Proverbs: సామెతలుఅనేవి ప్రసంగానికి దీపాల్లాంటివి అని గుర్తుపెట్టుకోవాలి. అవి సంభాషణకు కాంతినిస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. సామెతలో ధ్వని ఉంటుంది కాబట్టి ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో తేనే కలిపినంత అద్భుతం గా ఉంటుంది.
Proverbs: అన్ని దానాలలో అన్నదానం మిన్న
మనిషికి చాల ముఖ్య మైన అవసరం ఆహారము.ప్రాణుల ప్రాణమును నిలబెట్టే ఆహారం దానముచేయడం అనేది గొప్ప దానము గా చెప్పబడింది. అంతే కాదు మీరు ఎన్ని కానుకలు ఇచ్చిన తృప్తి చెందని మనిషి కడుపు నిండిన తర్వాత మాత్రం ఇక చాలు అని తృప్తి పడతాడు. ఈ కారణం గానే అన్ని దానాలలో అన్న దానం మిన్న అని అంటారు.
అన్నీ సాగితే రోగమంత సుఖం లేదు:
ఆర్ధిక స్థోమత బాగా ఉండి, సేవలు చేయడానికి మనుషులు ఉన్న వారికి జబ్బుచేసినా, భోగమే అని ఈ సామెత కి అర్ధం.
అజీర్తికి లంఖణం పరమౌషధం.
అజీర్తి అంటే తిన్నది అరగక పోవటమనీ, లంఖణంచేయడం అంటే ఏమీ తినకుండా ఉండటమని అర్ధం. ఆహారం మితం గా తీసుకోకపోవడం వలన అజీర్తి సమస్య వస్తుంది.కాబట్టి ఒక పూట భోజనం తినడం ఆపేస్తే తిన్న ఆహారం జీర్ణమై, పొట్టలో ప్రశాంతత వస్తుంది. కాబట్టే మన పెద్దలు అజీర్తికి లంఖణం పరమౌషధం గా పని చేస్తుంది అని తెలియచేసారు. అచ్చు వేసిన ఆబోతువలె: బాగా ధృడమైన ఎద్దును ఆంబోతు అని అంటారు. పొలం పనులకు, మరి ఏ ఇతర పనులకూ ఉపయోగ పడదు అని నిశ్చయించుకొని, దాని శరీరం మీద ఒక ముద్రను, వేసి ఊరిలో వదలి వేస్తారు. అదేవిధంగా మాట వినకుండా, పని పాటు లేకుండా తినేసి ఊరుమీద తిరిగే వారిని ఇలా అంటుంటారు.
అప్పు ఆదా కాదు – వాపు బలుపూ కాదు:
అప్పు చేసి తీసుకున్న డబ్బు సంపాదనా కాదు, అలాని పొదుపూ కాదు. అలాగే శరీరం లో కొన్ని అవయవములు వాచినంత మాత్రాన అది బలం కాదు అనారోగ్యముతో అని తెలుసుకోవాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?