Harihara veeramallu : హరిహర వీరమల్లు సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రీ ఎంట్రీ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6 ప్రాజెక్ట్స్‌ని కమిటయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్ కంప్లీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఒక వైపు ఈ సినిమాకి డబ్బింగ్ చెబుతూనే మరొకవైపు రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ ప్రాంతంలో రెండు సినిమాల షూటింగ్స్ కోసం ప్రత్యేకంగా సెట్స్ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పిడివి ప్రసాద్ సమర్పణలో మలయాళ హిట్ సినిమా తెలుగు రీమేక్ చేస్తున్నాడు.
రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. కాగా హరిహర వీరమల్లు సినిమా కూడా భారీ సెట్స్ వేసి తెరకెక్కిస్తున్నాడు. 17వ శతాబ్దం నాటి పీరియాడికల్ సినిమా కావడంతో ఆ కాలాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించేందుకు క్రిష్ భారీ ఖర్చు చేసి అద్భుతమైన సెట్స్ ని వేయించాడట. అందులో భాగంగా ప్రత్యేకంగా నిర్మించిన చార్మినార్ సెట్ లో తాజాగా షెడ్యూల్ మొదలైనట్టు సమాచారం.
Harihara veeramallu : వారం రోజులపాటు పవన్ కళ్యాణ్ మీద భారీ సన్నివేశాల చిత్రీకరణ..!
27వ తేదీ నుంచి వారం రోజులపాటు పవన్ కళ్యాణ్ మీద భారీ సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట. ఈ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి వచ్చిన ఫైట్ మాస్టర్స్ ఆధ్వర్యంలో వందల మంది పాల్గొనగా పైట్స్ ని తెరకెక్కించనున్నాడట దర్శకుడు క్రిష్. ఇక ఈ సినిమాని 2022 సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.