టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య తండ్రయ్యాడు. తన పార్ట్నర్ నటాసా స్టాంకోవిక్ ఈరోజు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వార్తను స్వయంగా హార్దిక్ తెలియజేసాడు. బాబు చేతిని పట్టుకున్న ఫోటోను హార్దిక్ పోస్ట్ చేసాడు. మగబిడ్డ జన్మించాడు అని హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసాడు.
ఈ నేపథ్యంలో హార్దిక్ కు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఇప్పటికే క్రిస్ లిన్, కేఎల్ రాహుల్, సానియా మీర్జా మొదలగు వారు హార్దిక్ కు అభినందనలు తెలిపారు. హార్దిక్, నటాసా స్టాంకోవిక్ గత కొంత కాలం నుండి రిలేషన్ లో ఉన్న విషయం తెల్సిందే. ఈ ఏడాది ఆరంభంలో తన రిలేషన్ ను బహిర్గతం చేసాడు హార్దిక్. ఇక మేలో నటాసా స్టాంకోవిక్ గర్భవతి అని తెలిపిన విషయం తెల్సిందే.