Thinking: వీటి గురించి  ఎప్పుడైనా ఆలోచించారా ?? ఆలోచించండి మంచి ఎనర్జీ వస్తుంది!!

Share

Thinking: జీవితంలో ఎప్పుడు   ఎవరిని  పనికి రాని వారిగా భావించవద్దు. ఎవరు ఎప్పుడు కాలం కలసి వచ్చి ఉన్నతులు అవుతారు అనేది  ఎవరు చెప్పలేరు.  అస్తమానం  ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి  మంచి పువ్వుల సువాసన వదిలి, పుండు మీద వాలే ఈగ లాంటి వాడు అవుతాడు అనేది పెద్దల మాట. ఎందుకంటే ప్రతి వ్యక్తి లో ఏదో ఒక మంచి ఉంటుంది. అది చూడాలి కాని,కేవలం తప్పులు చూడడం సరైన పని కాదు.

Thinking:  నీ దగ్గర డబ్బు లేనప్పుడు

నీ దగ్గర డబ్బు లేనప్పుడు  ఆప్తులు  కూడా  పరాయి వారవుతారు.  అదే  డబ్బు ఉంటే మాత్రం  పరాయి వారు   కూడా  ఆప్తులు అవుతారు. జీవితంలో  ఏది జరిగిన మన మంచికే అనుకున్న రోజు నీకు అస్సలు కష్టమనేది ఉండదు. అలా అనుకోవడం కొంచెం  కష్టం  కావచ్చు..  కానీ అనుకుని చూడు  స్వర్గం ని కాళ్ళ దగ్గర ఉంటుంది.

మనిషికి రోగాలు ఎప్పుడు కుందేలు  అంత వేగం గా వచ్చి  తాబేలు  అంత నెమ్మదిగా వెళ్తాయి.  డబ్బులు మాత్రం  తాబేలు లాగా వస్తాయి.. కుందేలు లాగా  వెళ్లిపోతాయి.దేవుని ప్రార్ధించినప్పుడు నాకు ఏమి ఇవ్వలేదు అని  బాధపడకు  ఎందుకంటే నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆయనకు తెలిసినంతగా మరి ఎవరికి తెలియదు.  ఆయన నీకు  ఇవ్వవలసింది సరైన సమయానికి ఇస్తారు.. కాస్త వేచి చూడు ఫలితం అద్భుతం గా ఉంటుంది.

ఈ సమాజం కి  నేను ఒక్కడిని  మాత్రమే ఏమి చేసిన సరిపోదు అని    నిరాశ చెంది చేయవలసిన కర్తవ్యాన్ని వదలకు ..      ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే అని గుర్తు పెట్టుకుని నువ్వు చేయవలిసింది నువ్వు చేయి.మనకు మాటలు రాక ముందు మనము  ఏమి చెప్పాలనుకున్నామో  అది అమ్మ అర్థం చేసుకుని ఆకలితో పాటు అవసరాలు తీర్చింది.   కాని మనము మాటలు  నేర్చిన తర్వాత  ప్రతి చిన్న విషయానికి,  ప్రతిసారి అమ్మా నీకు అర్థం కాదులే అంటాం.ఏమి జన్మ మనది?

కష్టాల్లో ఉన్నప్పుడు అందరు  వదిలేశారు అని   బాధపడకు..    నీవు  ఒక్కడివే అయినాకూడా కష్టాలను సమర్ధవంతం గా ఈదృక్కోగలవాని  వారు నమ్మినందుకు    వారికీ మనస్సులోనే కృతఘ్నతలు తెలుపు.  సిగ్గు మర్యాద లేని  ధనవంతుడు  కన్నా, మంచి, మానవత్వం ఉన్న పేదవారు మిన్న..   నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఏదైతే ఇస్తావో… అదే రెట్టింపై నిన్ను చేరుతుంది  … మంచి కోరతావో,చెడు కొరతావో ఇక నీ ఇష్టం.


Share

Related posts

Viral Photo : వరంగల్ జిల్లాలో అరుదైన దృశ్యం.. ఓ లుక్కేయండి..!!

bharani jella

Corona: క‌రోనాతో కాదు ఎలుక‌ల‌తో చ‌స్తున్నాం… భార‌త్ ను స‌హాయం కోరిన ఆ దేశం

sridhar

YS Jagan: క్యాంపు కార్యాలయంలో విద్యా కానుక కిట్లు.. పరిశీలించిన జగన్..!!

sekhar