NewsOrbit
న్యూస్

Corona Virus: ప్రపంచమంతా సంబరపడే వార్త ఇది!అదేమిటంటే??

Corona Virus: కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచం మీద దండయాత్ర చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తుంది. రోజుకి లక్షలలో కేసులతో ప్రభుత్వాలకు దిక్కుతోచని విధంగా హడలెత్తిస్తోంది. గత ఏడాది కరోనా విజృంభణ సమయంలో అందరూ వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. వ్యాక్సిన్ రానే వచ్చింది.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగానే సాగుతుంది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఆర్ధిక చేయూతనిస్తున్న కేంద్రం కొత్త వ్యాక్సిన్లకు అనుమతినిచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.అయితే వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా బారిన పడుతుండడంతో ఇప్పుడు సెకండ్ వేవ్ లో కూడా అసలు వైరస్ ను చంపే మందే లేదా అని మళ్ళీ ఎదురుచూపులే కనిపిస్తున్నాయి.

Happy News for whole world
Happy News for whole world

Corona Virus: ఆహా! ఏమి హ్యాపీ న్యూస్!!

ఇలాంటి సమయంలో అమెరికాలోని జార్జియా స్టేట్​యూనివర్శిటీ పరిశోధకులు ఓ శుభవార్త చెప్పారు. అదేమంటే కరోనాను చంపే టాబ్లెట్ తయారుచేస్తున్నామని.. ఇది ఒక్కరోజులోనే వైరస్ ను చంపేస్తుందని ప్రకటించారు. వీళ్ళు తయారుచేసిన మోల్నుపిరావిర్ (Molnupiravir) అనే యాంటీ వైరల్ టాబ్లెట్ కరోనా సోకిన దేహానికి ఇస్తే అది ఒక్కరోజులోనే దేహంలోని వైరస్ ను చంపేస్తుందట. ఇప్పటి వరకు కరోనాను ఎదుర్కొనే టాబ్లెట్ లేకపోగా ఇదే మొట్టమొదటి టాబ్లెట్.

Happy News for whole world
Happy News for whole world

ఈ టాబ్లెట్ ప్రత్యేకత ఏమిటంటే?

నిజానికి దీన్ని కరోనా కోసం తయారుచేయలేదు. మెర్స్, సార్స్ లాంటి వేరే ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లను చంపేందుకు తయారుచేశారు. ఐతే… ఇది కరోనాతోపాటూ ఇంకా శ్వాస సంబంధిత సమస్యలు కలిగించే ఆర్ఎన్ఏ వైరస్‌లను బాగా చంపుతోందని పరిశోధనల్లో తేలిందట. ఇప్పటికే ఫెర్రెట్ అనే జంతువుల మీద ప్రయోగాలు జరపగా ఇది సక్సెస్ అయిందట. ఫెర్రెట్లలోకి వైరస్ పంపి ఈ టాబ్లెట్ ను ఇవ్వగా 24 గంటలలో వైరస్ నాశనం చేయడంతో పాటు ఆ ఫెర్రెట్ నుండి వైరస్ గాల్లోకి వ్యాప్తి కూడా చేయలేకపోతుందట. ఈ పరిశోధన వివరాల్ని నేచర్ మైక్రోబయాలజీ పేపర్‌లో ఏప్రిల్ 16న ప్రచురించారు.

రెమ్‌డెసివిర్ కన్నా ఎఫెక్టివ్!

నిజానికి ఈ టాబ్లెట్ తరహాలోనే ప్రస్తుతం రెమ్‌డెసివిర్ పనిచేస్తోంది. కాకపోతే రెమ్‌డెసివిర్‌ని కరోనా సోకిన తర్వాత అది ముదరకముందే ఇవ్వాలి. ముదిరిన తర్వాత ఇస్తే ప్రయోజనం కనిపించట్లేదు. కానీ మోల్నిపిరావిర్ టాబ్లెట్ మాత్రం వైరస్ ముదిరిన తర్వాత కూడా కేవలం ఒక్కరోజులోనే వైరస్ ను చంపేస్తుందట. అయితే ప్రస్తుతం ఈ ప్రయోగాలు ఇంకా చివరి దశలో ఉండగా త్వరలోనే ఆ రిపోర్టులను డబుల్యుహెచ్ఓకి పంపించాల్సి ఉంటుంది. అక్కడ ఆమోదముద్ర పడితే ఈ టాబ్లెట్ అందుబాటులోకి రానుంది. మరి దీనికి ఎంతసమయం పడుతుందో చూడాల్సి ఉంది.

 

author avatar
Yandamuri

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N