Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఓన్ లో.. కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన హరితేజ అప్పట్లో టాప్ ఫైవ్ లోకి వెళ్లడం తెలిసిందే. హౌస్ లో హరితేజ చెప్పిన బుర్రకథ అన్ని సీజన్లలో కల్ల… అతి పెద్ద హైలైట్ ఎపిసోడ్ గా.. నిలిచింది. సీజన్ వన్ కి హోస్ట్ గా చేసిన.. ఎన్టీఆర్.. అప్పట్లో హరి తేజ ని బాగా ఆట పట్టించడం జరిగింది. హౌస్ నుండి బయటకు వచ్చాక ఆమెకంటూ సపరేట్ క్రేజ్ భారీగా క్రియేట్ కావడంతో సినిమా ఇండస్ట్రీలో బాగానే అవకాశాలు అందుకుని సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సీజన్ లో.. ఓ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయడం జరిగింది.
హరితేజ ఆర్ జే కాజల్ కి మద్దతు
విషయంలోకి వెళితే.. ఆర్ జే కాజల్ కి మద్దతు తెలపడం జరిగింది. సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చిన హరితేజ.. ప్రస్తుతం హౌస్ లో ఎంటర్టైన్మెంట్ పరంగా.. కాజల్ న్యాయం చేస్తుందని ఈ వారం ఆమె నామినేషన్ లో ఉండటంతో.. ఖచ్చితంగా ఆమెను ఓట్లు వేసి గెలిపించాలని సేవ్ చేయాలని కోరారు. కచ్చితంగా కాజల్ కి సపోర్ట్ చేస్తే టాప్ ఫైవ్ లో నిలబడుతుందని స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ఆమెకు సపోర్ట్ చేయాలని కోరుతూ వీడియో లో హరితేజ.. తన ఫాలోవర్స్ కి చెప్పటం జరిగింది. మరోపక్క సందీప్ కిషన్ హీరో తనీష్.. మానస్ కి సపోర్ట్ చేశారు. మెగా బ్రదర్ నాగబాబు.. ప్రియాంక సింగ్ కి సపోర్ట్ చేయడం జరిగింది. ఈ తరుణంలో.. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్.. హరితేజ కాజల్ కి సపోర్ట్ చేయటం.. సంచలనంగా మారింది.
రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్
మరోపక్క గత సీజన్ కంటెస్టెంట్ సింగర్ నోయల్… ఈ సీజన్ లో.. తన తోటి సింగర్ శ్రీరామ్ చంద్ర కి మద్దతు తెలిపారు. గతంలో నోయల్ మద్దతు తెలిపిన రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్ గెలవడంతో ఈసారి నోయల్ శ్రీరామ్ కి.. మద్దతు తెలపడంతో పాటు.. శ్రీరామ్ గేమ్ కూడా..హౌస్ లో.. క్లియర్ కట్ గా ఉండటంతో.. టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు నోయల్.. సెంటిమెంట్ రిపీట్ అయ్యే చాన్స్ ఎక్కువే అని బయట జనాలు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు ముందు నుండే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు సపోర్ట్.. చేస్తూ ఉండటం.. విశేషం. గతంలో లో టాప్ ఫైవ్ కి షో చేరుకున్న టైంలో.. సెలబ్రిటీలు బయటకు వచ్చి తమ మద్దతు తెలిపేవారు. కానీ ఈసారి ముందు నుండే సపోర్ట్ చేయటం జరిగింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?