షార్ట్ ఫిలిం వీడియోస్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన దేత్తడి హారిక సమాజంలో జరిగే అంశాలపై వీడియోలు తీసి యూత్ లో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అదే ఆమెను బిగ్ బాస్ హౌస్ వరకు తీసుకుని వచ్చింది. మొదటి రోజు నుండే తన మార్క్ చూపిస్తూ ఫైనల్స్ వరకు వెళ్ళింది. ఇక హారిక బిగ్బాస్ నుండి భారీ మొత్తం అందుకున్నట్లు సమాచారం బయటకు వచ్చింది.
అసలు హారిక ఫైనల్స్ వరకు వస్తుంది అని ఎవరికీ అంచనాలు లేవు. చలాకీతనంతో, తనదైన ధైర్యంతో అందరినీ ఎంటర్టైన్ చేసిన హారిక అద్భుతమైన ఆటతీరుతో లేడీ ఫైటర్ అనిపించుకుంది. అభి తో ఆమె నడిపిన లవ్ ట్రాక్ కూడా కొంత పాపులారిటీ తెచ్చిపెట్టింది అనే చెప్పాలి.ఇక చివర్లో మాత్రం హారిక ఆట పూర్తిగా మారిపోయింది. తన వ్యక్తిత్వాన్ని ఆఖరి రోజుల్లో పూర్తిగా మార్చుకుని ఆమె అఖిల్ తో చనువుగా వ్యవహరించి నష్టపోయింది.
ఇక హారిక రెమ్యునరేషన్ వివరాల్లోకి వస్తే రోజుకు ఆమె 40 వేల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది. బిగ్బాస్ ఇంటిలో చివరి రోజు వరకు కొనసాగిన ఆమె మొత్తం కలిపి 42 లక్షలు తీసుకుందట. ఇక హారికకు బయట విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల అభిజిత్ తో సమానంగా చార్జ్ చేసిందని సమాచారం.
టాప్ ఫైవ్ లో నిలిచిన వారిలో వీరిద్దరికీ మిగతా వారితో పోలిస్తే డైలీ రెమ్యునరేషన్ పరంగా ఎక్కువ ముట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సీజన్లో ఎక్కువ డబ్బు సంపాదించిన వారి లిస్టులో అభిజిత్, సోహెల్ తర్వాత హారిక మూడో స్థానంలో నిలిచింది అని టాక్.