NewsOrbit
న్యూస్

Hanuman: హనుమంతుడు హంపీలో పుట్టాడు! కర్నాటక మంత్రి వాదన !సర్వే చేయించి నిరూపిస్తామని ప్రకటన?

Hanuman: హనుమంతుడు హంపీలో జన్మించాడని కర్నాటక రుజువు చేస్తామ౦టుండటంతో ఆంజనేయుడి జన్మస్థలంపై మరోసారి వివాదం మొదలైంది.హనుమాన్ తమవాడంటే తమవాడని కర్నాటక, ఏపీ రాష్ట్రాలు ప్రకటించుకుంటున్నాయి.దీంతో ఆంజనేయుడి జన్మస్థలంపై మరోసారి వివాదం మొదలైంది. తాజాగా ఆంజనేయుడు ఆంధ్రావాడేనన్న టీటీడీ ప్రకటనను కర్నాటక తోసిపుచ్చింది.

Hanuman was born in Hampi says Karnataka Minister
Hanuman was born in Hampi says Karnataka Minister

ఈ నెల ఇరవై వ తేదీన శ్రీరామనవమి రోజు టీటీడీ ఆంజనేయ స్వామి తిరుమల కొండల్లోని అంజనాద్రి పర్వతంలో జన్మించాడంటూ విస్పష్ట ప్రకటన చేసింది. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమాన్ ఉపాసకుడు చిదంబరశాస్త్రి సమర్పించిన సాక్ష్యాధారాలతో టీటీడీ ఏకీభవించి ఈమేరకు అధికారిక ప్రకటన చేసింది.చిదంబరశాస్త్రి కూడా ఆంజనేయస్వామి జన్మస్థలం తిరుమలే అనడానికి తగిన పురాణ ఇతిహాసాలను సాక్షాధారాలుగా చూపారు.హనుమాన్ తల్లి అంజనాదేవి పన్నెండు సంవత్సరాలు తిరుమల కొండల్లో ఘోరతపస్సు చేసి అంజనాద్రి పర్వతం లో ఆంజనేయుడి కి జన్మనిచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇది జరిగి మూడు రోజులు అయ్యాక కర్నాటక ప్రభుత్వం టీటీడీ ప్రకటనను ఖండించింది .కర్నాటక పంచాయితీరాజ్ శాఖ మంత్రే స్వయంగా రంగంలోకి దిగారు

కర్నాటక వాదన ఏమిటంటే!

హనుమ హంపీలోనే జన్మించాడని చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించి త్వరలో ఏఎస్‌ఐ ద్వారా సర్వే చేయిస్తామన్నారు కర్నాటక పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఈశ్వరప్ప. ఆధారాలతో సహా హనుమ తమ ప్రాంతంలో జన్మించాడని రుజువు చేస్తామంటున్నారు.కర్నాటకలోని హంపీకి సమీపంలో ఆంజనేయనాద్రి కొండపై హనుమ జన్మించాడని కర్నాటక ప్రభుత్వం చెప్తోంది. రామాయణం గ్రంథంలో ఇది స్పష్టంగా లిఖించబడి ఉందంటున్నారు. రామలక్ష్మణులు ఆంజనేయనాద్రిపైనే హనుమను కలిశారని పురాణాల్లో ఉందంటున్నారు. హనుమంతుడు ఆంధ్రాలో జన్మించాడని ఏ ఆధారాలతో టీటీడీ ప్రకటించిందో తనకు తెలీదన్నారు కర్నాటక మంత్రి శ్రీనివాస పూజరీ.

రామాయణంలో ఏముందంటే ?

రామాయణం గ్రంథం ఆధారంగా ఆంజనేయనాద్రి హనుమ జన్మస్థలం అని స్పష్టమవుతుందన్నారు. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో వాగ్వాదం ఏమి లేదని…ఓ సర్వే చేయించి తమ ప్రాంతం వాడని నిరూపిస్తామంటున్నారు. మరోవైపు వాల్మికి రామయణంలో కర్నాటకలోని కుడ్లీ బిచ్‌ తీర ప్రాంతం గోకర్నలో ఆంజనేయుడు జన్మించాడని ఉందంటున్నారు రామచంద్రపుర మఠాధిపతి రాఘవేశ్వర భారతీ. వాల్మికీ రామాయణం ఆధారంగా హనుమ గోకర్ణలో పుట్టాడని, ఆంజనేయనాద్రి, కిష్కింద కర్మ భూమిగా నమ్ముతున్నామని అన్నారు.ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?