల‌మెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌డుతుంద‌న్న అంచ‌నాలు, ఈక్వేష‌న్ల‌తోనే జ‌గ‌న్ ఈ మార్పులు చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఈ ఈక్వేషన్ల‌లో పై చేయి జ‌గ‌న్‌దా ? చంద్ర‌బాబుదా ? అన్న‌ది ఎన్నిక‌ల ఫ‌లితాలే చెప్ప‌నున్నాయి.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!