హైకోర్టు తీర్పుపై హర్షం

తిరుమల డిసెంబర్ 25: తిరుమల తిరుపతి దేవస్థానం అర్చక వ్యవస్థపై దేవదాయశాఖ, టీటీడీలకు నిర్ణయాలు తీసుకునే హక్కులేదని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. అర్చకులకు వయోపరిమితి నిర్ణయించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ చేసిన తప్పును ఎత్తి చూపుతూ అర్చకులకు సానుకులంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో కూడా ఇదే తీర్పు వెలువడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అర్చకత్వాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని స్వరూపనందేంద్ర సరస్వతి ఆవేదన వ్యక్తం చేశారు. అర్చకత్వం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కాదని అర్చకత్వం వంశపారంపర్య వృత్తి అని పరిపూర్ణనంద స్పష్టం చేశారు.