విజయం కోసం మరో రోజు ఆగాల్సిందే!

మెల్ బోర్న్ టెస్ట్ లో భారత్ విజయం కోసం మరో రోజు ఆగాల్సిందే. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా 8 వికెట్లు నష్టపోయి 258 పరుగులు చేసింది. 399 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ కమ్మిన్ చివర్లో  భారత్ కు విజయానికి మధ్య గోడలా నిలిచాడు. ఈ క్రమంలో కమ్మిన్స్ హాఫ్ సెంచరీ సాధించాడు. నాలుగో రోజు ఆట ముగిసే సరికి కమ్మిన్స్60 పరుగులతో ఆడుతున్నాడు. విజయం కోసం ఆసీస్ ఇంకా 141 పరుగులు చేయాల్సి ఉంది. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న పిచ్ పై ఆసీస్ బ్యాట్స్ మన్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారనే చెప్పాలి. నాలుగో రోజే ముగియాల్సిన మ్యాచ్ ను కమ్మిన్స్ ఐదో రోజుకు పొడిగించాడు.