NewsOrbit
న్యూస్

మెగా అభిమానులకు హ్యాపీ న్యూస్ …చిరు కు కరోనా నెగిటివ్!అసలు పాజిటివ్ రిపోర్ట్ ఎందుకొచ్చింది?

తెలుగు ప్రేక్షకులు ఆనందించే వార్త ఇది.తమ తెరవేలుపుకి కరోనా అని తెలిసి బాధపడిన గుండెలు ఎన్నో..ఎన్నెన్నో!వాళ్లంతా ఇప్పుడు సంబరాలు చేసుకోవచ్చు.మెగాస్టార్ చిరంజీవికి కరోనా నెగెటివ్ అని తేలింది.

అదేంటి నాలుగు రోజుల క్రితం పాజిటివ్ వచ్చి వెంటనే నెగిటివ్ ఎలా అయిందని ఆశ్చర్యపోతున్నారా? అదే ఇక్కడి ప్రధాన వార్తాంశం.ఆయనకు కరోనా పాజిటివ్ అని తేల్చిన ఆర్టీపీసీఆర్ కిట్ లోపభూయిష్టమైంది కావడంతో తప్పుడు నివేదిక వచ్చింది. ఆదివారం పాజిటివ్ రిపోర్టు రాగానే వెంటనే మెడికేషన్ ప్రారంభించిన చిరంజీవికి రెండు రోజులైనా ఎలాంటి కోవిడు లక్షణాలు కనిపించలేదు.దీంతో అసలు తనకు కరోనా సోకిందా లేదా అని అనుమాన పడి ఆయన కరోనాను ధ్రువీకరించే మూడు రకాల పరీక్షలు చేయించుకోగా అన్నీ నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి.అసలేం జరిగిందో చిరంజీవిగారి మాటల్లోనే …”కరోనా రిపోర్టు నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆడేసుకుంది.

ఆదివారం ఈ రిపోర్టు రాగానే బేసిక్ మెడికేషన్ ప్రారంభించాను.రెండు రోజులైనా ఎక్కడా ఎలాంటి కరొినా లక్షణాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి అపోలో ఆస్పత్రి డాక్టర్లను అప్రోచ్ అయ్యాను.వారు సీటీ స్కాన్ చేసి చెస్టులో ఎలాంటి కరొినా ట్రేసెస్ లేవని చెప్పారు.అక్కడ నెగిటివ్ రిపోర్టు వచ్చాక మరొకసారి అనుమానాన్ని నివృత్తి చేసుకుందామని టెనెటు ల్యాబులో మూడు రకాల కిట్లతో పరీక్షలు చేయించుకున్నాను.అన్ని పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.చివరగా మొదట నాకు పాజిటివ్ అని నివేదిక ఇచ్చిన చోట మళ్లీ ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకున్నాను.అక్కడ నెగిటివ్ రిపోర్టు వచ్చింది.చివరగా వీటన్నిటినీ చూసిన వైద్యులు మొదట టెస్టు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ కిట్టు లోపభూయిష్టమైంది కావడంతో తప్పుడు రిపోర్టు వచ్చిందని తేల్చారు.

ఈ సమయంలో నా పట్ల అభిమానం,నా అనారోగ్యం పట్ల ఆందోళన చూపి నేను కోలుకోవాలని పూజలు కూడా చేసిన వారందరికీ కృతజ్ఞతలు” అని ట్వీట్ చేశారు.ఇది సంతోషకరమైన వార్తే కావొచ్చుగానీ ఒక మెగాస్టార్ కి నిర్వహించిన పరీక్ష నివేదికే తప్పుగా వస్తే….ఎంత మంది సామాన్యులు ఇలాంటి తప్పుడు రిపోర్టులు కారణంగా ఇబ్బందులు పడి ఉంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశం. వీఐపీలు టెస్ట్లు చేయించుకునే కాస్ట్లీల్యాబుల్లో కూడా ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని చిరంజీవి ఉదంతం చాటిచెప్పింది.మరి సామాన్యుడు వెళ్లే నాసిరకం ల్యాబుల పరిస్థితి ఏమిటన్నది ఒక్కసారి ఆలోచించుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది.మెగాస్టార్ చిరంజీవి తప్పుడు పాజిటివ్ నివేదిక వ్యవహారాన్ని ప్రభుత్వాలు కూడా సీరియస్గా పట్టించుకోవాల్సిన అవసరముందని ఆయన అభిమానులు అంటున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju