ముంబై, జనవరి 19: కాఫీ విత్ కరణ్ టివి షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టు నుండి సస్పెన్షన్కు గురైన టీం ఇండియా ఆల్ రౌండర్ హార్ధిక పాండ్యా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో ఎయిర్ పోర్టుకు వచ్చిన ఆల్రౌండర్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
భారత క్రికెట్ కంట్రోలు బోర్డు తీసుకునే నిర్ణయం కోసం పాండ్యాతోపాటుగా అతని తండ్రి హిమాన్షు ఎదురుచూస్తున్నారు.
టివి సోలో పాల్గొని జట్టుకు దూరమైన కెఎల్ రాహుల్, పాండ్యాలు గ్రౌండ్లో తిరిగి ఎప్పుడు అడుగుపెడతారో తెలియని పరిస్థితి నెలకొనివుంది.
తన వ్యాఖ్యల కారణంగా జిల్లేట్ సంస్ధతో చేసుకున్న వ్యాపార ఒప్పందాన్ని పోగొట్టుకోవ డమే కాక అతను ముంబై ఖర్ జింఖానాలో గౌరవ సభ్యత్వాన్నికూడా కోల్పోయాడు.
previous post
next post