HariHaraVeeraMallu: పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు బీభత్సంగా సంబరాలు చేస్తున్నారు. అనేక రికార్డులు కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రికార్డులు చేయడంలో చాలా దిట్ట అని అందరికీ తెలుసు. ఏదైనా అనుకున్నారు అంటే.. ఆ టార్గెట్ ఫిక్స్ అయ్యి.. పవన్ పేరిట సరికొత్త రికార్డులు క్రియేట్ చేసి దాని అంతు చూస్తారు. ఈ రీతిగానే భీమ్లా నాయక్ పవన్ ఫస్ట్ లుక్ వీడియో వచ్చిన టైంలో 24 గంటల్లో సంచలన రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో “భీమ్లా నాయక్” ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. భీమ్లా నాయక్ టైటిల్ పేరిట ఉన్న ఈ సాంగ్ నీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఇక ఇదే టైములో డైరెక్టర్ కృష్ణ హరిహర వీరమల్ల సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేసారు. పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. “హరిహర వీరమల్లు “విడుదల తేది ప్రకటించారు.
“ఎల్లప్పుడూ సమాజం గురించి ఆలోచించేవారు. నిజమైన హీరో మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం గౌరవంగా ఉంది” అంటూ క్రిష్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో “హరిహర వీరమల్లు” సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. 2022 ఏప్రిల్ 29న ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు పవన్ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. జనవరి 12న “భీమ్లా నాయక్” రిలీజ్ కానుందన్న విషయం తెలిసిందే. 2022లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇక ఇదే టైంలో ఈరోజు సాయంత్రం హరీష్ శంకర్ అప్డేట్ కూడా రానున్న క్రమంలో ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. పవన్ పుట్టిన రోజు నేపథ్యంలో.. ఆయన సినిమాకి సంబంధించి వస్తున్న అప్డేట్ లు.. అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి.