బిగ్ బాస్ 4 సీజన్ పూర్తయిపోయింది. దాని చాప్టర్ క్లోజ్. కానీ.. బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. టాప్ 5, టాప్ 4 కంటెస్టెంట్లుగా ఎలిమినేట్ అయిన హారిక, అరియానా గ్లోరీ.. ఇద్దరూ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈసందర్భంగా హారిక, అరియానా.. ఇద్దరూ బిగ్ బాస్ హౌస్ లో చోటు చేసుకున్న ఎన్నో సంఘటనలను రాహుల్ తో షేర్ చేసుకున్నారు.
అలాగే.. హారిక అయితే.. అభిజీత్ ను పొగడకుండా ఉండలేకపోయింది. అభిజీత్ లో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అభి.. జెంటిల్ మెన్, సూపర్ కూల్.. అంటూ తెగ పొగిడేస్తూ.. తన చేతులను హార్ట్ సింబల్ లో పెట్టి.. నేను అతడిని లవ్ చేస్తున్నాను.. అంటూ రాహుల్ ముందే చెప్పేసింది హారిక. అభిజీత్ ఫోటోను చూడగానే కాస్త భావోద్వేగానికి గురయి.. ఐ లవ్ హిమ్ సోమచ్.. ఐ లవ్ హిమ్ సోమచ్.. అంటూ టక్కున చెప్పేసింది హారిక. ఎంతైనా బిగ్ బాస్ విన్నర్ కదా. ఆమాత్రం ఉంటుందిలే.
వామ్మో.. ఈమె ఎవ్వారం చూస్తుంటే ఏదో తేడా కొడుతోంది కదా. ఏమో చూద్దాం.. ఇంకా మున్ముందు ఏం జరుగుతుందో. బిగ్ బాస్ కంటెస్టెంట్లలో ఎటువంటి కపుల్స్ బయటపడతాయో ఇప్పుడు తెలుస్తుంది. వీళ్ల ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మీరు కూడా చూసేయండి..