NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వరుసగా లేఖలు రాస్తూ రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను ఇబ్బంది పెట్టేందుకు శతభిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు సీనియర్ రాజకీయ నేత.. మాజీ మంత్రి, మాజీ ఎంపీ చేగుండి హరిరామ జోగయ్య. అయితే ఇప్పుడు ఆయన పవన్ పై చాలా వ్యూహాత్మకంగా లేఖలు రాస్తూ వస్తున్న నేపథ్యంలో ఆయనకు తగిన ప్రతిఫలం లభించేలా ఉంది. మంచం లెగ‌లేని స్థితిలో ఉన్న జోగయ్య పేరుతో వస్తున్న లేఖలు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న మాట వాస్తవం. ఇటు జోగ‌య్య‌తో పాటు అటు కాపు ఉద్యమనేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఇద్దరు కూడా ప‌వ‌న్‌కు వరుసగా లేఖలు సంధిస్తూ వస్తున్నారు.

తాజాగా జోగ‌య్య ప‌వ‌న్‌పై లేఖ‌ రిలీజ్ చేశారు. అందులో పవన్ పై ఆయన చాలా ఆరోపణలు చేశారు. కొద్దిసేపటికి ఆయన కుమారుడు వైసీపీలో చేరబోతున్నారని ప్రచారం బయటికి వచ్చింది. ఆ వెంటనే జోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడంతోపాటు పవన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిగా జోగయ్య కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. చేగొండి సూర్య ప్రకాష్ జనసేన నేతగా ఆచంట నియోజకవర్గంలో పనిచేస్తూ ఉండేవారు.

ఆయన జనసేనలో ప్రతిష్టాత్మకమైన బీఏసీలో ఉన్నారు. పేరుకు మాత్రం సూర్యప్రకాష్ లీడ‌ర్ గా ఉన్న ఎప్పుడు బయటకు వచ్చి కార్యక్రమాలు చేపట్టింది లేదు. అందుకే ఆ సీటును టిడిపికి కేటాయించారు. పొత్తులో భాగంగా ఆచంట నుంచి మాజీ మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ పోటీ చేస్తారు. దీంతో సూర్య ప్రకాష్ అసంతృప్తి గురయ్యారు. వైసీపీలో చేరితే ఏదో ఒక నియోజకవర్గం నుంచి తనకు పోటీ చేసే అవకాశం లభిస్తుందని అంచనా వేసుకున్నట్టు ఉన్నారు. ఇక వైసిపి కండువా కప్పుకున్న సూర్య ప్రకాష్ కు పాలకొల్లు సీటు కేటాయించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

సూర్య ప్రకాష్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో చిరంజీవి వెంట ఉన్నారు. ఆ తర్వాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి ఆయనపై విమర్శలు చేశారు. చిరంజీవి పాలకొల్లులో నామినేషన్ వేస్తే తాను గెలిపిస్తానని భరోసా ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో సూర్య ప్రకాష్ చిరంజీవి కోసం సరిగా పనిచేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ ను పొగిడారు. మళ్ళీ సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత జనసేన చెంత ఉన్నారు. ఇక పాలకొల్లులో వైసీపీకి సరైన అభ్యర్థి లేరు.

ఇక్కడ నుంచి టీడీపీ తరఫున నిమ్మల రామానాయుడు వరుస విజయాలు సాధిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే డాక్ట‌ర్ బాబ్జిని పక్కనపెట్టి ఆ తర్వాత ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ కు ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత శ్రీనివాస్‌ను కూడా తప్పించి గుడాల గోపికి ఇన్చార్జి పగ్గాలు ఇచ్చారు. రామానాయుడు ను ఢీకొట్టడం గోపి వల్ల కూడా కావడం లేదన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ఇప్పుడు చేగొండి సూర్య ప్రకాష్ కు పాలకొల్లు సీటు ఇచ్చి రామానాయుడుపై పోటీకి దింపాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అందుకోసమే పట్టుబట్టి మరి సూర్య ప్రకాష్ ను వైసీపీలో చేర్చుకున్నట్టు తెలుస్తోంది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N